నిరుద్యోగ సైన్యం అమెరికా, యూరప్ ల యుద్ధోన్మాదానికి బలవుతున్న వాస్తవాన్ని ఈ వీధి చిత్రంలో వీధి చిత్రకారుడు ‘బ్లూ’ హృద్యంగా చిత్రీకరించాడు. సైన్యంలో చేరడానికి వచ్చిన యువకులు నిలబడ్డ క్యూలను బులెట్ల మ్యాగజైన్లుగానూ, ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లనుండి తిరిగివస్తున్న శవపేటికలు కాల్చాక మిగిలిన ఖాళీ బులెట్లుగానూ చిత్రించిన తీరు నిజంగా అద్భుతం.
–
–

ఇలాంటి మెగా బొమ్మలు చూస్తుంటే మన ‘చిత్ర ప్రసాద్’ గుర్తొస్తాడు. యుద్ధోన్మాదానికి యువత సమిధ అవుతున్న విషాదాన్ని ఈ వీధి చిత్రం బలీయంగా వ్యక్తం చేస్తోంది. కళాకారులకు భావనాశక్తి తీవ్రంగా ఉండాలే కానీ దాన్ని ఏ మీడియం అయినా శక్తిమంతంగా ప్రతిఫలిస్తుందన్నమాట!
అవును, ముఖ్యంగా వీరికి కాన్వాస్ ఇలానే ఉండాలన్న నియమం లేకపోవడమే నాకు అద్భుతంగా తోస్తుంది.
అద్భుతమైన భావన క్యాన్వాస్పై చిత్రించిన తీరూ నూ…