‘పాంచజన్యం’ (బంచ్ ఆఫ్ ధాట్స్) పుస్తకానికి ‘పరిచయం’ ఇది


భారత దేశంలో ముస్లింల విషయంలో ఆర్.ఎస్.ఎస్ సంస్ధ భావాల గురించి చెబుతూ నేను గురు గోల్వాల్కర్ రచించిన పుస్తకం ‘వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్’ నుండి నేను కొన్ని అంశాలను ఉటంకించాను. అయితే, ఆ పుస్తకం ప్రతి ఇప్పుడు ఆర్.ఎస్.ఎస్ వెబ్ సైట్ లో కూడా లేదనీ, సామాన్య పాఠకులెవరికీ అందుబాటులో లేదనీ అవన్నీ ఇప్పుడు అవసరమా అని మిత్రులు కొందరు ప్రశ్నిస్తున్నారు. గురు గోల్వాల్కర్ కి సంబంధించిన ఆ భావాలు ఇప్పుడు ఆర్.ఎస్.ఎస్ స్వీకరించడం లేదని నేరుగా చెప్పకుండానే ఆ అర్ధం వచ్చేలా మిత్రులు వ్యాఖ్యలు రాశారు. ఆ పుస్తకం కంటే “బంచ్ ఆఫ్ ధాట్స్” ఆర్.ఎస్.ఎస్ కు ప్రామాణిక గ్రంధమనీ, అందులో అంశాల ప్రాతిపదికన చర్చిస్తే బాగుంటుందని పెద్దలు రాజశేఖర రాజుగారు సలహా ఇచ్చారు. ఇదే పుస్తకాన్ని తెలుగులో ‘పాంచజన్యం’ గా శ్రీ కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావుగారు అనువదించారు. ఆ పుస్తకానికి తెలుగు పుస్తకాలను పరిచయం చేసి అమ్మకాలు సాగించే avkf.org వారు తమ వెబ్ సైట్ లో ఒక పరిచయం రాశారు. ఆ పరిచయాన్ని స్క్రీన్ సేవ్ చేసి దిగువను ఇస్తున్నాను. పాఠకులకు ఉపయుక్తంగా ఉంటుందని దీనిని ఇస్తున్నాను.

Panchajanyam introduction

ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలకు ఈ పుస్తకం భగవద్గీత వంటిదని కూడా పై పరిచయంలో పేర్కొనబడింది. కనుక ఈ పుస్తకం పైన ఎవరికీ అభ్యంతరాలు ఉండవలసిన అవసరం లేదు.

ఇందులో ముస్లింలు, క్రైస్తవులు, సామ్యవాదుల గురించి గురు గోల్వాల్కర్ కి ఉన్న అంచనా ఒక్క ముక్కలో వివరించబడి ఉంది. ఈ వివరణను బట్టి నేను “వుయ్ ఆర్ ….” పుస్తకం నుండి ఉటంకించిన భావాలు చెక్కుచెదరలేదనీ, అవి ఇప్పటికీ గౌరవనీయమేననీ అర్ధం అవుతున్నది.

6 thoughts on “‘పాంచజన్యం’ (బంచ్ ఆఫ్ ధాట్స్) పుస్తకానికి ‘పరిచయం’ ఇది

  1. మతాన్ని మార్చుకున్నవాళ్ళు జాతికి దూరమవుతారని గురు గోళ్వాల్కర్ అభిప్రాయం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనే మస్జీద్‌కి ఎదురుగా ఉన్న రోడ్ మీదుగా హిందువులు ఊరేగింపు చేస్తే ముస్లింలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ ముస్లింలు తక్కువగా ఉన్న ప్రాంతాలలో మస్జీద్ ఎదురుగా ఉన్న రోడ్ మీదుగా హిందువులు ఊరేగింపులు జరపడం సాధారణ విషయమే. పురీ రథ యాత్ర సమయంలో శ్రీకాకుళం పట్టణంలో కూడా స్థానిక జగన్నాథ ఆలయంలో రథ యాత్ర జరుగుతుంది. ఆ రథ యాత్ర జరిగే దారిలో మస్జీద్ ఉన్నా అక్కడ ముస్లింల సంఖ్య చాలా తక్కువ కనుక వాళ్ళు అడ్డు చెప్పలేరు. మస్జీద్ వీధిలో ఊరేగింపు జరపడానికి ముస్లింలు ఒప్పుకోనంతమాత్రాన హిందువులు మాత్రం అగ్రహారం వీధిలో ఉర్స్ ఊరేగింపుకి అనుమతిస్తారని అనుకోలేము. మీరా జాస్మిన్, ఏసు దాస్‌లు హిందూ దేవాలయాలలోకి వెళ్ళడం వల్ల ఎంత గొడవ జరిగిందో మీకు తెలిసే ఉంటుంది.

  2. మతేతర లేదా మతాతీత కారణాలు జోక్యం చేసుకోకుంటే వివిధ మతస్తుల పండుగలు, ఆచార వ్యవహారాలను అన్ని మతాల వారూ గౌరవించడం, పాలు పంచుకోవడం అనే ప్రక్రియకు మన దేశంలో భంగం వాటిల్లి ఉండేదేమో. మన పల్లెటూళ్లలోని గంగమ్మ జాతర్ల నుంచి గణేశ్ ఉత్సవాల వరకు ముస్లింలు అసంఖ్యాకంగా తమ వంతుగా పాలు పంచుకొంటూనే ఉన్నారు గణేష్ ఉత్సవాలకు అవసరమైన సామగ్రిని దశాబ్దాలుగా ముంబైలో ముస్లిం కుటుంబాలే ఏటా అందజేస్తూ వస్తున్నాయని మూడేళ్ల క్రితమే పత్రికల్లో వార్తలు విశేషంగా వచ్చాయి.

    పూర్తిగా విరుద్ధమైన మత విశ్వాసాలు, నమ్మకాలు సహజీవనం చేస్తున్న ప్రాంతంలో, దేశంలో మనోభావాలు దెబ్బతినడానికి అతి చిన్న ప్రేరేపిత కారణం చాలు. అడ్డు చెప్పడం చెప్పలేక పోవడం అనే కారణాల ప్రాతిపదికన కాకుండా ఒకరి మత విశ్వాసాలను మరొక మతం వారు పరస్పర సహనభావంతో అర్థం చేసుకునే తత్వానికి దెబ్బ తగిలిన తర్వాతే కదా ఈ తేడాలు, విద్వేషాలు అన్నీ వచ్చింది?

    వందేళ్ల క్రితం గురజాడ అప్పారావు గారు దేవుళ్లారా మీ పేరేమిటి కథలో పొందుపర్చిన ఆధునిక భావ సంస్కారం రాజకీయ కారణాల వల్ల ఇప్పుడు కనుమరుగయిందేమో.

  3. వ్యాపారానికి మత అవధులు ఉండవు. అయోధ్యలో హిందూ దేవాలయాలకి పూలు అమ్మేది ముస్లిం వ్యాపారులే. మా పట్టణంలో కూడా సంక్రాంతి నాడు ముస్లిం వ్యాపారుల దగ్గరే పూలు కొంటారు.

  4. వృత్తిపరమైన విషయాలలో ఎవరూ మతం గురించి ఆలోచించరు. అందుకే హిందూ దేవాలయాలకి ముస్లింలు పూజా సామ్రాగ్రి అమ్మడం జరుగుతోంది. పొట్టకూటి కోసం ఏవో వస్తువులు తయారు చేసుకుని అమ్ముకునేవాళ్ళతో సమస్య లేదు కానీ కొందరు “educated elite class” వాళ్ళతోనే సమస్య ఉంది. మతం ఊహాజనితం అని ఒప్పుకుంటూనే ఊహాజనితమైన మతం కోసం పక్క దేశాన్ని ద్వేషిస్తారు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమైతే ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమంలో భాగంగానే పాకిస్తాన్‌ని ఎదిరించాలి కానీ వాళ్ళని వేరే జాతిగా చూడడం, మతం పేరుతో ద్వేషించడం సమర్థించలేనివి.

  5. “…పాకిస్తాన్ ఉగ్రవాద దేశమైతే ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమంలో భాగంగానే పాకిస్తాన్‌ని ఎదిరించాలి కానీ వాళ్ళని వేరే జాతిగా చూడడం, మతం పేరుతో ద్వేషించడం సమర్థించలేనివి…”

    వెల్ సెడ్ ప్రవీణ్!

  6. ఇది మినిమమ్ సెన్స్‌కి సంబంధించిన విషయం. దొంగతనం చేసినవాణ్ణి దొంగతనం చేసినందుకే కొడతారు కానీ కులం పేరు చెప్పి కొడతారా? పాకిస్తాన్‌ని కేవలం ఉగ్రవాద దేశంగా పరిగణించాలి కానీ వాళ్ళు వేరే జాతివాళ్ళనో, వేరే మతంవాళ్ళనో చెప్పి ద్వేషించాల్సిన పని లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s