‘గ్రీన్ హౌస్ వాయువుల’ విడుదలతో వాయు, జల, భూతల కాలుష్యం పెచ్చరిల్లి భూగ్రహం పైన అనేక విపరీత పరిణామలు సంభవిస్తున్నాయి. ఎన్నడు ఎరుగని రీతిలో వరదలు పట్టణాలనూ, ఊళ్ళనూ ముంచెత్తుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు విపరీత స్ధాయిలో కురుస్తుండడం వల్ల ఊళ్ళకి ఊళ్ళే జలాశయాలుగా మారుతుండగా మరి కొన్ని చోట్ల సంవత్సరాల తరబడి వర్షాలు కురవక కరువు పరిస్ధితులు ప్రజలను అల్లాడిస్తున్నాయి.
–
–