ఇంగ్లండును అధిగమించిన బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్ధ


ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఉన్న ఇంగ్లండును బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్ధ అధిగమించింది. ఇప్పటివరకు ఏడవ స్ధానంలో ఉన్న బ్రెజిల్ బ్రిటన్ ని ఆరవ స్ధానం నుండి కిందికి నెట్టి ఆ స్ధానానికి చేరుకుందని ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ బిజెనెస్ రీసర్చ్’ (సి.ఇ.బి.ఆర్) తెలిపింది. ఈ సంస్ధ తాజాగా వెలువరించిన ‘వరల్డ్ ఎకనమిక్ లీగ్ టేబుల్’ లో ఆసియా దేశాలు పై స్ధానాలకు చేరుతుండగా, యూరప్ దేశాలు కింది స్ధానాలకు చేరుతున్నాయన కూడా తెలిపింది.

బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ 2016 నాటికల్లా ఫ్రాన్సును అధిగమిస్తుందని సి.ఇ.బి.ఆర్ అంచనా వేస్తోందని బి.బి.సి వార్తా సంస్ధ తెలిపింది. 2012 లో యూరోప్ సంక్షోభ పరిష్కరించబడినట్లయితే 0.6 శాతం కుచించుకుపోతుందనీ లేనట్లయితే 2 శాతం కుచించుకుపోతుందని సి.సి.బి.ఆర్ అంచనా తెలిపింది. ప్రపంచంలో జరుగుతూ వచ్చిన పరిణామాలలో భాగంగానే బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్ధ బ్రిటన్ ని అధిగమించిందని సి.ఇ.బి.ఆర్ సి.ఇ.ఓ డగ్లస్ మెక్ విలియమ్స్ బిబిసి రేడియో ఫోర్ కి తెలిపాడు.

Rank 2011 2020 (forecast)

1

US

US

2

China

China

3

Japan

Japan

4

Germany

Russia

5

France

India

6

Brazil

Brazil

7

UK

Germany

8

Italy

UK

9

Russia

France

10

India

Italy

ప్రపంచవ్యాపితంగా వస్తున్న ఆర్ధిక మార్పుల ధోరణిలో భాగంగానే బ్రెజిల్ పైకి ఎగబాకిందనీ, ఆర్ధిక కేంద్రీకరణ మెల్లగా పశ్చిమ దేశాలనుండి తూర్పు దేశాలకు మారుతున్నదని విలియమ్స్ తెలిపాడు. అలాగే ముఖ్యమైన సరుకులు ఆహారం, ఇంధనం ఉత్పత్తి చేసే దేశాల ఆర్ధిక వ్యవస్ధల పనితనం ఇప్పటికీ మెరుగ్గా కొనసాగుతోందని ఆయన ఎత్తి చూపాడు. ఆ దేశాలు క్రమంగా ఎకనమిక్ లీగ్ టేబుల్ లో పై స్ధానాలకు ఎగబాకుతున్నాయని తెలిపాడు.

ఐ.ఎం.ఎఫ్ వెలువరించిన గణాంకాల ఆధారంగా తయారు చేయబడ్డ ఒక నివేదిక కూడా 2011 నాటికల్లా బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్ధ, బ్రిటన్ ని అధిగమిస్తుందని అంచనా వేయడం గమనార్హం. బ్రెజిల్ జనాభా ఇరవై కోట్లు కాగా, అది బ్రిటన్ జనాబా కంటె దాదాపు మూడు రెట్ల కంటే ఎక్కువే. రష్యా ఆర్ధిక వ్యవస్ధ లీగ్ టెబుల్ లొ ఒక స్ధానం ఎగబాకి తొమ్మిదవ స్ధానానికి చేరింది. 2020 నాటికల్లా రష్యా నాలుగవ స్ధానానికి చేరుకుంటుందని సి.ఇ.బి.ఆర్ అంచనా వేసింది.

ప్రపంచంలో పదవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఉన్న ఇండియా 2020 నాటికి ఐదవ స్ధానానికి చేరుకోగలదని అంచనా వేస్తున్నారు. 2020 నాటికి జర్మనీ ఏడవ స్ధానానికీ, బ్రిటన్ ఎనిమిదవ స్ధానానికీ, ఫ్రాన్సు తొమ్మిదవ స్ధానానికి పడిపోనున్నాయని సి.ఇ.బి.ఆర్ అంచనా వేస్తోంది.

వ్యాఖ్యానించండి