కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికల తేదీలు ప్రకటించింది. తద్వారా మినీ సాధారణ ఎన్నికలకు తెరతీసింది. రాజకీయ పార్టీలను అప్రమత్తం చేసింది. వ్యాహాలు, ప్రతి వ్యూహాలకు బదులుగా రాజకీయ పార్టీలు కులం, మతం, ప్రాంతం, డబ్బు, మద్యం, స్నేహాలు, బంధుత్వాలు, శతృత్వాలు… ఇలా అందుబాటులో ఉన్నవాటన్నింటినీ ఉపయోగించుకునేందుకు ఇక సిద్ధం కానున్నాయి.
| రాష్ట్రం | సీట్లు |
ఎన్ని విడతలు |
ఎప్పుడు? |
కౌంటింగ్ |
| ఉత్తర ప్రదేశ్ | 403 | 7 |
ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 28 వరకు |
మార్చి 4, 2012 |
| ఉత్తర ఖండ్ | 70 | 1 | జనవరి 30 | మార్చి 4, 2012 |
| మణిపూర్ | 60 | 1 | జనవరి 28 | మార్చి 4, 2012 |
| పంజాబ్ | 117 | 1 | జనవరి 30 | మార్చి 4, 2012 |
| గోవా | 40 | 1 | మార్చి 3 | మార్చి 4, 2012 |
- ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై.ఖురేషి, ఎన్నికల కమిషనర్లు వి.ఎస్.సంపత్, హెచ్.ఎస్.బ్రహ్మలు విలేఖరుల సమావేశమ్లో పాల్గొన్నారు.
- మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తక్షణం అమలులోకి వస్తుంది.
- ఆయా రాష్ట్రాల పోలీసులతో పాటు ఎనభై వేల పారామిలట్రీ బలగాలను భారత దేశ గొప్ప ప్రజాస్వామిక ఎన్నికలకు వినియోగిస్తారు.
- కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది. ఒక జోక్ కూడా పేల్చింది. గత ఇరవై రెండు సంవత్సరాలుగా కులం, మతం, అవినీతి లతో యు.పి రాష్ట్రం కొట్టుమిట్టాడుతోందనీ ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని వాటి బారినుండి విముక్తి కలిగిస్తుందనీ చెప్పడమే ఆ జోక్.
- ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలలో, యూనివర్సిటీలలో 4.5 శాతం రిజర్వేషన్లు కేటాయించడానికి కేబినెట్ నిర్ణయించడాన్ని బి.జె.పి వ్యతిరేకించింది.
- ఉత్తర ప్రదేశ్ లో ముస్లింల్ జనాభా పద్దెనిమిది శాతం ఉండడంతో వారి ఓట్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి.
ఇక దేశంలో శబ్ద కాలుష్యం, రాజకీయ కాలుష్యంతో పాటు అన్ని కాలుష్యాలు జడలు విప్పుతాయి. ప్రజలకి ఇబ్బందులు తప్పవు.