‘హిందూ సంస్కృతిని ఆచరించండి లేదా హిందూ జాతికి బానిసలు కండి” -ఆర్.ఎస్.ఎస్ గురువు గోల్వాల్కర్


(రష్యాలో భగవద్గీతపై నిషేధానికి సంబధించి నేను రాసిన పోస్టు కింద ఓ మిత్రుడు చేసిన వ్యాఖ్యకు ఈ పోస్టు సమాధానం గా గ్రహించగలరు)

గోల్వార్కర్ ఆర్.ఎస్.ఎస్ కి రెండవ గురువు అన్న సంగతి విదితమే. హెడ్గేవార్ ఆర్.ఎస్.ఎస్ స్ధాపించినప్పటికీ గోల్వార్కర్ నేతృత్వంలో ఆర్.ఎస్.ఎస్ భావాజాలం అభివృద్ధి చెందిందని అందరూ అంగీకరిస్తారు. భారత దేశంలో ముస్లింల భవిష్యత్ పై ఆర్.ఎస్.ఎస్ అభిప్రాయాలు ఎలా ఉన్నదీ గురు గోల్వార్కర్ మాటల్లోనే తెలుసుకోవడం ఉచితంగా ఉంటుంది. “వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్” (We or Our Nationhood Defined) అన్న పుస్తకాన్ని గురు గోల్వాల్కర్ రచించారు. ఆ పుస్తకం నుండి కొన్ని అంశాలను చూద్దాం. ఆయన భారత దేశంలో ముస్లింలను గురించి ఇలా అన్నాడు.

హిందూస్ధాన్ (భారత దేశం)లో ఉన్న విదేశీ జాతులు (races) హిందూ సంస్కృతినీ, భాషనూ అవలంబించడమైనా చేయాలి, హిందూ మతం పట్ల గొప్ప భక్తి శ్రద్ధలను కలిగి ఉండి దానిని గౌరవించడం నేర్చుకోవాలి, హిందూ జాతి, సంస్కృతులను అనగా హిందూ జాతిని కీర్తించడం తప్ప మరే భావజాలాన్నీ వారు కలిగి ఉండకూడదు, మరియు వారి ప్రత్యేక ఉనికిని వదులుకొని హిందూ జాతిలో కలిసి పోవాలి లేదా దేశంలో ఉంటూ పూర్తిగా హిందూ జాతి కింద బానిసలుగా (సబార్డినేట్) ఉండాలి, దేనినీ తమదిగా చెప్పరాదు, ఎటువంటి సౌకర్యాలనూ వారు అనుభవించలేరు, ప్రాధాన్యతా ట్రీట్‌మెంట్ వారికి ఉండరాదు -పౌర హక్కులు సైతం వారికి ఉండరాదు. కనీసం వారికి ఏ ఇతర పద్ధతి (కోర్స్) కూడా అనుసరణకు అందుబాటులో ఉండరాదు. మనము పాత జాతి. మన దేశంలో నివసించడానికి నిర్ణయించుకున్న విదేశీ జాతుల పట్ల పాత జాతులు ఎలా ప్రవర్తిస్తాయో అలానే ప్రవర్తిద్దాం. (‘వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్’ పుస్తకం నుండి)

… … …జర్మన్ జాతి ప్రతిష్ట ఈ రోజుల్లో చర్చాంశంగా ముందుకొచ్చింది. తమ జాతి స్వచ్ఛతనూ, సంస్కృతినీ కాపాడుకోవడానికి జర్మనీ తన దేశాన్ని సెమిటిక్ జాతి -యూదులు- లేకుండా శుభ్రపరచడం ద్వారా ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ఇక్కడ జాతి ప్రతిష్ట అత్యంత సమున్నత స్ధాయిలో స్పష్టం చేయబడింది. పునాదిలో విభేధాలున్న జాతులు మరియు సంస్కృతులు ఒకే మొత్తంగా కలిసి పోవడం దాదాపుగా ఎంత అసాధ్యమో జర్మనీ చాటి చెప్పింది. హిందూస్ధాన్ లో ఉపయోగించడానికీ, నేర్చుకుని లబ్ది పొందడానికీ ఇది మంచి పాఠం. (‘వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్’ పుస్తకం నుండి)

పైన ఉదహరించిన గురు గోల్వాల్కర్ బోధనలనుండి మనకు ఏమి తెలుస్తోంది. ముస్లింలు తమ ప్రత్యేక ఉనికిని వదులుకుని హిందూ జాతిలోనైనా కలిసి పోవాలి లేదా హిందూ జాతికి బానిసలుగానైనా పడి ఉండాలి అని ఆయన బోధించినట్లు అర్ధం అవుతోంది. ఆయన నేరుగా ‘బానిసలు గా ఉండాలి’ అన్లేదు కదా అని కొందరు తెలివిగలవారు ప్రశ్నించవచ్చు. నిజమే నేరుగా అన్లేదు గానీ బానిసల జీవనవిధానాన్నే ఆయన ముస్లింలకు (విదేశీ జాతులకు) ప్రబోధించాడు. హిందూ జాతికింద ఉండాలనీ, దేనినీ తమదిగా చెప్పరాదనీ (ఆస్తి హక్కులు ఉండరాదని), స్వంత ఉనికిని వదులుకోవాలనీ, అసలు పౌర హక్కులనే వదులుకోవాలనీ ఆయన చేసిన బోధన అంతా బానిసలకు సంబంధించింది తప్ప మరొకటి కాదు. మానవ జాతి చరిత్రను పరికిస్తే కనీస పౌర హక్కులు లేకుండా బతికింది బానిస వ్యవస్ధలో బానిసలు మాత్రమే. ఆ తర్వాత వచ్చిన ఫ్యూడల్ వ్యవస్దలో రైతులకు ఆస్తి హక్కులు ఉన్నాయి. ఇక్కడ భారత దేశంలో ముస్లింలకు ఆస్తి హక్కు కూడా (పౌర హక్కుల్లో ఇదీ ఒకటి) ఉండరాదని గురు గోల్వార్కర్ బోధించాడు. విదేశీ జాతులు అని పేర్కొనడం ద్వారా గురు గోల్వార్కర్, ముస్లిం ప్రజలు లేదా జాతి భారత దేశానికి చెందినవారు కాదనీ, విదేశీయులనీ చెప్పాడు. అంతేకాక భారత దేశంలో ఉన్న ముస్లింలు కూడ విదేశీయులేనని ఆయన స్పష్టం చేశాడు.

అంతేనా! గురు గోల్వార్కర్, యూదులపైన జాతి హత్యాకాండను అమలు జరిపిన జర్మనీని ఆదర్శవంతమైనదిగా కీర్తించాడు. ప్రపంచం అంతా జర్మనీని ఫాసిస్టు దేశంగా, హిట్లర్ ను ఫాసిస్టు నియంతగా తిట్టిపోస్తుంటే ఇక్కడ గురు గోల్వాల్కర్ మాత్రం జర్మనీ తన దేశాన్ని యూదు జాతి లేకుండా శుభ్రపరుచుకుందని కీర్తించాడు. తద్వారా తాను స్వచ్ఛమైన, కల్తీ లేని జాతిగా ఆవిర్భవించిందని కీర్తించాడు. పైగా జర్మనీ పాఠాలు హిందూస్ధాన్ లో అమలు చేయాలని కాంక్షించాడు. తద్వారా భారత దేశంలో హిందూ జాతిని స్వచ్ఛం కావించాలని ఆయన సందేశం ఇచ్చాడు. హిందూ జాతిని స్వచ్ఛం కావించడం అంటే ఇక్కడ ఉన్న విదేశీ జాతులను ఇక్కడినుండి తరిమి వేయాలి. జర్మనీ యూదులను గుంపుగుంపులుగా చంపేసి తరిమేసినట్లుగా భారత దేశం కూడా ముస్లింలను గుంపులు గుంపులు గా చంపేసి ఇక్కడినుండి తరిమి కొట్టాలి. గుజరాత్ లో ముస్లింలపై సాగించిన నరమేధం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. గుజరాత్ రాష్ట్రం ఆర్.ఎస్.ఎస్ భావాజాలానికి ఒక ప్రయోగశాల గా భాసిల్లుతున్న విషయం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం.

ఇందులో ఏవైనా అంశాలను పిడివాదంగా ఎంచి ఆర్.ఎస్.ఎస్ సవరించుకున్నదేమో తెలియదు. అటువంటిది ఏమైనా ఉంటే సంబంధిత మిత్రులు తెలియజేయగలరని ఆశిస్తున్నాను.

54 thoughts on “‘హిందూ సంస్కృతిని ఆచరించండి లేదా హిందూ జాతికి బానిసలు కండి” -ఆర్.ఎస్.ఎస్ గురువు గోల్వాల్కర్

 1. this book or content is not known to even a small percentage of people. what will we achieve in digging these things up? understood that you have put this for arguements sake.
  but people have moved on from the days of mslim kings cruelties on hinds and retaliations and so on until the gujrt incident.
  what is the use in raking up these again and educate people on what they dont know?

 2. సంజయ్ గారూ, నేనీ పోస్టు ఎందుకు రాశానో ప్రారంభంలోనే రాశాను. గమనించలేదా?

  చివరన కూడా ఆర్.ఎస్.ఎస్ సంస్ధ గురు గోల్వాల్కర్ బోధనలలో నేను ప్రస్తావించిన అంశాలను ‘పిడివాదం’ గా భావించి సవరించుకుందేమో నాకు తెలియదనీ, అలా సవరించుకుంటే తెలియజేయగలరనీ ఆశించాను. అదీ గమనించలేదా?

  పుస్తకంలోని అంశాలు ప్రజల్లో ఎంతమందికి తెలుసన్నది పెద్ద విషయం కాదు. ఆ సిద్ధాంతం ఆర్.ఎస్.ఎస్ ఇంకా నమ్ముతున్నదా లేదా అన్నదే అసలు విషయం. ఆ సిద్ధాంతాలను వదులుకున్నట్లయితే అది కూడా ప్రస్తావించుకోవలసిన విషయమే. ఆర్.ఎస్.ఎస్ గురువు బోధించిన అంశాలను కేవలం ప్రస్తావించినందుకే మీరు ‘ఆ విషయాలని ఇప్పుడు తవ్వాలా’ అని అడుగుతున్నారు. ఎందువలన? అవి ఇప్పుడు ప్రస్తావించకూడనివా? ఆర్.ఎస్.ఎస్ ఆ బోధనలను విస్మరించిందా? వదులుకుందా? చెప్పగలరా? నాకు సమాధానం ఇవ్వండి.

  అవును. ప్రజలు రాజుల క్రూరత్వాలను దాటి వచ్చేశారు. కాని ఆర్.ఎస్.ఎస్, దాని అనుబంధ సంస్ధలు మాత్రం తాము రాలేమనే కదా బాబ్రీ మసీదును కూల్చింది? ముస్లిం రాజుల క్రూరత్వం గురించి తాజాగా ఓ బ్లాగర్ ఒక పోస్టు కూడా రాశారు. ఇంకా రాస్తూనే ఉంటారు. వారంతా రాజుల కాలాన్ని తాము మర్చిపోలేమని చెబుతున్నారు. మీరు వింటున్నారా?

 3. sare muslim jathi kadu boss oka viswasam ane vishaya meeru telusukovali….asalu motta modati manvudiki jathi antu emi ledu .hidu jahti ani gravapadutunna golvalkar garu ..tanajathi kosam em chesaru ..harijanulani ..gudiloki ranivvanai mee hindu jathi ani meeku telusa …meeru emaina cheyyalanukunte mundu chattanni patishatam cheyyandi..tirupathilo vip ani vvip ani vallaki specal ga treate chestaru kani porr peapole 2 days 3 days nundi line unnavallaki matram oka nimisham kooda …devuni darsanam kakunada tondaraga pampestaru…vip lani oka laga poor peapole oka laga harijanulani oka treate chese meeru mee hindu dhramanni dooram chesukunnaru oka sari masjid lo ki velli choodandi nee daggara dabbu unada nuvvu king va lekapote nuvvu celabretiva ..vip va ani choodarau mundu velli evaru pary lo nilabadi chesatro vallu mundu untaru..venaka vachhina vip aina king aina venake nilabadi pray chestaru…devuni drushtilo andaru samanam ani muslim samajam cheputundi..devuniki endu kayya nagalu ..ratnalu vajaralu ..meeru mee pantullu takkatu pettu kovatani lekapote ammukovataniki kakapote..devudu pettamani mimmalini adigada..a nagalu vajralu bangaram unte india eppudo super power country ayyedi keralao inta dhanam undi ani padmanabha swami..gurinchi oorakae chepparuga a nagalato kerala sate ne poortiga dowlap cheyyavachhu ..meeku teliyada …india lo only muslims matarme leru sikkulani christans ani jain lani chala mandi unnaru evaro ekkado bomb pettarani muslim antha terraristlu ani antunnv mari america em chesindayya..iraq ni kuwait ni pakistan ni syriyani twaralo mana indianikooda emi cheyyarani gyaranty ivvagalava….

 4. It’s sick that some people didn’t move from their thoughts when world is moving…

  Golvalker may commented according situations 80 years ago….Your post title is misleading.It is like raging tensions between Hindus and Muslims

  Everybody got their own views now a days.We cant pressure or feed anything forcefully.

  Regarding RSS.You may better get answers if you see a RSS ideology person or meet them for your answers and let us know.

  God bless you my dear.Let positive attitude begin in your thoughts

 5. నేను ఖురాన్ చదివాను. ఇస్లాం మతం క్రైస్తవ మతాన్నీ, యూదు మతాన్నీ మతాలుగా గుర్తిస్తుంది కానీ విగ్రహారాధక మతాలని మతాలుగా గుర్తించదు. అందుకే ఇండియా నుంచి గల్ఫ్ దేశాలకి వెళ్ళినవాళ్ళు అక్కడ దేవాలయాలు కట్టుకోవడానికి అవ్వదు. కానీ హిందూ మతం చేస్తున్నది ఏమిటి? తమ మతంలోనే కొంత మందిని అంటరానివాళ్ళని చేసి వాళ్ళకి ఆలయ ప్రవేశం లేకుండా చేసింది. తమ మతంలో తమకి ఆలయ ప్రవేశం లేదని క్రైస్తవ మతంలోకో, ఇస్లాం మతంలోకో మారినంతమాత్రాన జాతి మారిపోవడం అనేది జరగదు. ఎందుకంటే హిందూ మతం ఎప్పుడూ అగ్రకులాలవాళ్ళనీ, దళితులనీ వేర్వేరు జాతులవాళ్ళగానే చూస్తుంది. అటువంటప్పుడు హిందువులూ, హిందూయేతరులని మాత్రమే వేర్వేరు జాతులుగా చూడాలనే ప్రొపోజల్ ఎందుకు వచ్చింది?

 6. నేను ఖురాన్ యొక్క తెలుగు అనువాదమే చదివాను. అర్థం కానీ ఉర్దూలోనో, అరబిక్‌లోనో కాదు. ఇస్లాం మతంలో విశ్వాసులు(మోమీన్)లకీ, అవిశ్వాసులు(కుఫ్ర్)లకీ మధ్య మాత్రమే సంఘర్షణ ఉంటుంది. కానీ హిందూ మతం కుల సంఘర్షణలు లేకుండా ఉనికిలో ఉండదు. హిందూ మతం అనేక జాతులుగా విభజితమై ఉన్నప్పుడు ఒక మతం – ఒక జాతి అనే కాన్సెప్ట్‌కి అర్థం ఎక్కడ ఉంటుంది.

 7. నౌషాద్ గారు, అమెరికావాళ్ళు తమని వ్యతిరేకించే దేశాల మీద మాత్రమే బాంబులు వేస్తారు. తమని వ్యతిరేకించని పాలక వర్గాలు ఉన్న ఇండియా లాంటి దేశాలలో ఎంత మత గజ్జి ఉన్నా ఈ దేశాల మీద బాంబులు వెయ్యరు. ఇస్లామిక్ దేశాలలో హిజబ్ (ముసుగు) వేసుకునే ఆచారాన్ని విమర్శిస్తూ సామ్రాజ్యవాద వెబ్‌సైట్‌లు బోలెడన్ని కబుర్లు వ్రాస్తాయి. కానీ పోర్నోగ్రఫీకి వ్యతిరేకంగా ఏమీ వ్రాయవు. అలాగే హిందూ సమాజంలోని దురాచారాలైన వరకట్నం, భర్త చనిపోయిన స్త్రీలకి పసుపు కుంకుమలు తియ్యించడం వంటి వాటిని మాత్రం సామ్రాజ్యవాద మీడియా విమర్శించదు. ముస్లిం స్త్రీలు హిజబ్ వేసుకోవడం తప్పే కానీ ఉత్తర భారత దేశంలో కొంత మంది హిందూ స్త్రీలు కూడా చీర కొంగుని ముఖం చుట్టూ చుట్టుకుంటారు. అది మాత్రం హిజబ్ లాంటి ఆచారం కాదా?

 8. మై డియర్ శేఖర్, ఈ పోస్టు కింద నా వ్యాఖ్యలు కూడా మీరు చదివి ఉండాల్సింది. గోల్వాల్కర్ బోధనల గురించీ, ఆర్.ఎస్.ఎస్ అవగాహన గురించి నేను కొన్ని ప్రశ్నలు అడిగాను. నాకు తెలియనివి మీలాంటివారు చెప్పగలరా అని.

  ప్రపంచం చాలా దూరం వచ్చింది గానీ, ఆర్.ఎస్.ఎస్, దాని అనుబంద సంస్ధలు రానంటున్నాయి కదా అని అడిగాను. దానికి సమాధానం ఎవరూ ఎందుకివ్వరు?
  గురు గోల్వాల్కర్ భావనలు ఎప్పటివో అనీ, అవి పిడివాదం అనీ, వాటిని ఇప్పటి ఆర్.ఎస్.ఎస్ సమీక్షించుకుని వాటిని కాలం చెల్లినవిగా భావించి వదులుకోవడానికి నిర్ణయించుకుంటె అది నాకు తెలియదనీ, అది జరిగితే తెలియజెయ్యండి అని అడిగాను. సమాధానం ఇవ్వరేం?
  ఎనభై సంవత్సరాల క్రితం భారత దేశ చరిత్ర ఇప్పటికీ మారలేదు. గత ఎనభై సంవత్సరాలలో కొత్త చరిత్ర వచ్చి చేరింది. కానీ, కొత్తగా వచ్చి చేరిన చరిత్ర వల్ల అంతకు ముందు చరిత్రలో మార్పులు రాలేదు. అయినా ఆ తర్వాత కూడా రామాలయం కూల్చి మసీదు కట్టారని దాన్ని కూల్చివేశారు. కూల్చివేతకు ముందు పెద్ద ఎత్తున మత మారణకాండ సాగించి మరీ కూల్చివేశారు. పాత భావాలను వేలాడుతూ బాబ్రీ మసీదు కూల్చివేశారని మీరు చెప్పదలుచుకున్నారా? ఆర్.ఎస్.ఎస్ తదితర సంస్ధలు ఇంకా రామాలయం కట్టాలని చెప్పడం కూడా పాత చరిత్రను పట్టుకుని వేలాడడమేనా?

  మీకు అనుకూలంగా ఉన్నపుడు ఔను అనడం, లేనపుడు కాదు అనడం తగదు.

  ఇప్పటికైనా చెప్పండి. గురు గోల్వాల్కర్ బోధనలను ఆర్.ఎస్.ఎస్, దాని అనుబంధ సంస్ధలు వదులుకున్నాయా? అలానే కొనసాగిస్తున్నాయా?
  ఆర్.ఎస్.ఎస్ ఐడియాలజీ వ్యక్తి దగ్గరకు నేను వెళ్ళడం ఏమిటి? మీరు ఆ ఐడియాలజీ తెలియకుండానే దానికి వత్తాసుగా వస్తున్నారా? అది సరైందేనా? నాకు దీవెనలు తర్వాత, నా ప్రశ్నలకు సమధానం ఇస్తే మీరు దీవెన ఇచ్చినట్లే భావించండి.

 9. I don’t know what happened between you and other people.My worry about the title and not about the content.If you want answers you better go to RSS people.Advertising here and asking people on public platforms are creating tensions between people unnecessarily.
  “మీకు అనుకూలంగా ఉన్నపుడు ఔను అనడం, లేనపుడు కాదు అనడం తగదు.”
  when did i say Yes and No to your posts.This is my first comment(first post) on your post.If some one raging you or disturbing you.Get some life.This is not the way my dear Sekhar

  May be i cant answer your questions.if you keep title with same words saying a muslim leader.Even i comment like this.
  Diplomatic answers doesnt work in real world
  If you see the reality in any organization whether it is hindu, muslim , a daily office or even at home.You will change your prospective.

 10. శేఖర్, ఏంటి మీరు చెబుతున్నది? సందర్భం గమనించకుండా మీకు తోచింది రాస్తున్నట్లు కనిపిస్తోంది. టైటిల్ నేను కనిపెట్టింది కాదు. పోస్టులో ఉన్న విషయాన్ని బట్టి టైటిల్ పెట్టాను. ఆ టైటిల్ సరైందేనని నేను భావిస్తున్నాను. విషయానికి టైటిల్ కి సంబంధం ఉందనే నేను భావిస్తున్నా. ఆ సంబంధం ఎలా ఉందో కూడా పొస్టులోనే వివరించా. విషయం పట్ల బాధ లేదు గానీ, టైటిలే బాధగా ఉందనడం ఏ కోవకోకి వస్తుంది? నేను లేవనెత్తిన ప్రశ్నలను గానీ, టాపిక్ ను గానీ మీరసలు గ్రహించారా? గ్రహిస్తే అసలా విషయమే ప్రస్తావించకుండా మీకు బాధ కలిగింది కాబట్టి అదే రాస్తాను అంటారేవిటి?

  అవును, కాదు అన్నది మిమ్మల్ని వ్యక్తిగతంగా ఉద్దేశించింది కాదు. మీలాగే వ్యాఖ్యలు రాస్తున్నవారందర్నీ ఉద్దేశించి అది రాసాను. మీ కామెంటు మొదటిదే అయిండొచ్చు గానీ అలాంటి వ్యాఖ్యలు ఇంకా ఉన్నాయి చూశారా? ఆ మిత్రులందరినీ ఉద్దేశించి అలా రాశాను. అయితే మీ విషయమే అర్ధం కాకుండా ఉంది. నేను ఏ పరిస్ధితిలో ఈ పోస్టు రాశానో చెప్పాను. ఈ పోస్టుకి ముందు ఏమి రాశానో దానికి లింక్ ఇచ్చాను. అది పట్టుకుని ముందరి విషయం చదవండి. ఆ తర్వాత ఈ పోస్టు చదవండి. విషయానికీ, టైటిల్ కీ సంబంధం చూడండి. విషయానికీ టైటిల్ కీ సంబంధం లేదనిపిస్తే అప్పుడు చెప్పండి. విషయం ఏదైనా సరే టైటిల్ నచ్చలేదనడం సరిగ్గా లేదు. నా టైటిల్ ను బట్టి మీరు చెబుతున్న ఉద్రిక్తతలు తలెత్తుతాయనడం ఏమిటో అస్సలు అర్ధం కావడం లేదు. ముందు అవి బోధిస్తున్నవారిని ఆపమని చెప్పండి. టైటిల్ లాంటి అనేక భావాలని కలిగి ఉన్న పుస్తకాలలోని విషయాలకి ఉద్రిక్తతలు తలెత్తవు గానీ, నా టైటిల్ తో తలెత్తుతాయంటారేంటి?

  ఆర్.ఎస్.ఎస్ వద్దకి వెళ్ళి తెలుసుకోమన్న మీ సలహా కట్టిపెట్టండి. నేను నా బ్లాగ్ ద్వారా చర్చను ప్రారంభించదలిచాను. ఆ చర్చలోని విషయాలను ఉదహరిస్తూ చర్చలో పాల్గొనడానికి మీరు ఆహ్వానితులు.

  డిప్లొమసీ, రియాలిటీ గురించి పాఠాలు నేర్చుకోవాలనుకున్నపుడు మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ విషయం పట్ల ఆసక్తి ఉన్నట్లయితే మీరు పాల్గొనండి.

 11. ఇంతకీ రమేష్ గారు ఎందుకో ఇంకా ఇక్కడికి రాలేదు. అసలు ఆయన వల్లే ఈ పోస్టు రాసాను. ‘ముస్లింలు విదేశీయులనీ, వారిని వెళ్ళగొట్టి పాక్, బంగ్లా దేశ్ లతో అఖండ భారత్ నిర్మాణానికి ఆర్.ఎస్.ఎస్ బోదిస్తోందనీ’ నేను రాయగా, ఆయన అలా అని ఎవరు చెప్పారో చెప్పాలని కోరారు. దానికి నేను స్పందించడం ఆలస్యమయ్యేసరికి నేను స్పందించలేదని కూడా ఆయన గుర్తు చేశారు. అందుకు సమాధానంగానే ‘ఎవరో ఎందుకు, ఆర్.ఎస్.ఎస్ గురువు గోల్వాల్కర్ గారే రాశారు’ అని తెలియజేయడానికి నేనీ పోస్టు రాశాను. సమాధానం ఇవ్వాలని గట్టిగా కోరిన రమేష్ గారు నా ఈ సమాధానానికి స్పందించాల్సి ఉంది.

 12. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. మీరు పేర్కొన్న పారాగ్రఫ్ లొ మీరు రాసినటువంటి “ముస్లింలు విదేశీయులనీ, వారిని వెళ్ళగొట్టి పాక్, బంగ్లా దేశ్ లతో అఖండ భారత్ నిర్మాణానికి ఆర్.ఎస్.ఎస్ బోదిస్తోందనీ”. ముస్లిం లను వెల్లకొట్టమని ఎక్కడ అన్నారొ నాకు అయితే కనబడలేదు. మీరు చెప్పిన పుస్తకం చదువుదామంటె నాకు ఎక్కడ దొరకలెదు లెదు. మీ దగ్గర ఉంటె ఇవ్వగలరు. గూగుల్ లొ వెతికితే అది 1947 కంటే ముందే నిషేదించారు అని తెలుస్తొంది. ఆ పుస్తకం 1940 లొ వ్రాసినది, కావున మీరు 1940 లొ భారత ఉపకండ ముస్లిం మరియు ఆంగ్లేయుల విభజన వాదం, అప్పటి వివిద రాజకీయ, సాంఘీక పరిస్తితులని ద్రుస్టిలొ ఉంచుకొవాలి. ఇక ఆర్.ఎస్.ఎస్ యొక్క ఆశయాలు

  The mission of Rashtriya Swayamsevak Sangh has been described as the revitalization of Indian value system based on universalism and peace and prosperity to all. Vasudhaiva Kutumbakam, the worldview that the whole world is one family, propounded by the ancient thinkers of India, is considered as the ultimate mission of the organization

  గోల్వార్కర్ గారు 1940 లొ రాసిన ఆ ఒక్క పుస్తకం ఆర్.ఎస్.ఎస్ కి ప్రామానికం కాదు మరియు ఆర్.ఎస్.ఎస్ సిద్దాంతం అసలే కాదు. గోల్వార్కర్ గారు ఆర్.ఎస్.ఎస్ చీఫ్ గ పనిచేసి ఉండచ్చు కాని ఆర్.ఎస్.ఎస్ సిద్దాంతాన్ని రుపొందించలెదు. ఆ పుస్తకం 1940 లొ ఆయన ఆలొచలని,సామాజిక పరిస్తితులని తెలియచెస్తొంది. ఆ తరువాత చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు మీరు ఉదహరించిన పుస్తకం ఎవరికి అందుబాటు లొ లెదు. గోల్వార్కర్ అలొచనలని ఆర్.ఎస్.ఎస్ లొ ఒక భాగంగా చుడాలి తప్ప అదె ఆర్.ఎస్.ఎస్ సిద్దాంతం అనడం చాల తప్పు. కావున మీరు ఆ పుస్తకాన్ని ప్రస్తుత ఆర్.ఎస్.ఎస్ కి ప్రామనికంగా తీసుకొరాదని మనవి.

 13. గుజరాత్ లో ముస్లింలపై సాగించిన నరమేధం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. గుజరాత్ రాష్ట్రం ఆర్.ఎస్.ఎస్ భావాజాలానికి ఒక ప్రయోగశాల గా భాసిల్లుతున్న విషయం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం.

  ఇక గుజరాత్ విషయానికి వస్తే, 1940 లొ రాసిన ఆ పుస్తకం చదివి 2002 లొ నరమేధం చేసారనడం అంత నమ్మకశ్యముగా లెదు. అటువంటి ప్రమాదాలు జరుగదానికి ఎన్నొ సంఘటనలు కారణం అవుతాయి. ఒక విషయాన్ని గురుంచి అన్ని కొణాలలొ ఆలొచన సరి అయిన అలొచన చేస్తేనే సమస్య యొక్క నిజమయిన అవగాహన కలుగుతుంది. ఇద్దరు మనుషులు ఒకరిని ఒకరు చంపుకొవడానికి ఒక్క ఆర్.ఎస్.ఎస్ భావజాలం మాత్రమే కారణం కావక్కర్లేదు. అది ఒక ముసుగు మాత్రమె. ఈ సత్యం మనం ప్రపంచం లొని ఈ దేశాన్ని చూసిన, మానవ జాతి చరిత్ర లొ అడుగడుగున కనపడుతుంది.

 14. రమేష్ గారూ, నేను ప్రామాణికంగా తీసుకోవడమా లేదా అన్నది సమస్య కాదు.
  గురు గోల్వాల్కర్ రాసిన ఆ పుస్తకం లోని భావాలను ఆర్.ఎస్.ఎస్ ఇప్పుడు తిరస్కరిస్తున్నదా?
  ఒక సంస్ధ ఛీఫ్ రాసిన పుస్తకంలోని భావాలను ఆ సంస్ధ భావాలు కాకుండా పోవడానికి వీలు ఉండదు. ఉండకూడదు కూడా.
  సిద్ధాంతాల రూపకల్పనకి ఒక పద్ధతి ఉంటుంది. దానిని సవరించుకున్నట్లయితే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది.
  కాల క్రమంలో ఒక సిద్ధాంతం సవరించుకోవాల్సిన అవసరం రావచ్చు. అయితే ఆ సవరణకు స్పష్టమైన వివరణ కూడ సిద్ధాంత స్ధాయిలోనే ఉండాలి.
  అందువలన గురు గోల్వాల్కర్ గారు వ్యక్తపరిచిన భావాలు ఆర్.ఎస్.ఎస్ సంస్ధవి కానట్లయితే దానికి కూడా ప్రాతిపదిక ఉండాలి.
  ఒక సంస్ధ మూలవిరాట్టులో ఒకరైన వ్యక్తి, ఆ సంస్ధ భావజాలానికి భిన్నమైన భావాలను లేదా ఆ సంస్ధకి చెందని భావాలను ఎలా వ్యక్తం చేయగలడు. అదెలా సాధ్యం?
  అది సాధ్యమయితే ఆ సంస్ధ భావజాలం పట్ల ఆయనకి గౌరవం లేనట్లే అర్ధం వస్తుంది.

  పుస్తకం ప్రజలకు అందుబాటులో లేకపోవచ్చుగానీ, ఆర్.ఎస్.ఎస్ కి కూడా అందుబాటులో లేదని భావించలేము.

  మీరన్నట్లు గోల్వాల్కర్ భావాలను ఆర్.ఎస్.ఎస్ భావాలలో ఒక భాగంగా చూసినా నేను రాసిన అంశాలు అలాగే నిలుస్తాయి. మీరు చెప్పినదాన్నిబట్టి గోల్వాల్కర్ భావాలన్నీ ఆర్.ఎస్.ఎస్ భావాలలో భాగంగా ఉంటాయి. కానీ ఆర్.ఎస్.ఎస్ భావాలన్నీ గోల్వాల్కర్ వ్యక్త పరిచిన భావాలలో లేకపోవచ్చని అర్ధం.
  మీరు ప్రస్తుత ఆర్.ఎస్.ఎస్ నీ మునుపటి ఆర్.ఎస్.ఎస్ ని వేరుగా చూడాలని చెబుతున్నారు. ఏ విషయాలలో అలా వేరుగా చూడాలన్నది నాకు తెలియదు. మీరేమన్నా చెప్పగలరా?
  అలా వేరుగా చూడాలన్నట్లయితే భారత దేశ చారిత్రక విషయాల పట్ల ఆర్.ఎస్.ఎస్ అవగాహనలో మార్పు వచ్చి ఉండాలి. అవి ఏమిటో వివరించగలరా?
  అవును వేరు, మీరు చెప్పెయ్యడం కాకుండా అందుకు ప్రామాణికతను కూడా మీరు చూపాలి. అంటే ఫలానా సమావేశంలో ఆర్.ఎస్.ఎస్ సవరణలను ఆమోదించింది అనో, ఫలనా ఉన్నత కమిటీ సవరణలు చేసిందనో, అలాంటివి. అవేమన్నా చెప్పగలరా?
  అవేవీ లేకుండా గురు గోల్వాల్కర్ భావాలు ఇప్పటివి కావు, ఇప్పుడవి పాతబడ్డాయి, మారిన పరిస్ధితుల్లో కొత్త భావాలు వచ్చాయి అని వేగ్ గా చెప్పలేము. వేగ్ గా చెప్పగలిగితే సంస్ధ సైద్ధాంతిక అవగాహనను తేలిక చేసినట్లవుతుంది.

  నేను పై పోస్టులో వివరణ ఇచ్చాను. నేను చెప్పిన పదాలు ఉన్నవి ఉన్నట్లుగా గురు గోల్వాల్కర్ చెప్పాడు అని నేను ముందు చెప్పలేదు. ఆ ఆర్ధం వచ్చే భావాలు ఆర్.ఎస్.ఎస్ బోధిస్తుంది అన్నది నా భావన. ఆ అర్ధం ఎలా వస్తుందో పోస్టులో వివరించాను కూడా. ఐనా నేను చెప్పినది మక్కీకి మక్కీగా ఆ పుస్తకంలో లేదని మీరు ఎత్తి చూపడం భావ్యం కాదు.

 15. గుజరాత్ నరమేధం మీకు కేవలం ప్రమాదంగా కనపడుతోందా రమేష్ గారూ?
  గోల్వాల్కర్ పుస్తకం చదివి గుజరాత్ అల్లర్లు జరిపారని రెండింటికి నేరుగా సంబంధం ఉందని నేనూ చెప్పలేదు.
  అవును. అన్ని కోణాలలో ఆలోచన చేస్తేనే గుజరాత్ అల్లర్లకు కారణం ఏమిటో అర్ధం అవుతుంది. అది కూడా ముందు ఏర్పరుచుకున్న అభిప్రాయాలకు లోబడే ఉంటుంది.
  మీరు చెప్పిన ముసుగు నిజమే కావచ్చు. కాని గుజరాత్ ఘటనలకు ఆ ముసుగు ఉందా లేదా అన్నది కూడా ఒక ప్రశ్నే.

 16. విసెఖర్ గారు,

  1.గురు గోల్వాల్కర్ రాసిన ఆ పుస్తకం లోని భావాలను ఆర్.ఎస్.ఎస్ ఇప్పుడు తిరస్కరిస్తున్నదా?

  ఆ భావజాలం 1940 లొ భారత దేశం ఏర్పడకముందు ఉన్నటువంటిది. ఆ పుస్తకం లొని భావాలను ఇప్పటి ఆర్.ఎస్.ఎస్ తిరస్కరిస్తుందొ లెదొ నాకు తెలియదు కాని సమర్దించడం మాత్రం చేయడం లేదు.

  2.ఒక సంస్ధ ఛీఫ్ రాసిన పుస్తకంలోని భావాలను ఆ సంస్ధ భావాలు కాకుండా పోవడానికి వీలు ఉండదు. ఉండకూడదు కూడా…అందువలన గురు గోల్వాల్కర్ గారు వ్యక్తపరిచిన భావాలు ఆర్.ఎస్.ఎస్ సంస్ధవి కానట్లయితే దానికి కూడా ప్రాతిపదిక ఉండాలి.
  ఒక సంస్ధ మూలవిరాట్టులో ఒకరైన వ్యక్తి, ఆ సంస్ధ భావజాలానికి భిన్నమైన భావాలను లేదా ఆ సంస్ధకి చెందని భావాలను ఎలా వ్యక్తం చేయగలడు. అదెలా సాధ్యం?
  అది సాధ్యమయితే ఆ సంస్ధ భావజాలం పట్ల ఆయనకి గౌరవం లేనట్లే అర్ధం వస్తుంది.

  అవి భిన్నమైన భావాలు కావు మూల సిద్దాంథానికి కొనసాగింపు మాత్రమె. ఆ భావాలు దేశ విభజనకి ముందు అప్పటి సమాజం లొని కొందరి అలొచనలకి ప్రతిరూపం. ఈ భావాలు మూల సిద్దాంతానికి ఒక రకమయిన అతివాద రుపాలు.కాని మూల సిద్దాంతం ఇప్పటి వరకు మారలేదు.

  3. పుస్తకం ప్రజలకు అందుబాటులో లేకపోవచ్చుగానీ, ఆర్.ఎస్.ఎస్ కి కూడా అందుబాటులో లేదని భావించలేము.

  ఆర్.ఎస్.ఎస్ website లొ కూడ ఎక్కడ ఈ పుస్తకం పేర్కొనబడలేదు.

  4. మీరన్నట్లు గోల్వాల్కర్ భావాలను ఆర్.ఎస్.ఎస్ భావాలలో ఒక భాగంగా చూసినా నేను రాసిన అంశాలు అలాగే నిలుస్తాయి.

  మీరు ఇంకొక విషయం పరిగనలొకి తీసుకొవాలి. అది కాలం. మీరు రాసిన అంశాలు అప్పటి కాలానికి నిలుస్తాయి కాని ఇప్పుడు కాదు.

  5. మీరు ప్రస్తుత ఆర్.ఎస్.ఎస్ నీ మునుపటి ఆర్.ఎస్.ఎస్ ని వేరుగా చూడాలని చెబుతున్నారు. ఏ విషయాలలో అలా వేరుగా చూడాలన్నది నాకు తెలియదు. మీరేమన్నా చెప్పగలరా?
  అలా వేరుగా చూడాలన్నట్లయితే భారత దేశ చారిత్రక విషయాల పట్ల ఆర్.ఎస్.ఎస్ అవగాహనలో మార్పు వచ్చి ఉండాలి. అవి ఏమిటో వివరించగలరా?

  భారతదేశ విభజనకి ముందు తరువాత అని రెండు భాగాలుగా చూడవచ్చు. విభజన కి ముందు ఉన్న భౌగొలిక పరిస్తితులు మరియు సామాజిక పరిస్తితులు వేరు తరువాత వేరు (ఇది నా అనుకొలు మాత్రమే). మార్పు అయితే కచ్చితంగా వచ్చింది అన్ని రంగాలలొ. అవి వివరించాలంటె నాకు ఉన్న అవగాహన సరిపొదు. ఎందుకంటె అది అధునిక భారతదేశ చరిత్ర అవుతుంది.

  6.అవును వేరు, మీరు చెప్పెయ్యడం కాకుండా అందుకు ప్రామాణికతను కూడా మీరు చూపాలి. అంటే ఫలానా సమావేశంలో ఆర్.ఎస్.ఎస్ సవరణలను ఆమోదించింది అనో, ఫలనా ఉన్నత కమిటీ సవరణలు చేసిందనో, అలాంటివి. అవేమన్నా చెప్పగలరా?
  అవేవీ లేకుండా గురు గోల్వాల్కర్ భావాలు ఇప్పటివి కావు, ఇప్పుడవి పాతబడ్డాయి, మారిన పరిస్ధితుల్లో కొత్త భావాలు వచ్చాయి అని వేగ్ గా చెప్పలేము. వేగ్ గా చెప్పగలిగితే సంస్ధ సైద్ధాంతిక అవగాహనను తేలిక చేసినట్లవుతుంది.

  మీరు ప్రామాణికతను చూపమంటున్నారు. మీరు అడిగినట్లుగా ఏ సమావేశం లొ సవరణలని ఆమొదించింది అంటే నాకు తెలిదు. కాని భారతదేశం ఎర్పడిన తరువాత అతివాద భావాలు చాల వరకు తగ్గాయి అని మాత్రం చెప్పగలను. ఎందుకంటె మూల సిద్దాంతం ఎప్పుడు అతివాద భావాలని ప్రబొధించలెదు.

 17. RSS గురువు రాసుకున్న పుస్తకం ఆధారంగానే, RSS నిజస్వరూపాన్ని బట్టబయలు చేయడం అద్భుతం. (వేరే ఏ ఆధారం చూపినా, ఈ సర్టిఫైడ్ దేశభక్తులు అవన్నీ అసత్య ప్రచారాలని, RSS నిజానికి నికార్సైన దేశభక్త సంస్థ అనీ ఊదరగొట్టుకొని ఉండేవారు(తమ తమ బ్లాగుల్లో..) ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్లుగా, అవన్నీ ఇప్పుడు ఎందుకు అంటున్నారు. అంటే అక్కడికేదో చరిత్రతో జనాల్ని రెచ్చగొట్టే పేటెంటు తమకే ఉన్నట్లు.
  Your knowledge on these many different issues is simply superb. keep it up..

 18. రమేష్ గారూ, గురు గోల్వాల్కర్ భావనలకు కూడా పునాది అయిన మూల సిద్ధాంతం ఒకటుందనీ, దానికి కొనసాగింపు మాత్రమే గోల్వాల్కర్ భావాలనీ మీరు చెబుతున్నారు.

  ఆర్.ఎస్.ఎస్ మూల సిద్ధాంతం ఏమిటో చెప్పండి. నా అవగాహనకూ, పాఠకుల అవగాహనకు కూడా అవసరమని భావిస్తూ, దాన్ని వివరించండి. ఒక వేళ మీకు పెద్దగా అవగాహన లేనట్లయితే తెలుసుకుని అయినా చెప్పడానికి ప్రయత్నించగలరా?

  మీ సమాధానంలో కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. నేనిప్పుడు పనిమీద బైటికి వెళ్తున్నాను. మళ్ళీ వచ్చాక ఆ వైరుధ్యాలను ప్రస్తావిస్తాను.

 19. ఇదంతా మత సమస్య కాదు. ఇది గ్లోబలైజేషన్ సమస్య. ఇక్కడ మతం ముసుగు వేసుకున్నవాళ్ళందరూ గ్లోబలైజేషన్ అనుకూల వర్గంవాళ్ళు. రేపు ఆర్.ఎస్.ఎస్.వాళ్ళు గ్లోబలైజేషన్‌ని విమర్శించి domestic capitalismని అమలు చెయ్యాలని అడ్వొకేట్ చేస్తే ఈ గ్లోబలైజేషన్‌వాద బ్లాగర్లందరూ ఆర్.ఎస్.ఎస్.‌ని పరిత్యజించి ఏ అయన్ రాండ్‌నో పట్టుకుంటారు. నేను మూడేళ్ళ నుంచి తెలుగు బ్లాగులు చదువుతున్నాను. వీళ్ళందరి నిజమైన తత్వం గ్లోబలైజేషన్ అనుకూలవాదం. మతం అనేది పైన కప్పుకున్న ముసుగు మాత్రమే. విశేఖర్ గారు, మీరు ఆవేశపడి వీళ్ళు నిజం మతతత్వవాదులని నమ్మి కేవలం హిందూ మతాన్ని విమర్శిస్తే మీరు హిందూ ద్వేషులని వాళ్ళు ప్రచారం చేస్తారు. వాళ్ళ మోడస్ ఓపరాండీ ఇదేనని నాకు ముందే తెలుసు. కత్తి మహేశ్‌ని కూడా వాళ్ళు ఇలాగే హెరాస్ చేశారు. హిందువులలో రెగ్యులర్‌గా దేవాలయానికి వెళ్ళేవాళ్ళు తక్కువ, మత గ్రంథాలు చదివేవాళ్ళు అంత కంటే తక్కువ. హిందూ మతం ఏమీ ఇస్లాంలాగ బలమైన విశ్వాసం కాదు. కనుక హిందూ మతాన్ని విమర్శించడం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు.

 20. ఏ మతమైనా ఊహాజనితమైనదే కానీ అది రోజువారీ జీవితంలో ఆచరించగలిగేది కాదు. మీరు హిందూ మతాన్ని ఎక్కువగా విమర్శించకుండా గ్లోబలైజేషన్ లాంటి సామ్రాజ్యవాద అనుకూల ఆర్థిక విధానాలని ఎక్కువగా విమర్శిస్తూ వ్రాయండి. చర్చ్‌పై ఎన్ని విమర్శలు చేసినా చర్చ్ అధికారులు భయపడరు కానీ ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడితే చర్చ్ అధికారులు తప్పకుండా భయపడతారు అని కార్ల్ మార్క్సే అన్నాడు కదా. కత్తి మహేశ్ అనే బ్లాగర్ ఉన్నాడు. అతని కుటుంబ సభ్యుడు ఒకరు నక్సలైట్ ఉద్యమంలో పని చేశాడని పోలీసులు అతని కుటుంబాన్ని వేధించడం, అతని కుటుంబం చిత్తూరు జిల్లాని విడిచి వెళ్ళిపోవడం జరిగిందని అతను ఓసారి చెప్పినట్టు గుర్తు ఉంది. అతను మాదిగ కులస్తుడు కావడం వల్ల అగ్రకుల దురహంకారాన్ని విమర్శిస్తూ పోస్టులు వ్రాసేవాడు. అమెరికా, సింగపూర్‌లు కేంద్రాలుగా పని చేసే సోకాల్డ్ దేశభక్త బ్లాగర్లు అతన్ని మతం పేరుతో తిట్టారు. అలా తిట్టడం వల్ల అతనికి హిందూ మతంపై ద్వేషం మరింత పెరిగి అతను ఎం.ఎఫ్. హుస్సేన్ బూతు బొమ్మలని సమర్థించే స్థాయికి ఎదిగాడు. బికినీల మీద లక్ష్మీ దేవి ఫొటోలు ముద్రించడాన్ని కూడా సమర్థించాడు. దాంతో అమెరికా, సింగపూర్‌లలో ఉండే తెలుగు బ్లాగర్లు కత్తి మహేశ్ ఒక మానసిక రోగి అని ప్రచారం చేశారు. వాళ్ళు మిమ్మల్ని కూడా ఇలాగే రెచ్చగొట్టి హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తారు. అలా మాట్లాడించిన తరువాత మీరు హిందూ ద్వేషి అని ప్రచారం చేస్తారు. హిందూ మతం ఏమీ ఇస్లాంలాగ బలమైన విశ్వాసం కాదు. మీరు ఆవేశపడి హిందూ మతాన్ని అంతగా విమర్శించాల్సిన అవసరం లేదు. మీరు హిందూ మతాన్ని ఎక్కువగా విమర్శిస్తే అమెరికా-సింగపూర్ కంచర గాడిదలకే మేత దొరుకుతుంది కానీ మనకేమీ ఉపయోగం ఉండదు.

 21. ప్రవీణ్, మీరు చెప్పిన విషయంలో వాస్తవం ఉంది. అయితే మీరు చెబుతున్న సోకాల్డ్ దేశభక్త బ్లాగర్లు రెచ్చగొట్టగా ఆవేశపడి నేను ఇటువంటి పోస్టులు రాయడంలేదు. నేను ఏ అంశం రాసినా, నాకు తెలిసిన మరియు తెలియని అంశాలపైన చర్చ లేవనెత్తి తద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్న లక్ష్యం ఉంటుంది. నా బ్లాగ్ కి అదే ఏకైక లక్ష్యం కాకపోయినా, కొన్ని పోస్టులకి ఆదే ఏకైక లక్ష్యం ఉండవచ్చు. నాతో చర్చలో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్నవారు చర్చలో పాల్గొంటారు. ఎవరూ చర్చకు రాకపోయినా పర్వాలేదు. అదొక అనుభవంగా తీసుకుంటాను. నా బ్లాగ్ రాతలలో నేపధ్యం ఇదే ప్రధానంగా ఉంటుంది.

  హిందూ మతాన్ని గానీ, మరొక అంశాన్ని గానీ నేను విమర్శ కోసం విమర్శ చేయాలని భావించను. లేదా మతం పట్ల ద్వేషంతో దానిని విమర్శించను. మతం అన్నది ఒక సామాజిక వాస్తవం. అది ప్రజల జీవితాలతో అత్యంత గాఢంగా పెనవేసుకుపోయిన ఒక సామాజిక లక్షణం. కేవలం అందువల్ల మాత్రమే నేను మతం గురించిన చర్చ చేస్తున్నాను తప్ప కొద్దిమందిన లక్ష్యంగా చేసుకొని విమర్శించడం లేదని గమనించాలి.

  ఇక హిందూ మత ద్వేషి అని నాపై ప్రచారం చేస్తారని చెబుతున్నారు కదా, అదేమంత పెద్ద విషయం కాదు. వాళ్ళు పట్టించుకోదగ్గవాళ్ళు కాదు. మార్క్సిజం పట్ల గుడ్డి ద్వేషంతో రాస్తున్న బ్లాగర్లు ఉన్నారు. వారికి నిజానికి మార్క్సిజం ఏమి చెబుతుందో తెలియదని వారి రాతల్లో తెలిసిపోతోంది. అక్కడా, ఇక్కడా నాలుగు మాటలు విని అదే మార్క్సిజం అని నమ్మి, మార్క్సిజం తమకు పూర్తిగా తెలిసిపోయిందని భావిస్తూ రాస్తున్నారు. అవి నిజానికి పట్టించుకోదగ్గ విమర్శలు కాదన్నది నా అవగాహన. నిజంగా మార్క్సిజంలో ఫలానా లోపం ఉంది. అందువల్ల ఫలానా విషయంలో అది తప్పు అని చెప్పగలిగితే వారితో చర్చించవచ్చు. అదేమీ తెలియకుండా ‘మార్క్సిజం గురించి ఇప్పటికే అనేకమంది పెద్దలు అనేక రకాలుగా తప్పు అని చెప్పారు గాబట్టి అది తప్పు’ అనో, లేదా మార్క్సిజాన్ని తింగరి రాతలనో, విమర్శిస్తున్నవారితో మనం ఏమి చర్చిస్తాం? వారితో చర్చలకు దిగినపుడు విషయం లేనందువలన ఎగసక్కెం చేస్తూ, వెకిలిగా రాస్తూ లేదా తమకు తామే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ రాస్తున్నారు, విషయాన్ని వదిలేసి. వీరు సీరియస్ మనుషులు కాదు. సీరియస్ చర్చలు వీరు చేయలేరు. కనుక వారు ఎన్ని రాతలు రాసుకున్నా పట్టించుకోనవసరం లేదన్నదే నా అవగాహన. వారు చేసే ప్రచారం నమ్మినవాళ్ళని నమ్మనీయండి. అలా నమ్మేవారు నష్టపోతారే తప్ప లాభపడలేరు. ఇతర ప్రయోజనాల కోసం వారికి భజనలు చేసేవారున్నారు. వారు ప్రయోజనాల కోసమే భజన చేస్తున్నరు కనుక వారినీ పట్టించుకోనవసరం లేదు. వారి లోకంలో వారిని ఉండనివ్వండి. నా బ్లాగ్ కి సీరియస్ పాఠకులు ఓ పదిమంది ఉన్నా చాలు. వారు చేసే చర్చలు చదివే పాఠకులు ఇంకా చాలా మంది ఉంటారు.

  మనం బ్లాగ్ ద్వారా చేసేది ఓ చిన్న ప్రయత్నం. నాన్ సీరియస్ మనుషుల కోసం మనం మన రాతలని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాని వారు నా బ్లాగ్ లోకి దూరితే గనక తగిన రెస్పాన్స్ ఇవ్వాలనే నిర్ణయించుకున్నాను. అందులో రాజీలేదు. అలా కాక వారే బ్లాగుల్లో రాసుకుంటె అందుకు మనం ఎందుకు భయపడడం? అసలు వాళ్ళు నాకొక సమస్య కాదు. కారాదు.

 22. ఎం.ఎఫ్.హుస్సేన్ బూతు బొమ్మల గురించి చర్చ జరుగుతున్నప్పుడు మీరు బ్లాగుల్లోకి వచ్చి ఉంటే బాగుండేది. ఎం.ఎఫ్.హుస్సేన్ బూతు బొమ్మలని నేను కూడా విమర్శించాను. ఆడవాళ్ళని చెత్తగా చూపించి డబ్బులు సంపాదించడమే తప్పు. ఇక్కడ దేవతల బొమ్మలని చెత్తగా వేశాడా, సాధారణ స్త్రీల బొమ్మలని చెత్తగా వేశాడా అనేది తరువాతి విషయం. కానీ హిందూత్వ బ్లాగర్లు ఏమి చేశారంటే ఇక్కడ ఆడవాళ్ళ గురించి ఆలోచించలేదు. కేవలం దేవతల పేరు చెప్పి ఎం.ఎఫ్.హుస్సేన్‌నీ, కత్తి మహేశ్‌నీ తిడుతూ పోస్టులు వ్రాసారు. వీధుల్లో రోజూ గోడల మీద బూతు సినిమాల పోస్టర్లు కనిపిస్తున్నాయి. వాటి గురించి ఎవరూ పట్టించుకోరు కానీ ఎం.ఎఫ్.హుస్సేన్ బొమ్మల గురించే ఎందుకు పట్టించుకున్నారు? నరసరావుపేటకి చెందిన గోపీచంద్ గారి నాయకత్వాన ఇరవై ఏళ్ళ క్రిందట వెలసిన అశ్లీలత ప్రతిఘటన వేదిక ఇప్పుడు మూతపడిపోయింది. సినిమాలలోని బూతులని విమర్శించేవాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. కానీ ఎం.ఎఫ్.హుస్సేన్ వేసిన బూతు బొమ్మలని మాత్రం విమర్శించడానికి ఉత్సాహం వచ్చింది, అది మతం పేరుతో. ఒక దేశంలోని కొన్ని రాష్ట్రాలలోనే పబ్లిష్ అయ్యే ఒక స్థానిక పత్రికలో ముహమ్మద్ ప్రవక్త బాంబు ఉన్న తలపాగ వేసుకుంటున్నట్టు ఫొటోలు ముద్రించబడ్డాయని ప్రపంచ వ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. కానీ ఎం.ఎఫ్.హుస్సేన్ బూతు బొమ్మల విషయంలో ఇండియాలో అన్ని పట్టణాలలోనూ అల్లర్లు ఎందుకు జరగలేదు? బికినీపై లక్ష్మీ దేవి బొమ్మ వేసినప్పుడు ఇండియాలో ఒక్క పట్టణంలో కూడా అల్లర్లు ఎందుకు జరగలేదు? హిందూ మతం ఏమీ ఇస్లాంలాగ బలమైన విశ్వాసం కాదు అని నేను అన్నది అందుకే. మతం మీద అంత విశ్వాసం లేనివాళ్ళకి దేశభక్తి పేరుతో పాకిస్తాన్‌ని తిట్టడానికి ఉత్సాహం ఎందుకు ఉంటోందని అనేది ఆలోచించాల్సిన విషయమే. పాకిస్తాన్‌లో ఉన్నవాళ్ళు కూడా ఒకప్పుడు హిందువులే. 1400 సంవత్సరాల క్రితం ముహమ్మద్ ప్రవక్త బంధువులైన ఉమైయా వంశస్తులు సింధూ నది తీర ప్రాంతాలని ఆక్రమించుకోవడం వల్ల ఇస్లాం మతం పాకిస్తాన్‌లోకి ప్రవేశించింది. పాకిస్తాన్‌లో ఉన్నవాళ్ళందరూ మతాంతీకరణ చెందినవాళ్ళైనప్పుడు వాళ్ళని రక్త సంబంధం రీత్యా హిందువులు అనే అనుకోవాల్సి వస్తుంది. మతం మీద అంత బలమైన విశ్వాసం లేని హిందువులు తమతో రక్త సంబంధం ఉన్న పాకిస్తానీ ముస్లింలని వేరు జాతిగా చూడడం ఎందుకు? రక్త సంబంధం కంటే విశ్వాసం గొప్పదా? ఒకవేళ అలా అనుకున్నా హిందువులలో విశ్వాసం బలంగా లేకపోవడం సంగతి ఏమిటి? హిందువులలో విశ్వాసం బలంగా లేదని బికినీ మీద లక్ష్మీ దేవి ఫొటో లాంటి ఘటనలతోనే ఋజువైపోయింది కదా. ఆర్.ఎస్.ఎస్.వాళ్ళు తమకి కావాలనుకుంటున్నది జాతా లేదా విశ్వాసమా? ఇదే ఆర్.ఎస్.ఎస్.వాళ్ళు స్పష్టంగా చెప్పలేని విషయం.

 23. విశేఖర్ గారూ, రమేష్ గారూ,
  మీ చర్చలో పాలు పంచుకుంటున్నాను. ఈ వ్యాఖ్య నిన్ననే పంపాను కాని అది మీకు అందినట్లు లేదు.

  స్వాతంత్ర్యానికి మునుపటి పుస్తకం ఆధారంగా చర్చ కొనసాగిస్తున్నారు. 80 ఏళ్ల క్రితం వ్యక్తి భావాలను చర్చించడం తప్పు కాదు కాని, ఆయనే స్వాతంత్ర్యానంతరం రాసిన సుప్రసిద్ధ గ్రంధం “పాంచజన్యం” ని మీరు చూశారో లేదో తెలియదు. “Bunch of Thoughts” పేరిట ఇది ఇంగ్లీష్ లోనూ, ఇతర భారతీయ భాషలన్నింట్లోనూ ముద్రించబడింది. తెలుగులో దీన్ని 1980ల మధ్యలో చదివాను.

  ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఏక జాతి, ఏక సంస్కృతి, ఏక నడవడికను పంచుకోవాలని, ఆచరించాలని ఈ పుస్తకంలో కూడా చాలా సమర్థవంతంగా ఆయన ప్రతిపాదించారు. హిట్లర్ ఆర్య జాతి సిద్ధాంతాన్ని కూడా ఈ కోణంలోంచే ఈ పుస్తకంలో సమర్థించారు. ఇటీవలి కాలంలో ఎవరయినా దీన్ని చదివిఉంటే దీన్నే ప్రస్తుతం చర్చకు ప్రాతిపదికగా తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. దీన్ని ససాక్ష్యంగా చూపడానికి నాకు ఈ పుస్తకం అందుబాటులో లేదు. కాని ఆరెసెస్ భావాలను తెలుసుకోవడానికి ఇది అతి ముఖ్యమైన రచన.

  ఈ పుస్తకం ఇంగ్లీష్‌లో కాని తెలుగులో కాని ఆన్‌లైన్ లో చదివే అవకాశం ఉంటే దాని లింకును తెలిసిన వాళ్లు పంపగలరు. నాకు తెలిసి ఆరెసెస్ అధిపతిగా ఉన్నప్పుడు ఆయన రాసిన ‘పాంచజన్యం’ పుస్తకమే ఆరెసెస్ భావజాలానికి ప్రామాణిక రచనగా ఉంటుందనుకుంటాను. ఈ పుస్తకం ఆధారంగా చర్చ కొనసాగిస్తే మరింత సమగ్ర అవగాహన ఏర్పడుతుందనుకుంటున్నాను.

 24. రాజశేఖర రాజుగారూ,

  మీరు చెప్పిన పుస్తకంలో కూడా గురు గోల్వాల్కర్ గారి భావనలేవీ మారలేదు. ఉదాహరణకి అదే పుస్తకం నుండి ఈ కొటేషన్ చూడండి

  “‘ఇది హిందూ దేశం’ అని మనం చెప్పినపుడు కొంతమంది వెంటనే ఒక సమస్యను లేవనెత్తుతారు. ‘ఈ నేలపై నివసిస్తున్న ముస్లింలు, క్రిస్టియన్ల సంగతి ఏమిటని’ వారు ప్రశ్నిస్తారు. వాళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే బతుకుతున్నవాళు కాదా? వారు కేవలం తమ మత నమ్మకాన్ని మార్చుకున్న మాత్రాన వారు ఇక్కడివారు కాకుండా ఎలా పోతారు? కాని ఇక్కడ కీలకమయిన విషయం ఏమిటంటే, ఈ మట్టిలో పుట్టినవాళ్ళమేనని వారికి గుర్తుందా లేదా అన్నదే. లేదు. మత నమ్మకంలో వచ్చిన మార్పుతో పాటే వారి ప్రేమకు సంబంధించిన ఆత్మ మరియు దేశం పట్ల అంకిత భావం కోల్పోయినట్లే”

  ఈ కొటేషన్ ను బట్టి ముస్లింలు, క్రిస్టియన్లు సిద్ధాంతం రీత్యా విదేశీయులని గురు గోల్వాల్కర్ చెబుతున్నాడు. వారు మతం మార్చుకున్నారు కనుక ఆటోమేటిక్ గా దేశం పట్ల అంకిత భావన, ఆధ్యాత్మిక చింతన కోల్పోతారని తీర్మానించాడు. హిందువులు, ముస్లింలు ఈ నేలపై పుట్టినవారేనని అంగీకరిస్తున్నట్లుగా ఇందులొ అర్ధం ధ్వనిస్తోంది. బహుశా ఆ మేరకు పాజిటివ్ మార్పుగా చూడాలో లేదో తెలియదు. ఎందుకంటే ఆయన మారిన భావనల సారాంశం ఏమిటన్నదీ పూర్తిగా తెలిస్తే తప్ప ఆయన భావాల మార్పులో పాజిటివ్ అంశాలను నిర్ధారించడానికి వీలు పడదు.

 25. కాసేపు గోల్వాల్కర్ రాసినది ఆచరిస్తే ఎలా ఉంటుందో చుడండి:
  ౧. భారత దేశం ఒకటి గా ఉండేది.
  ౧. ఇందియా పాకస్తాన్ విడి పడి ఉండేవి కావు.
  ౨. పాకిస్తాన్ తీవ్రవాద ప్రేయోగాసాల అయ్యేది కాదు.
  ౪. ప్రపంచం కాస్త ప్రశాంతం గ ఉండేది.

 26. “RSS నిజానికి నికార్సైన దేశభక్త సంస్థ అనీ ఊదరగొట్టుకొని ఉండేవారు”
  ఆయన రాసిన పుస్తకం వలన RSS నికార్సైన దేశభక్త సంస్థ కాదు అని మీకు ఎలా అనిపించింది?
  దేశాన్ని పడి ముక్కలు చేయాలి అనుకోనేవాళ్ళు మాత్రమే దేసభాక్తులా? పదిమందిని చంపయినా దేశాన్ని కలిపి ఉంచటం అవసరం అని నేను అనుకుంతున్న్నాను.

 27. అతల్ గారూ, ఆ పదిమంది బాధితుల్లో మీరు ఉండకూడదని కోరుకుంటున్నందుకు మరోలా భావించకండి.

  చీకటి గారు మీరు ఆరోపించినట్లు అనలేదులాగుంది.

  దేశాన్ని ముక్కలు చెయ్యడం, కలిపి ఉంచడం అన్నది కొంత మంది వ్యక్తులు పూనుకుని చేసే పని కాదు కదండీ. దేశ విభజన వెనుక బ్రిటిష్ వాడి కుతంత్రం ప్రధానంగా పని చేసింది. కాదంటారా?

  దేశ భక్తి ఈ దేశ సంపద దేశంలోని ప్రజలకే చెందాలి అన్న ప్రధాన డిమాండ్ లోనూ, దాన్ని నెరవేర్చుకోవడానికి కృషి చేయడంలోనూ ఉంటుంది తప్ప మతంలోనూ, సరిహద్దుల్లోనూ ఉండజాలదు. చిత్రం ఏమిటంటే ఇప్పటి రాజకీయ పార్టీలన్నీ ప్రపంచీకరణ విధానాలను అనుసరిస్తూ దేశ సంపదని విదేశీ కంపెనీలకు కట్టబెడుతున్నా దేశ భక్తి ఏ మాత్రం దానికి అడ్డుచెప్పకపోవడం.

 28. అతల్ గారూ,
  నేను కొన్ని అంశాలను మీ ముందుంచుతున్నాను. పరిశీలించండి.
  ౧. భారత దేశం ఒకటిగా ఉండడం అంటే భూభాగాలు ఒకటి గా ఉండడం కాదు. ప్రజలంతా పేద, గొప్ప తారతమ్యం లేకుండా, అగ్ర, దళిత కులాల విభేదాలు లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా జీవించడం
  ౨. ఇండియా, పాకిస్ధాన్ లు ఇప్పుడు వేరు వేరు దేశాలు. ఆ పరిస్ధితి ఇప్పుడు రద్దయ్యేది కాదు.
  ౩. పాకిస్ధాన్ కూడా తాను తీవ్రవాదం బాధితురాలినని చెబుతోంది. అక్కడ జరుగుతున్న బాంబు పేలుళ్ళు, ప్రజల మరణాలు ఆ విషయం ధృవపరుస్తున్నాయి.
  ౪. ఇరాక్ యుద్ధం పాక్ చెయ్యలేదు. ఆఫ్ఘన్ పైన దాడి పాక్ చెయ్యలేదు. పైగా పాక్ ని ఆఫ్ఘన్ యుద్ధం లోకి లాగింది అమెరికాయే. ఇండియాలో రైతుల భూములు లాక్కొని విదేశీ కంపెనీలకు ఇవ్వాలని అమెరికా, యూరప్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి తప్ప పాక్ కాదు. ఆ డిమాండ్ అంగీకరించి అమలు చేస్తున్నది భారత దేశంలోని అన్ని పార్టీల ప్రభుత్వాలు తప్ప పాక్ కాదు. గుజరాత్ లో ముస్లింలపై నరమేధం జరపమని పాక్ చెప్పలేదు. గోధ్రా రైలు తగలబెట్టమని పాక్ చెప్పినట్లుగా మోడీ కూడా చెప్పలేదు. సిరియాలో అల్లర్లను ప్రేరేపిస్తున్నది పాక్ కాదు. పాలస్తీనా ప్రజలపైన ఇజ్రాయెల్ జాతి విద్వేష పాలనను అమలు చేయాలని చెప్పింది పాక్ కాదు. ఒసామా బిన్ లాడెన్ ను పెంచింది అమెరికా తప్ప పాక్ కాదు. తాలిబాన్ వృద్ధికి పాక్ తోడ్పడింది కానీ అది టెర్రరిస్టు సంస్ధ అని అమెరికా కూడా చెప్పడం లేదు. పైగా దానితో అమెరికా చర్చలు జరుపుతోంది కూడా. ఇలాంటి అంశాలు ఇంకా అంశాలు చాలా ఉన్నాయి. వీటన్నింటితో సంబంధం లేని పాక్ వలన ప్రపంచ శాంతికి భంగం కలుగుతోందంటే ఆశ్చర్యంగా ఉంది.

 29. ‘దేశమంటే మట్టికాదోయ్-దేశమంటే మనుషులోయ్’ అన్నారు గురజాడ. నేను కూడా అదే నమ్ముతున్నాను. దేశమంటే కొండలు,గుట్టలు,పర్వతాలు అని నమ్మి ఆ కొండలు,పర్వతాలు మన దేశంలో ఉండాల్సిందే అని వాదించడమే దేశభక్తి అని భావిస్తే, నేను ఆ దేశభక్తుల లిస్ట్లులో లేనని చెప్పుకోడానికి ఏమాత్రం సంకోచించను. ఎవరు ఏ దేశంలో ఉండాలి, ఏ విధానాల్ని అవలంబించాలి అనేది ఆ ప్రాంతంలోని మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉండాలి. దీని ప్రకారం దేశం 10 ముక్కలైనా, 100 ముక్కలైనా అదేమంత కొంపలంటుకునే విషయం కాదు. ఇక దేశభక్తిని ప్రకటించడం అంటే- ‘కల్లు మూసుకుని గట్టిగా ‘వందే మాతరం’ అని అరవడమో, పక్క దేశాల వారిని పొద్దస్తమానం తిడుతూ కూర్చోడమో అని కూడా నేను అనుకోను. దేశభక్తిని ప్రకటించే సరైన విధానం దేశంలోని చట్టాలను గౌరవించడం, రాజ్యాంగ మౌలిక విలువలకి తగ్గట్లుగా నడుచుకోవడం అని భావిస్తాను. కానీ RSS భావాలు, దాని కార్యక్రమాలు, మన రాజ్యాంగ మౌలిక విలువలైన లౌకికవాదం, సహనం, శాంతి లాంటి భావాలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి నా దృష్టిలో అది దేశభక్త సంస్థ కాదు.
  విశేఖర్ గారూ, Thanks. Agree with your comment.

 30. “…వారు కేవలం తమ మత నమ్మకాన్ని మార్చుకున్న మాత్రాన వారు ఇక్కడివారు కాకుండా ఎలా పోతారు? కాని ఇక్కడ కీలకమయిన విషయం ఏమిటంటే, ఈ మట్టిలో పుట్టినవాళ్ళమేనని వారికి గుర్తుందా లేదా అన్నదే. లేదు. మత నమ్మకంలో వచ్చిన మార్పుతో పాటే వారి ప్రేమకు సంబంధించిన ఆత్మ మరియు దేశం పట్ల అంకిత భావం కోల్పోయినట్లే”

  గోల్వాల్కర్ గారి పాజిటివ్ భావాల ప్రస్తావన నా వ్యాఖ్యలో చేసినట్లు లేదు కదా.. అలా అనిపించినట్లయితే మాత్రం నా వ్యక్తీకరణలో ఎక్కడో లోపం ఉందేమో మరి. నేనన్నది ఏమిటంటే ఒక సంస్థ అధిపతిగా ఆయన రాసిన ఆ గ్రంథం మరింత సమర్థంగా ఆయన భావాలను, సంస్థ భావాలను చాటి చెబుతుందన్నదే. పైన ఉటంకించిన ఈ ఒక్క వాక్యం మాత్రమే ఆ గ్రంధ సారాంశాన్ని విశదీకరించలేదు కాని…

  మత నమ్మకాన్ని మార్చుకున్నంత మాత్రాన వారు ఇక్కడివారు కాకుండా ఎలా పోతారు అని ప్రశ్నిస్తూనే ఆయన మొత్తం ముస్లింలందరిలో ఈ దేశ వాసులం అనే స్పృహ లోపించిందని అంటున్నారు. ఈ మట్టిలో పుట్టిన వాళ్లమే అని వారికి గుర్తు లేదు అని ప్రకటిస్తూనే మతనమ్మకంలో మార్పుతోటే, వారి ప్రేమకు సంబంధించిన ఆత్మ మరియు దేశం పట్ల అంకిత భావం కోల్పోయినట్లే అని ఒక నిశ్చితమైన నిర్ధారణకు వచ్చేశారు.

  ఇది ఈ దేశంలోని కొన్ని కోట్లమంది ముస్లింల దేశభక్తినే కాదు మనుషులుగా వారి ఉనికినే ప్రశ్నిస్తోంది. ఆరెసెస్‌ భావజాలంలో ఇప్పటికీ ఇది కొనసాగుతోందంటే, లేదా ఈ పుస్తకం లోని పై తరహా భావాన్ని లేదా భావాలను వారు నేటికీ కొనసాగిస్తున్నారంటే ఖచ్చితంగా అది మన దేశ భద్రతకు, భవిష్యత్తు, సామరస్య భావనలకు సంబంధించి శాశ్వత వ్యతిరేక ప్రభావమే చూపుతుందనటంలో నాకు మరే భిన్నాభిప్రాయమూ లేదు. ఒక మతం మరో మతం యొక్క ఆత్మను, అంకిత భావాన్ని, ఒక మతస్తులు మరో మతస్తుల ఆత్మ, అంకితభావాలను ప్రశ్నించడం అనేది భౌతిక శక్తిగా మార్పు చెంది ఘర్షించిందంటే దాని ప్రభావం తరాల పాటు కొనసాగుతుందనటంలో సందేహం లేదు.

  హిందువులకు లాగే ఈ దేశంలో కోట్లాది మంది ముస్లింలు కూడా తమ బతుకు పోరాటంలో నిండా మునిగి ఉన్నారనే అనుకుంటున్నాను. పైగా మనం అనుకోవడాలూ, అనుకోకపోవడాలు పక్కన బెడితే మన సమాజ వాస్తవికత ఈ పునాది మీదే ఉంటోంది కూడా.

 31. రాజశేఖర్ గారూ గోల్వాల్కర్ భావాలపై మీరు పాజిటివ్ వ్యాఖ్యానం చేశారని నేను అనుకోలేదు.

  నేనొక పుస్తకంలో అంశాలను ఉల్లేఖించాను. మీరు మరొక పుస్తకం ప్రస్తావించారు. దానిలో కూడా అలాగే ఉన్నాయిని చెప్పాను. అంతకు మించి వేరే అర్ధం లేదు.

  పాంచజన్య పుస్తకం గురించిన అంశాలు కూడా నేను ఇదివరలో చదివాను. వెతికి దొరికితే అవి కూడా ప్రస్తావిస్తాను.

 32. పింగ్‌బ్యాక్: URL

 33. వి. శేఖర్ గారు –

  “థాట్స్ ఆన్ పాకిస్తాన్” అనే పుస్తకంలో అంబేద్కర్ అంటారు “…..దేశ విభజనతోపాటు మహమ్మదీయులందరినీ పాకిస్తాన్ పంపాలి. పాకిస్తాన్ లోని హిందువులను, బౌద్ధులను భారతదేశానికి తరలించాలి. టర్కీ, గ్రీసు దేశాలలో ఇది జరిగింది. తమ మత గ్రంధాల ప్రకారం ముస్లీములు భారతదేశాన్ని మాతృదేశంగా భావించడం సాధ్యం కాని పని”….

  భారతదేశంలో ఉండాలి కాబట్టి ఈ దేశ సంస్కృతిని ఆచరించాలని గోల్వాల్కర్ చెబితే, వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళని పాకిస్తాన్ పంపేయాలని అంబేద్కర్ అన్నారు.

  ఈ రెండు విషయాలను మీరు విశ్లేషిస్తే చదవాలని ఉంది.

 34. అంతర్యానం గారూ, మంచి చర్చాంశాన్ని లేవనెత్తారు. అంబేద్కర్ ఇలా అన్న విషయం నాకు తెలియదు. నా వద్ద అంబేద్కర్ రచనలు ఉన్నాయి. చదివి తెలుసుకుని ఆ తర్వాత మీరు ప్రస్తావించిన అంశం చర్చిస్తాను. మీరిచ్చిన చక్కటి అవకాశాన్ని వినియోగించుకుంటాను.

 35. శేఖర్ గారూ,
  మీరు ప్రస్తావించిన అంతర్యానం గారి వ్యాఖ్యపై స్పందిస్తున్నాను.

  “తమ మత గ్రంధాల ప్రకారం ముస్లీములు భారతదేశాన్ని మాతృదేశంగా భావించడం సాధ్యం కాని పని”

  ఈ వ్యాఖ్యలు అంబేద్కర్ ఏ నేపథ్యంలో అన్నారో దాని పూర్తి పాఠం విడి టపాగా రాయండి. ఇది అందరికీ చాలా ఉపయుక్తంగా ఉంటుంది.

  పైగా, అంబేద్కర్ దేవుడు కాదు. నిర్దిష్ట స్థలకాలాల పరిశీలనలో ఆయన చేసిన ప్రతి వ్యాఖ్య కాలపరీక్షలో నిలబడుతుందని చెప్పడానికి వీల్లేదు కదా.

  ఏ ప్రముఖ వ్యక్తి, దార్శనికుడు, సిద్ధాంతవేత్త విషయంలో అయినా ఇదే వర్తిస్తుంది.

  ముక్కస్య ముక్కగా ఆయన వ్యాఖ్యను స్వీకరించినా సరే ఆయన పై ప్రకటన చరిత్రలో నిలబడలేదని తేలిపోతోంది కదా.

  వీలైనంత వివరంగానే ఈ విషయంపై పెద్ద టపా రాయగలరు.

  ఈ దేశంలోని 20 కోట్లకు పైగా ముస్లింలు ఈ 65 ఏళ్లలో భారతదేశాన్ని మాతృదేశంగా భావించకుండా ఉన్నారని మాటవరుసకు అనుకుందాం!

  ఇదే నిజమైతే…. భారతదేశం భారతదేశంలాగే ఉనికిలో ఉండేదా?

  సాధారణ హిందువులు, సాధారణ ముస్లింలు ఈ దేశాన్ని, ఈ దేశ గౌరవాన్ని ఎన్నడూ అవమానించలేదు. నేను గతంలోనే చెప్పినట్లు హిందూ ముస్లింలు ఇరువురిదీ ఇక్కడ బతుకుపోరాటమే…

  దీనికి భిన్నంగా అంబేద్కర్ సైతం వ్యాఖ్యానించి ఉంటే… అది కాలంలోనూ, చరిత్రలోనూ కూడా నిలబడదు.

  మీనుంచి సమగ్ర టపాకోసం ఎదురుచూస్తుంటాను.

 36. సాధారణ హిందువులూ, సాధారణ ముస్లింలూ చేసేది బతుకు పోరాటమే. మా పట్టణంలో హిందువుల పండగలకి పువ్వులు అమ్మేది ముస్లిం వ్యాపారులే. దసరాకీ, కనుమకీ హిందువులకి మాంసం అమ్మేది ముస్లిం కసాయీలే. హిందువులకి పండగలు వస్తే తమకి డబ్బులు వచ్చాయని ఆ ముస్లింలు కూడా virtualగా పండగ ఆనందంలోనే ఉంటారు. రోజూ బతుకు పోరాటం చేసేవాళ్ళకి మతం పేరుతో కొట్టుకోవడానికి సమయం ఎక్కడ ఉంటుంది?

  నాకు తెలిసిన ఒక పూల వ్యాపారిని అందరూ సాహెబ్ గారు అనే పిలుస్తారు కానీ ఒరేయ్ సాహెబు అని ఎవరూ పిలవరు. గౌరవం అనేది మనిషిని చూసి ఇస్తారు కానీ మతాన్ని చూసి ఎవరూ ఇవ్వరు. సాధారణ వ్యక్తికి మతం పేరుతో ఇతరులని ద్వేషించాలనిపించదు. విలాసంగా ఉంటూ ఏ పని చెయ్యకుండా కూర్చునే కొంత మంది ధనిక కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చెయ్యడానికి వేరే పనేమీ లేక మత విద్వేష ప్రోపగాండా చెయ్యగలరు.

 37. ప్రవీణ్

  “హిందువులకి పండగలు వస్తే తమకి డబ్బులు వచ్చాయని ఆ ముస్లింలు కూడా virtualగా పండగ ఆనందంలోనే ఉంటారు.”

  వెల్ సెడ్.

 38. పింగ్‌బ్యాక్: Homepage

 39. రాయలసీమ, నెల్లూరు జిల్లాలలో మత సామరస్యం ఉందని ఇంతకు ముందు రాజశేఖర్ గారు అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉండేవాళ్ళకి మతం గురించి పెద్దగా ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళు మతం పేరుతో కొట్టుకోవడం అనేది జరగదు. మతం గురించి బాగా తెలిసినవాళ్ళు ఉన్న పట్టణ ప్రాంతాలలోనే మతం పేరుతో కొట్టుకోవడం జరుగుతుంది.

  బ్రిటిష్ ఇండియాలో 1853కి ముందు మత ఘర్షణలు జరిగిన సందర్భాలు తక్కువ. 1853లో అయోధ్యలోని హనుమాన్ దేవాలయం ధర్మకర్త బాబ్రీ మస్జీద్ స్థలంలో ఒకప్పుడు రామాలయం ఉండేది అని చెప్పి హనుమాన్ భక్తులైన కొందరు సన్యాసులని రెచ్చగొట్టాడు. ఆ సన్యాసులు బాబ్రీ మస్జీద్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో మత ఘర్షణలు జరిగాయి. అప్పటి ఫైజాబాద్ జిల్లా కలెక్టర్ మస్జీద్‌ని రెండు భాగాలుగా విభజించి ఒక భాగంలో హిందువులు, ఒక భాగంలో ముస్లింలు ప్రార్ధనలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చాడు. కానీ ఒక రాత్రి హనుమాన్ భక్తులు మస్జీద్‌లోకి గోడ దూకి ప్రవేశించి అక్కడ రాముని విగ్రహం పాతి, పూర్వం అక్కడ రామాలయం ఉండేదని వాదించారు. దాంతో మళ్ళీ మత ఘర్షణలు జరిగాయి.

  1857 స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్‌వాళ్ళు గెలిచినా హిందువులూ, ముస్లింలూ ఐక్యంగా ఉంటే తమకి సమస్యలు వస్తాయనుకుని విభజించి పాలించు పేరుతో అధికారికంగానే మత ఘర్షణలు ప్రోత్సహించారు.

  1870లో సిక్కులు గోరక్షణ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ ఉద్యమం హిందువుల చేతుల్లోకి వెళ్ళడంతో హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలు మళ్ళీ పెరిగాయి.

  1947లో దేశ విభజనవల్ల ఉత్తర భారత దేశం & పాకిస్తాన్‌లలో మత ఘర్షణలు జరిగాయి. ఇండియా నుంచి లక్షలాది మంది ముస్లింలు పాకిస్తాన్‌కి వలస వెళ్ళిపోయారు. పాకిస్తాన్ నుంచి లక్షలాది మంది హిందువులూ, సిక్కులూ ఇండియాకి వలస వచ్చారు.

  ఇప్పుడు కశ్మీర్ అంశం పేరుతో హిందువులు, ముస్లింల మధ్య మత విద్వేషాలని రెచ్చగొట్టే రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇండియాలో పాకిస్తాన్‌ని తిట్టడమే దేశభక్తి అని ప్రబోధించే సినిమాలు నిర్మిస్తున్నారు, పాకిస్తాన్‌లో స్కూల్ పుస్తకాలలో హిందువుల గురించి చెత్తగా వ్రాసి పిల్లల మనసుల్లో విషం ఎక్కిస్తున్నారు.

  అయితే పల్లెటూర్లలో రోజూ కష్టం చేసుకుంటే బతికేవాళ్ళకి మతం పేరుతో కొట్టుకోవడానికి సమయం ఉండదనే నమ్ముతాను. బిజెపి ఎన్ని మత ఘర్షణలు సృష్టించినా బిజెపికి వోట్లు ఎక్కువ పడడం లేదు. తమది సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్‌వాళ్ళకి మాత్రం వోట్లు ఎక్కువ పడుతున్నాయి.

  కాంగ్రెస్ కూడా తమకి అవసరమనిపించినప్పుడు మతాన్ని ఉపయోగించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇందిరా గాంధీ చనిపోయినప్పుడు సిక్కు వ్యతిరేక హింస చెయ్యించింది కాంగ్రెస్ కార్యకర్తలే. కానీ నిత్యం హిందూత్వ నామ జపం చేసే బిజెపికి ఎన్నికలలో ఎందుకు ఓడిపోతోంది? హిందువులలో మత గ్రంథాలు చదివేవాళ్ళు తక్కువ. మత గ్రంథాలు చదివేవాళ్ళు కూడా తమ నిత్య జీవితంలో మత విశ్వాసాల కంటే భౌతికతనే ఎక్కువగా ఆచరిస్తారు. అందుకే ఇండియాలో మతఘర్షణలు ఎక్కువగా జరగడం లేదు. జరిగినా అవి బిజెపివాళ్ళో, ఐఎస్‌ఐ ఏజెంట్లో రెచ్చగొడితేనే జరుగుతాయి.

  ఇంతకు ముందు రాజశేఖర్ గారు గ్రామీణ ప్రాంతాలలో మత సామరస్యం ఉంది అని అన్న మాటలో నిజం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరో రెచ్చగొడితే తప్ప మత ఘర్షణలు జరిగే పరిస్థితులు లేవు. క్రైస్తవ దేశాలలాగో, ఇస్లామిక్ దేశాలలాగో మత చట్టాలు కూడా లేవు. ఇక్కడ దేవాలయానికి వెళ్ళి కొబ్బరి కాయలు కొట్టడం & పూజలూ, పురస్కారాలూ చెయ్యడం వరకు మాత్రమే మత విశ్వాసాలు బలంగా ఉన్నాయి. ప్రజలని రెచ్చగొట్టి మతఘర్షణలు సృష్టించినా వోట్లు ఎక్కువ పడే పరిస్థితి లేదు. మతతత్వ పార్టీలకి వోట్లు ఎక్కువ పడినా, పడకపోయినా ప్రజలు మతపరమైన హింస వైపు వెళ్ళకుండా తమ జాగ్రత్తలో తాము ఉండాలి.

 40. ప్రవీణ్, మంచి సమాచారం. క్రైస్తవ దేశాల్లోనూ మత చట్టాలున్నాయని చెప్పడం ఎవరూ పట్టించుకోని సమాచారం. అమెరికా, యూరప్ దేశాల్లో మత తత్వంతో కూడి ఉన్న మత చట్టాలున్నా అవి సెక్యులర్ దేశాలుగా చలామణీ అవుతుంటాయి. కేవలం ముస్లిం మత తత్వమే మత తత్వంగా వారు చెలామణి చేస్తుంటారు.

 41. మత చట్టాలు ఎందు కోసం, ఎవరి కోసం?

  ఒక ఉదాహరణ చెపుతాను. అమెరికాలో వ్యభిచారం నేరమే కానీ పోర్నోగ్రఫీ(అశ్లీల చిత్రాలు) మాత్రం నేరం కాదు. అయితే క్రైస్తవ మతం ప్రకారం ఈ రెండూ నిషిద్ధమే. కానీ ఆ మతం ఆధారంగా వ్రాయబడిన చట్టాలలోనే ఈ వైరుధ్యం ఎందుకు ఉంది?

  క్రైస్తవ దేశాలవాళ్ళు అబార్షన్‌లు వంటి నిర్ణయాలలో స్త్రీలకి స్వేచ్ఛ లేకుండా చెయ్యడానికి మత చట్టాలు ఉపయోగించుకుంటారు కానీ పోర్నోగ్రఫీ లాంటి వాటిని నిషేధించడానికి మత చట్టాలకి పదును పెట్టరు.

 42. Mr. Visekhar, Countries like Turkey that are ruled by compradors of American imperialists, claim themselves as secularists but those countries that oppose American imperialists, claim themselves as islamist (example:Iran).

  Some times, secularism is more anti-progressive than religion.

 43. ప్రవీణ్, టర్కీ పాలకవర్గాల సెక్యులరిస్టు ఫోజుల్లో తప్పు వెతకాలి తప్ప సెక్యులరిజం లో తప్పులు వెతకడం సరికాదు.

  ఇరాన్ పాలకులు అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించినంత మాత్రాన వారి మత విధానాల వల్ల జరుగుతున్న నష్టాన్ని విస్మరించలేం.

  ప్రపంచానికి ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాదం ప్రధాన ప్రమాదం గా ఉంది. టర్కీ పాలకులు అమెరికాతో కుమ్మక్కయినందున అది మూడో ప్రపంచ దేశాల ప్రజలకు శత్రువుగా తమను తాము చూపించుకుంటున్నారు. ప్రపంచ ప్రజల ప్రధాన శత్రువుగా ఉన్న అమెరికా సామ్రాజ్యవాదాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్న ఇరాన్ పాలకులు అందుకే అభినందనీయులు. ప్రపంచ రాజకీయాలో ఇరాన్ పాలకులు అభివృద్ధికర పాత్ర నిర్వహిస్తున్నప్పటికీ ఇరాన్ ప్రజల వరకూ తీసుకుంటే ఇరాన్ పాలకుల అభివృద్ధి నిరోధక మత విధానాలు వారికి చేటు చేస్తున్నాయి. ఈ తేడాను మనం గుర్తించాలి.

  తక్షణ విశ్లేషణలో చూసినపుడు ఇరాన్ అమెరికా వ్యతిరేక పాత్ర అభ్యుదయకరంగా చూడవలసిందే.

 44. Uncivilised practices like virginity tests are more in secular Turkey than islamist Iran.

  In Turkey, two hostel girls commited suicides because of virginity tests. A woman minister openly supported those tests to please male politicians. We cannot think that secularism is always progressive. Even religion cannot be progressive in all cases.

  Semi-nude beauty contests were legal in Nepal during Hindu autocratic rule. They were banned in Nepal only after the fall of autocracy (rajarikam).

 45. ప్రవీణ్ మీరు చెప్పిన కోణంలో మత తత్వ ఇరాన్ కంటే సెక్యులరిస్టు టర్కీ బెటర్ గా కనిపించవచ్చు. కానీ టర్కీ చెప్పుకుంటున్న సెక్యులరిజం ‘సెక్యులరిజం’ కాదు. కేవలం మతాన్ని రాజ్యం విధానంగా స్వీకరించనంత మాత్రాన టర్కీని సెక్యులర్ అని చెప్పలేము. మీరు చెప్పిన మతాధార పరీక్షలను నివారించకుండా అది సెక్యులర్ గా చెప్పుకోలేదు.

  సెక్యులరిజం అంటే ఏ మతాన్నీ రాజ్యం ఆదరించకపోవడం. ఇండియాలో అది అన్ని మతాల్నీ సమానంగా ఆదరించడంగా చెబుతారు. కాని సెక్యులరిజం అర్ధంలో అది కరెక్టు కాదు. మత ఆచరణను వ్యక్తిగత హక్కుగా గుర్తిస్తూ రాజ్యం తనకు తానుగా ఏ మతాన్నీ ఆదరించకపోవడమే సెక్యులరిజం. సెక్యులరిజం అన్నది మనుషులు మత పరమైన విబేధాలు లేకుండా బతకడానికి ఉద్దేశించిన జీవన విధానం. ఓట్ల కోసం దీన్ని భారత దేశ పాలకులు అపహాస్యం చేశారు.

  భారత దేశంలో సెక్యులరిజానికి బి.జె.పి ఎంత ప్రమాదకారో, కాంగ్రెస్ కూడా అంతే ప్రమాదకారి. ఇరు పార్టీలకు ఈ విషయంలో తేడాల్లేవు. ఒకరు చెప్పి చేస్తే, మరొకరు ముసుగులో చేస్తున్నారు. అదే తేడా.

  మీరు సెక్యులరిజం సిద్ధాంతాన్నే తప్పు పడుతున్నారు. అది సరికాదు.

 46. We are living in class society. In class society, ruling classes believe different strategies to justify their power. Either it is secular Turkey or islamist Iran.

  In India, there is nothing to talk about secularism. Here, any one can claim himself as secularist either he breaks coconut in Saibaba temple or sacrifices goat in Bhadrakali temple.

  European ruling classes claim that they separate the religion from constitution. But Indian ruling classes never claimed so and they even changed the meaning of secularism to attract people of all religions.

 47. టర్కీ దేశానికి సెక్యులరిజం తెచ్చినది ముస్తఫా కెమాల్ అటాటుర్క్. అతను పూర్వపు ఉస్మానీ చక్రవర్తులు (ottoman rulers)కి భిన్నంగా అక్కడ సెక్యులరిజాన్ని తీసుకొచ్చాడు.

  ఇక్కడ ఇండియాలో సెక్యులరిజాన్ని తీసుకొచ్చింది జవహార్ లాల్ నెహ్రూ. నెహ్రూ వ్యక్తిగతంగా నాస్తికుడు. అందుకే అతను మతాన్ని పరిపాలనలోకి తీసుకురాలేదు. కానీ అన్ని మతాలూ సమానమేనని వాదించినది సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇప్పటి నాయకులు నమ్ముతున్నది సర్వేపల్లి రాధాకృష్ణన్ శైలి సెక్యులరిజమే కానీ నెహ్రూ తీసుకువచ్చిన సెక్యులరిజం కాదు.

 48. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి సున్నపురాళ్ళపల్లె జయరామరెడ్డి గారు వ్రాసిన “సుజరె జ్ఞాన దీపిక” అనే పుస్తకంలో చదివాను. ఒక నాస్తిక మీటింగ్‌కి వెళ్ళినప్పుడు సుజరె గారే నాకు ఆ పుస్తకం ఇచ్చారు.

 49. గతంలో వాసవ్య గారి బ్లాగ్‌లో మతం గురించి పెద్ద చర్చలే జరిగాయి. ఆ చర్చలు చదివిన తరువాత నాకు అర్థమైంది ఏమిటంటే “మన హిందూత్వవాదులు రాందేవ్ బాబాకి వ్యతిరేకంగా వార్తలు వచ్చినప్పుడు ఒకలాగ ప్రతిస్పందిస్తారు, నిత్యానందకి వ్యతిరేకంగా వార్తలు వచ్చినప్పుడు ఇంకోలాగ ప్రతిస్పందిస్తారు” అని.

  నిత్యానంద స్వామి రాందేవ్ అంతటి ప్రముఖ సన్యాసి కాకపోవచ్చు. కానీ నిత్యానందకి వ్యతిరేకంగా వచ్చిన వార్తలు మాత్రమే నిజాలనీ, రాందేవ్‌కి వ్యతిరేకంగా వచ్చిన వార్తలు అబద్దాలనీ కొట్టిపారెయ్యలేము.

  “మతం అనేది ఊహాజనితం, స్వర్గనరకాలు లాంటి ఊహాజనిత విషయాలకి భయపడి మనిషి నీతిగా బతకడం అనేది జరగదు” అని ఒప్పుకుంటే సాధారణ వ్యక్తి పాపాలు చేసే అవకాశం ఎంత వరకు ఉందో, నిత్యానంద స్వామి కూడా పాపాలు చేసే అవకాశం అంత వరకే ఉందనుకోవాలి. నిత్యానంద స్వామి కూడా ఒక మనిషే. అతను వేదాలు చదివాడు, ఇతరులు వేదాలు చదవలేదు. అతనికీ, ఇతరులకీ మధ్య ఉన్న తేడా అదొక్కటే.

  రాందేవ్ వేదాలు చదవడంతో పాటు యోగ కూడా నేర్చుకున్నాడు, ఆయుర్వేద మందులు కూడా తయారు చేస్తుంటాడు (అందులో ఎముకల పొడి కలుపుతాడా, లేదా లాంటి వివాదాస్పద విషయాలు పక్కన పెడదాం. ఎందుకంటే ఒక బ్లాగర్ వాళ్ళ నాన్నగారు కూడా ఆయుర్వేద మందులలో ఎముకల పొడి ఉపయోగిస్తారని వ్రాసారు).

  ఎలాగైతేనేం, రాందేవ్ నిత్యానంద కంటే కొన్ని పత్రాలు ఎక్కువ చదివినవాడే. అయినా రాందేవ్ కూడా సమాజానికి అతీతుడు కాదు, సమాజంలో సాధారణ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో, రాందేవ్ ప్రవర్తన కూడా అలాగే ఉండే అవకాశాలు ఎక్కువ.

  సన్యాసులు కూడా సాధారణ మనుషులే కానీ మన బ్లాగుల్లో రాందేవ్ లాంటి ప్రముఖ సన్యాసిపై విమర్శలు వస్తే విమర్శించినవాళ్ళు తమ మతంపై పడి ఏడుస్తున్నారని హిందూత్వవాద వర్గంవాళ్ళు అంటారు. కానీ నిత్యానందపై విమర్శలు వచ్చినప్పుడు నలుగురితో పాటు నారాయణ అన్నట్టు అందరూ నిత్యానందని తిడతారు.

  మన తెలుగు బ్లాగుల్లో మతం లాంటి వాటి గురించి చర్చలు ఇలాగే జరుగుతాయి.

 50. నిన్న బస్సులో విజయనగరం వెళ్తున్నప్పుడు నా పక్కన ఉన్న ఒక ప్రయాణికుడు ఒక ఆర్.ఎస్.ఎస్. పత్రిక చదువుతున్నాడు. నేను పక్క నుంచి ఆ పత్రికలోకి తొంగి చూశాను. అందులో ఏమి వ్రాసి ఉందంటే:

  “మతం మత్తు మందు కాదట, మార్క్సిజమే మత్తు మందు అట, మార్క్సిజం ఒక సత్తెకాలపు సిద్ధాంతం అట, అది ఈ రోజులలో పనికి రాదట!”

  సత్య యుగం, కలి యుగం లాంటి కాన్సెప్షన్స్‌ని మత భక్తులు నమ్ముతారు కానీ మార్క్సిస్ట్‌లు నమ్ముతారా? పత్రికలో ఆ వ్యాసం వ్రాసిన వ్యక్తికి మార్క్సిజం గురించి ఎలాగూ తెలియదు. ఇందులో సందేహం లేదు. కానీ అతనికి తాను విశ్వసిస్తున్నట్టు చెప్పుకునే మతం గురించి కూడా ఏమీ తెలిసినట్టు లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s