- అహ్మదాబాద్లో 134వ రధయాత్ర ఉత్సవాలలో భరతమాత చిత్రాన్ని ఒంటిపై చిత్రించుకున్న ఓ ఉత్సాహవంతుడు.
- అహ్మదాబాద్ లో ఓ ఫ్యాక్టరీనుండి వ్యర్ధాలు ముంచెత్తిన రోడ్డుపైన ఆటో డ్రైవర్ కష్టాలు. మోడీ సాధించిన అభివృద్ధి ఇదే కాబోలు.
- ప్లాస్టిక్ బంతుల లోడును న్యూఢిల్లీలొ హోల్ సేల్ మార్కెట్ కి తరలిస్తున్న ఆటో రిక్షా డ్రైవర్
- జమ్ము శివార్లలోని హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో ఉల్లిపాయల బస్తాలపైన సేద తీరుతున్న కార్మికుడు
- సిమ్లాలో కోతికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహిస్తున్న పశువుల డాక్టర్
- ఏడున్నర అడుగుల ఎత్తుగల గట్టయ్యతో ఓ అభిమాన సందర్శకురాలు ఫొటో ఫోజు
- మదర్ ధెరెసా 101వ పుట్టిన రోజు కోసం కోల్ కతాలో ఆమె విగ్రహానికి తుది మెరుగులు దిద్దితున్న ఓ శిల్పి
- జమ్ములోని కోట్ భల్వాల్ జైలులో నవ్వు ధెరపీ ని ప్రాక్టీసు చేస్తున్న ఓ ఖైదీ
- ఉత్తర ప్రదేశ్ లోని ఖుర్జా గ్రామంలో ఉదయం రద్దీని మోస్తున్న ఓ గ్రామీణ బస్సు. స్కూళ్ళకి వెళ్ళే విద్యార్ధులకీ ఇదే ఆధారం.
- 134వ రధయాత్ర ఉత్సవాల కోసం తమ విద్య ప్రదర్శించడానికి రిహార్సల్స్ వేసుకుంటున్న భక్తులు
- నిలిపి ఉన్న ట్రక్కు ట్రాలర్ క్రింద విశ్రాంతి తీసుకుంటున్న కార్మికులు
- షారుఖ్ అభిమాని బెడ్ రూం ఫొటో ఇది. 22,000 షారుఖ్ బొమ్మలను సేకరించిన విశాల్ బెడ్ రూం నిండా కూడా షారుఖ్ బొమ్మలే.
- గట్టయ్యకి ఒక కాలుకి పాదం లేదు. మంచం కింద విశ్రాంతి తీసుకుంటున్న కృత్రిమ పాదం.
- రాజస్ధాన్ లోని బనేతా గ్రామంలో తన కోతి (రాజు)కి పెళ్ళి చేసే ముందు సిగరెట్ తాగిస్తున్న యజమాని రాజేష్. ఈ పెళ్ళిని ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నించి విఫలమయ్యింది.
- లక్నోలొ హోమియోపతి మందుల షాపు యజమాని విశాల్ సింగ్ కి షారుఖ్ అంటే పిచ్చి అభిమానం. తన షాపు నిండా షారుఖ్ బొమ్మలనే అతికించిన విశాల్ వద్ద 22,000 షారుఖ్ బొమ్మలు ఉన్నాయట!
–
–














