“ఇంకొన్ని వీధి చిత్రాలు” అంటూ నేను ప్రచురించిన వీధి చిత్రాల పోస్టు కింద నేను, వేణు గారూ త్రి-డి చిత్రాలను ఎలా గీస్తారబ్బా అని ‘హ్యాశ్చర్యపడి’ పోయాం. అందులో ‘హాశ్చర్యపడ్డానికి’ ఏమీ లేదు అని మిత్రుడు కెవిన్ ఒక వీడియోని తన వ్యాఖ్యలో ప్రచురించారు. ఇందులో త్రి-డి చిత్రాలు మనకు అలా ఎందుకు కనిపిస్తాయో వివరణ ఉంది. కెవిన్ ఇచ్చిన వీడియోని పట్టుకొని వెళ్తే ఇదిగో, ఈ వీడియో కూడా కనపడింది. మా హాశ్చర్యాన్ని నివృత్తి చేసిన కెవిన్ కి కృతజ్ఞతలతో…
నా పోస్టు లింకు ఇది: “ఇంకొన్ని వీధి చిత్రాలు“
–
–
కనికట్టు చేసే త్రీడీ చిత్రం ఎలా వేస్తున్నారన్నది ఇంత త్వరగా తెలిసిపోయినందుకు సంతోషంగా ఉంది. ఇంటర్నెట్ తో సౌలభ్యం, ఉపయోగం ఇదే!
కెవిన్ గారు వ్యాఖ్యతో పాటు ఇచ్చిన వీడియో, మీరు పెట్టిన వీడియో చాలా విషయాలను తెలిపాయి. ఆ చిత్రకారుల ప్రతిభా నైపుణ్యాలు అబ్బురం కలిగించేలా ఉన్నాయి! ఈ త్రీడీ బొమ్మల విషయంలో మన తెలుగు చిత్రకారులెవరూ కృషి చేసినట్టు లేదు…
అదే చిత్రంగా ఉంది వేణు గారూ. పశ్చిమాన ఇంత ప్రాచుర్యం పొందిన వీధి, త్రి-డి చిత్ర కళ ఇండియాలో కనపడకపోవడానికి కారణం ఏంటో అర్ధం కావడం లేదు.
పేదవాళ్ళు కొంతమంది దేవుళ్ళ బొమ్మలు రోడ్లపక్క వేసి చందాలు అడుగుతూ ఉంటారు. కేవలం సుద్దముక్కలతో అవి గీస్తుంటారు. బహుశా వారితో పోల్చుకుని వీధి చిత్రాలకు సిద్ధం కావడం లేదేమో. బెంగుళూరు, న్యూఢిల్లీల్లో రోడ్డు పక్క గోడలపై వేసిన చిత్రాలు నేను ప్రచురించాను. అవి ఒక రకం. యూరోప్ వీధి చిత్రాలకూ వాటికీ పోలిక లేదు. యూరప్ దేశాల వీధి చిత్రాల్లోని టెక్నిక్ ని పట్టుకుని దానిని దేశీయం చేయగలిగితే మరొక ప్రత్యేక చిత్రకళ పుట్టుకు రావచ్చు. ఎవరైనా ఆర్టిస్టులు దానికి ప్రయత్నిస్తే బాగుడ్ను.