ఇంకొన్ని యూరోపియన్ వీధి చిత్రాలు -ఫొటోలు


యూరోపియన్ వీధి చిత్రాల్లో కనిపిస్తున్న త్రీ డైమెన్షనల్ ఎఫెక్టు చాలా అబ్బురపరిచే విధంగా ఉంటోంది. ఉదాహరణకి కింది ఫొటోల్లో ఎనిమిదవ ఫొటో చూడండి. ఆ బొమ్మ నిజానికి నేలపైన గీసిందే. బొమ్మ చివర స్త్రీ కూర్చుని ఉంది. కానీ చూస్తుంటే పులి నిజాంగా నిల్చుని ఉన్నట్లూ, స్త్రీ ఆ పులిపైన కూర్చుని ఉన్నట్లూ కనిపిస్తోంది. అలాగే పదకొండవ ఫొటో కూడా. ఇది నిజానికి సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ త్రీ-డి ఎఫెక్టు ఎలా వచ్చిందన్నదీ ఓ పట్టాన అర్ధం కావడం లేదు. ఆ బొమ్మ నిజానికి పరస్పరం లంబకోణంలో ఉన్న రెండు ఉపరితలాలపైన గీసిన చిత్రం. కాని రెండు ఉపరితలాలపైనా గీస్తూ త్రి-డి ఎఫెక్టు తీసుకురావడంలో ఉన్న మర్మం ఏమై ఉంటుందో బోధపడడం లేదు.

-స్ట్రీట్ ఆర్ట్ యుటోపియా

3 thoughts on “ఇంకొన్ని యూరోపియన్ వీధి చిత్రాలు -ఫొటోలు

  1. ఈ బొమ్మల మాయాజాలం భారతంలోని మయసభ ఘట్టాన్ని తలపిస్తోంది. రోడ్ల మీద బొమ్మల కందకాలు నిజంగానే అక్కడున్నాయన్న భ్రాంతి కలిగిస్తున్నాయి. సైకిల్ మీద అమ్మాయి బొమ్మ నీడలతో సహా సహజంగా ఉంది. అది గోడమీద వేసిందని చప్పున అర్థం కాదు. ఇక గొడుగులో చినుకులకు తడిసిపోతూ బయట వాన కురవని దృశ్యంలోని చమత్కారం నవ్వు తెప్పిస్తోంది.

    ఈ త్రీడీ బొమ్మలను ఎలా వేయగలిగారో..తెలిస్తే బాగుణ్ణు!

వ్యాఖ్యానించండి