ఇప్పుడు తిరుపతికి వెళ్తుంటే……


ఆచారాలు, సంప్రదాయాలు భ్రష్టు పట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండకూడదు.

ఇప్పుడు తిరుపతికి వెళ్తుంటే క్లబ్ కి వెళ్తున్నట్లుంది –చిన జీయరు స్వామి

*

*

*

*

(………. …………. …………… ఎడిట్)

చినజీయరు స్వామి గారు తిరుపతిని క్లబ్బుతో పోల్చకుండా ఉండవలసింది. ప్రభుత్వం తెస్తున్న మార్పులు అదనంగా వచ్చి చేరేవే తప్ప తిరుపతికి స్వతహాగా ప్రజల్లో ఉన్న గౌరవానికి భంగం కలిగించేవి కాదు. అందువలన ప్రజల మనసుల్లో గౌరవ స్ధానంలో ఉన్న తిరుపతిని క్లబ్బుతో పోల్చినపుడు తిరుపతికి స్వతహాగా ఉన్న స్ధాయిని పక్కనబెట్టి  ఆ స్ధలంలో తెస్తున్న మార్పులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. స్వామివారి ఉద్దేశ్యం అది కాకపోయినా అర్ధం అది వస్తోంది.

31 thoughts on “ఇప్పుడు తిరుపతికి వెళ్తుంటే……

  1. చిన్న జీయరు స్వామి గారు చదువుకునే రోజుల్లో బెట్రాండ్ రస్సల్ గారి పుస్తకాలను బాగా చదివానని, ఒకసారి ఆయన ఉపన్యాసం లో చేప్పగా విన్నాను. క్లబ్ వేళితేగాని దాని గురించి తెలియదా? అంత లోకజ్ణానం లేకుండా ఉంటారని మీ అభిప్రాయమా?

  2. శ్రీరాం గారూ, లోక జ్ఞానంలో క్లబ్ పరిజ్ఞానం కూడా ఉంటుందని నాకు నిజంగానే తెలియదు. బెర్ట్రాండ్ రస్సెల్ పుస్తకాలకీ క్లబ్ పరిజ్ఞానానికీ సంబంధం కూడా నాకు తెలియదు. బెర్ట్రాండ్ రస్సెల్ కాలానికి భారత దేశంలో క్లబ్బులు వ్యాప్తిలోకి వచ్చాయా అని నాకు అనుమానం.

    మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, తిరుపతికీ క్లబ్ కీ ఆయన ఎక్కడ పోలిక తెచ్చారో కూడా నాకు అర్ధం కాలేదు. మీకేమయినా అర్ధం అయితే చెప్పండి.

  3. చిన్న జీయర్ స్వామి చెప్పిన విషయం మీకు అర్థమైనట్టు లేదు. సినిమా హీరోయిన్లు తిరుపతి వచ్చినప్పుడు అధికారులు వాళ్ళకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం గురించి అయ్యుంటుంది.

  4. I am not sure why you are stooping down to personal abuse? ఆ context లో దేవాలయనికి club లాగా దబ్బులు ఇచ్చి వెళ్తున్నారని లంచాలు ఇచ్చి tickets కొంటున్నారని చెప్పారు. It would help if you post the entire print from news. Not wise to take words out of context and comment on them.

  5. పావని గారూ, నేను చెప్పదలుచుకున్నది అది కాదు. ప్రభుత్వం చేసిన మార్పులను క్లబ్బుతో ఎందుకు పోల్చారు? మీరు చెప్పండి.

  6. ప్రవీణ్, అవును అర్ధం కాలేదు. కాని సినిమా హీరోయిన్లకి ప్రాధాన్యత ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఒక్క క్లబ్బుల్లోనే కాదు కదా?
    అదీ కాక మీరు ‘అయి ఉంటుంది’ అంటున్నారు. కనుక మీకూ తెలిసినట్లు లేదు.

  7. తిరుపతి పైన చిన జీయరు స్వామి కామెంటు కనుక కాంటెక్స్ట్ అందరికీ తెలిసి ఉంటుందన్న అంచనాతో దానిని ఇవ్వలేదు. ఐనా కాంటెక్స్ట్ రాసి ఉంటే మీరన్నట్లు బాగుండేది. మీరు రాసి ఇప్పుడు నాకా శ్రమ తప్పించారు. ధాంక్స్.

    ఐతే, నా అనుమానం అలానే ఉంది. క్లబ్బులకి డబ్బులు కస్టమర్ల లెక్కన ఇచ్చి వెళ్తారు. అక్కడ సర్వీస్ అమ్మడం, కొనడం జరుగుతోంది. తిరుపతికి భక్తులు రావడం చందాలు ఇవ్వడం మామూలు కార్యక్రమమే కదా? హుండీలో చందాలు వెయ్యడం కూడా ఆచారమే కదా? ఇక లంచాలు ఇచ్చి టికెట్ లు కొనడం క్లబ్బులో జరిగేపని కాదు కదండీ. మరి క్లబ్బుతో ఎందుకు పోల్చినట్లు?

    తిరుపతిలో జరిగిన ఏర్పాట్లకీ, క్లబ్బు ఏర్పాట్లకీ ఆయన చూసిన సాపత్యం ఏంటన్నది నాకు అర్ధం కాలేదు. మీకు తెలిస్తే చెప్పండి.

  8. సంజయ్ గారు, ఏ దేవాలయంలోనైనా జరిగేది వ్యాపారమే. మొన్న దూసి రైల్వే స్టేషన్‌లో ఇద్దరు మాట్లాడుకుంటోంటే విన్నాను. ఈ ఏడాది శబరిమలకి వెళ్ళే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయిందని ఒకాయన అన్నాడు. భక్తులకి భద్రత కల్పించకుండా భక్తుల ద్వారా వచ్చిన ఆదాయంతో డబ్బులు మిగుల్చుకుంటే భక్తులు ఎలా వెళ్తారు అని నేను అన్నాను.

  9. నేను ఇంతవరకూ క్లబ్బుకు వెల్లలేదు. కానీ, చాలా సినిమాలలో చూశాను. చాలా మంది వెల్లిన వారు చెబితే విన్నాను. మరికొంత అక్కడి కెల్లిన జనాలు చేసే పనులను బట్టి ఊహించాను. ఈ మాత్రం చాలదా చెప్పండి. చంద్రుడి మీద వాతావరణం ఉండదని చెప్పడానికి నేను మీరు చంద్రునిదాకా వెల్లి రావాల్సిన పనిలేదు. సూర్యుడు మీద ఎంత ఉష్నోగ్రత ఉందో చెప్పడానికి అక్కడికెల్లి కొలవాల్సిన పనీ లేదు. కాదు అలా చేసిన వాటినే నేను నమ్ముతాను అంటే మీ ఇష్టం.

  10. మీరు ఉదహరించిన అంశాలలాంటివీ నేనూ ఇంకొన్ని ఉదహరిస్తాను. కాని ఏం లాభం విషయంలోకి వెళ్లకుండా?

    పైన వ్యాఖ్యాతలను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు మీరన్నా ఇవ్వండి. స్వామి గారు తిరపతినీ క్లబ్బులనీ ఏ విధంగా పోల్చారు? అది చెప్పి పుణ్యం కట్టుకోండి.

  11. మొదట నేను కూడా ఇద్దామనే అనుకున్నాను. కానీ, మీరు రాసింది చిన్న జీయరు స్వామి క్లబ్బులౌ వెల్లాడా వెల్లితే ఎందుకు వెల్లాడు అని. కానీ, వ్యాఖ్యాతలు మీ వాదనలో పసలేదని తేల్చేసిన తరువాత మాత్రమే అయన ఉద్దేశ్య మేమిటి అని అడగడం మొదలు పెట్టారు అందుకే రాయలేదు. వాటికి గురించి చర్చించలేదు.

  12. ఇంతకీ స్వామి వారు క్లబ్ కి ఎప్పుడు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు?
    పై వాక్యంలో మీ వ్యంగ్యం బాగానే అర్ధం అవుతోంది. మీరు ఈ వార్త కిందనే తిరుపతి లో అక్రమాల గురించి ఇంకొక వార్త కూడా ఉంది (ఈనాడులో). చూడగలరు. స్వామి వారి ఆవేదన అటువంటి వాటి గురించే.

    ఇక క్లబ్బుకి గుడికి పోలిక.
    1. పవిత్రత – కొండ మీద కూడా మద్యం వస్తోందని ఎప్పటి నుంచో విమర్స ఉంది.
    2. సదాచారం – క్లబ్బులో ఉండదు కాబట్టి చెప్పకర్లేదు. తిరుపతి లో పాటించవలసిన నియమాలు అమలు అవ్వట్లేదని ఒక విమర్స.
    3. విచ్చలవిడితనం – క్లబ్బులో ఉంటుందని మనకి తెలుసు. ఈ విషయం మీద కూడా కొండ మీద ఎన్నొ సంఘటనల్లో విమర్సలు వచ్చాయి.

    ప్రస్తుతానికి ఇవి.

    Actually I like your analysis on some of the current affairs, and i do think you are sensible in your opinions. So this is a surprise for me. This is neither a national nor international issue. Neither it is hurting anyone. Not sure why you are hurt by Swamiji’s comments on administration and government.
    You yourself have condemned the acts of administration and government on many occasions.

  13. నా ప్రశ్నను నేరుగా తీసుకుంటే మీరు చెప్పుకున్న అర్ధమే వస్తుంది. నా ప్రశ్నల అంతరార్ధం వ్యాఖ్యాతలకు అర్ధం కాలేదని అర్ధం అయ్యాక వివరించాను.
    మీరు కష్టపడుతున్నారు గానీ నా వాదన ప్రత్యేకంగా ఏమీ లేదిక్కడ. క్లబ్బులకీ, తిరుపతీలో ప్రభుత్వం తెచ్చిన, తెస్తున్న మార్పులకి సంబంధం నాకు అర్ధం కాలేదు కనకనే ఈ పోస్టు రాశాను.
    నా పోస్టులొ వ్యంగ్యం లేకేం? ఉంది. స్వామివారు చెప్పదలుచుకున్నది నేరుగా చెప్పి ఉండవచ్చు. స్వామి వారు గనక అదే సరిగ్గా ఉంటుందని నా అభిప్రాయం. అలా కాక పోలిక తేవడంతో నాకు సందేహం తలెత్తింది.

    ప్రభుత్వంపైన స్వామి వారు చేసే విమర్శ వ్యంగ్యం గా కాకుండా నేరుగా ఉంటే బాగుంటుంది. ప్రభుత్వం ఒక పెద్ద. స్వామి వారు మరొక పెద్ద. ఇద్దరి మధ్య చర్చ లేదా సంభాషణ లేదా అలాంటివి ఇంకేమైనా… ఇలా వ్యంగ్యం మిళితం కాకుండా నేరుగా చెబితేనే పెద్దరికంగా ఉంటుంది.

    నా వ్యాఖ్యానం పైన వ్యాఖ్యాతలు చక్కగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తమరి లాగా ‘పస’ లు లాంటివేవీ తేల్చలేదు. విషయం వదిలి ‘పస’ లు గురించి మాట్లాడకుంటేనే నయం. కదా?

  14. సంజయ్ గారూ వ్యంగ్యం ఉంది. లేదని నేననను. స్వామివారి విమర్శలో వ్యంగ్యం ఉంది కనుక బహుశా నా వ్యాఖ్యానంలోనూ వ్యంగ్యం దొర్లింది. దాన్ని వదిలేద్దాం.

    తిరుపతిలో ఫలానా అక్రమాలు జరుగుతున్నాయి, నివారించాలని గానీ, ప్రభుత్వ విధానాల వలన ఫలానా విధంగా తిరుపతి ఆచారాలకు నష్టం ఏర్పడుతున్నదని గానీ స్వామివారు చెప్పి దానితో పరిమితమై ఉంటే బాగుండేది. ప్రభుత్వం లాంటి పెద్ద సంస్ధ కార్యక్రమాలను స్వామివారి లాంటి పెద్దవారు ఆ విధంగా విమర్శిస్తే, అటువంటి విమర్శలకు అవసరమైన వెయిట్ వస్తుంది. తిరుపతిని క్లబ్బుతో పోల్చడం తిరుపతికి వెళ్ళే అలవాటు లేని నాకే నచ్చలేదు. అందుకే విమర్శ. తిరుపతి ఆచారాలపైన భక్తులకి ఉండేలాంటి గౌరవం నాకు లేకపోయినా అక్కడికి వెళ్ళే మనుషులపైన నాకు గౌరవం ఉంది. వారి ఆచారాలను, నమ్మకాలను గౌరవించాలన్న స్పృహ ఉంది. ఆ నేపధ్యంలోనే స్వామి వారి విమర్శ నేరుగా, ప్రభుత్వానికి అంటేలా, ప్రజలకూ అర్ధం అయ్యేలా ఉండాలని నా భావన.

    అలా కాదు. చిన జీయరు గారిని అవమానించాలనే ఆయన మాటలల్ని ఎత్తి చూపుతున్నానని మీరు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అదేమీ లేదని మాత్రం చెప్పగలను.

    ప్రభుత్వం లోని వ్యక్తులు ఎన్ని మార్పులు చేసినా అది పవిత్ర దృక్పధంతోనే చేస్తారు తప్ప క్లబ్బు దృక్పధంతో మాత్రం కాదని నా అభిప్రాయం. (వ్యాపార దృక్పధం ఎలానూ ఉంటుంది.) అందువలన స్వామివారంతటివారు క్లబ్బుతో పోల్చినపుడు అసందర్భంగా తోచింది.

    ప్రజల సెంటిమెంటు, భక్తి లతో కూడుకున్నది కావున తిరుపతి మార్పుల అంశాన్ని అంతే సున్నితంగా స్వామివారు డీల్ చేసి ఉంటే బాగుండేది.

    నేనిక్కడ ‘స్వామివారు’ అని పదే పదే అంటున్నది మీ సెంటిమెంట్లను గౌరవించడానికే తప్ప వ్యంగ్యంగా కాదని గమనించాలి. మతాలపైన నాకున్న దృక్పధమే ఉన్నవారితో మాట్లాడేపుడు ‘చిన్న జీయరు’ అనే సంబోధిస్తానే తప్ప ‘స్వామివారు’ అని అనను.

    * * * * * * * *

    సంజయ్ గారూ, నిజానికి మీరు ఆశ్చర్యపడవలసిందేమీ ఇక్కడలేదని నేను చెప్పదలిచాను. ప్రభుత్వాన్ని స్వామివారు అన్నందువలన కూడా నాకేమీ బాధలేదు. తిరుపతికి ఒక స్ధాయి జనంలో ఉంది. దానికి అదనపు మార్పులు ప్రభుత్వం చేస్తొంది. ఆ అదనపు మార్పుల వల్ల తిరుపతి క్లబ్బుతో పోల్చడానికి వీల్లేదని నాకనిపిస్తొంది.

    నా భావన నేను సరిగ్గా చెప్పలేకపోతే ఇంకా వివరించడానికి ప్రయత్నిస్తాను. కాని నాకున్నాయంటూ లేని ఉద్దేశ్యాలు అపాదించవద్దని మనవి.

  15. తిరుపతిలో ఫలానా అక్రమాలు జరుగుతున్నాయి, నివారించాలని గానీ, ప్రభుత్వ విధానాల వలన ఫలానా విధంగా తిరుపతి ఆచారాలకు నష్టం ఏర్పడుతున్నదని గానీ స్వామివారు చెబితే బాగుండేది.
    No, This has been raised so many times by him through various forums.

    గత 10 సంవత్సరాలుగా స్వామి వారు ప్రజలతో కలిసి విమర్శిస్తూనే ఉన్నారు. వెయ్యి కాళ్ళ మండపం కూల్చిన నాటి నుంచి ఎన్నో రకాలుగా తిరుపతిపై జరుగుతున్న ముప్పేట దాడిని నిలదీస్తున్నారు.
    7గురు జీయర్ల యాత్ర, వేంకటేశ శరనాగతి, పాద యాత్రలు ఇలా చాలా వాటి ద్వార ప్రచారం చేస్తున్నారు.
    కాని మీడియాలో అంతగా ప్రచారం లేదు వివిధ కారణాల వల్ల. ఇవాళ ఎందుకో ఇవాళ ఈ విషయాన్ని పని కట్టుకుని ప్రచురించారు.

    ప్రజల సెంటిమెంటు, భక్తి లతో కూడుకున్నది కావున తిరుపతి మార్పుల అంశాన్ని అంతే సున్నితంగా స్వామివారు డీల్ చేసి ఉంటే బాగుండేది.
    చేస్తున్నారు. ఈ చురక అంటించింది పెద్దలకే

    నేనిక్కడ ‘స్వామివారు’ అని పదే పదే అంటున్నది మీ సెంటిమెంట్లను గౌరవించడానికే తప్ప వ్యంగ్యంగా కాదని గమనించాలి.
    Really I appreciate you for this.

  16. కాని నాకున్నాయంటూ లేని ఉద్దేశ్యాలు అపాదించవద్దని మనవి.
    Just to add, I dont think I have done this. If you think I did, its probably a miscommunication and I take it back.

  17. అవును, నేను కూడా చాలా సార్లు చిన జీయరుగారి విమర్శలను విన్నాను. చదివాను. తిరుపతిలో పాటించవలసిన ధర్మాల విషయంలో చిన జీయరు గారే అంతిమ రిఫరెన్సు అని కూడా చదివాను.

  18. వెయ్యికాళ్ళ మంటపం కూల్చివేతని శైవ పీఠాధిపతులు సపోర్ట్ చెయ్యలేదా? తిరుమల తిరుపతి దేవస్థానంలో శైవులకి ప్రవేశం ఉంది. శైవ సన్యాసులు కూడా అక్కడికి వెళ్తారు. అయినా వైష్ణవులు, శైవులు ఆ విషయంలో ఎందుకు ఘర్షణ పడినట్టు?

  19. శైవ, వైష్ణవుల వైరుధ్యాల సంగతికేమో గానీ, వెయ్యికాళ్ళ మండపం కూల్చకుండా ఉంటే బాగని నాకూ తోస్తుంది. ప్రాచీన కట్టడాలను అదే స్ధలంలో కాపాడితే వాటికి విలువ తప్ప కూల్చి మరోచోట నిర్మిస్తే సగం విలువ కోల్పోయినట్లే కదా? కూల్చివేత వలన చారిత్రక విలువ పోతుంది కదా?

  20. విశేఖర్ గారు,
    స్నేహ పూర్వక చర్చకి ధన్యవాదాలు. మీకు అభ్యంతరం లేకపోతే “ఇంతకీ స్వామి వారు క్లబ్ కి ఎప్పుడు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు?” – ఈ వ్యాఖ్యని తొలగించగలరా.

  21. సరేనండి. ఆ వ్యాఖ్యని తొలగించి నేను చెప్పదలుచుకున్నది నేరుగా చెబుతాను.
    మీరు నమ్మండి, నమ్మకపోండి గానీ, ఇలా ఎవరైనా కోరితే తొలగించాలని పోస్టు రాసేటప్పుడే అనుకున్నాను.
    ఆ వ్యాఖ్య ఎవరినైనా బాధపెడుతుందా లేదా అన్న విషయంలో అనుమానంతో ఉన్నాను. ఆయన దేవుడు కాదు గనక పెద్దగా అభ్యంతరం రాకపోవచ్చని అంచనా వేశాను. చినజీయరు గారికి మతపరమైన నమ్మకాలలో ఏ స్ధానం ఉన్నదీ నాకు అవగాహన లేకపోవడం వల్ల ఒక కంక్లూజివ్ అంచనాకి రాలేకపోయాను. ఈ పోస్టు ద్వారా కొంతవరకూ అర్ధమయ్యింది గానీ, ఇంకా పూర్తిగా పల్స్ అందలేదు. మరిన్ని కోణాల్లో చర్చ జరిగి ఉంటే ఇంకొంత అవగాహన రావడానికి ఆస్కారం ఉండేది.

  22. ధన్యవాదాలు శేఖర్ గారు.
    చివరిగా ఒక్క మాట.
    ప్రభుత్వం తెస్తున్న మార్పులు అదనంగా వచ్చి చేరేవే తప్ప తిరుపతికి స్వతహాగా ప్రజల్లో ఉన్న గౌరవానికి భంగం కలిగించేవి కాదు.
    ఆందోళనైనా ఆవేదనైనా ఈ అదనపు/అనవసరమైన మార్పుల గురించే.
    ఈనాదు ఏ సామన్య భక్తుడిని అడిగినా తిరుపతిలో గత కొన్ని సంవత్సరాలలో జరుగుతున్న అక్రమాల గురించి చెప్తాడు.

    ఈ మార్పుల వల్లనే తిరుపతికి స్వతహాగా ప్రజల్లో ఉన్న గౌరవానికి భంగం కలుగుతుందని భయం.

    పైన మీరే “వెయ్యికాళ్ళ మండపం కూల్చకుండా ఉంటే బాగని నాకూ తోస్తుంది” అని చెప్పినట్టుగా ఎన్నో జరుగుతున్నాయండి.

  23. తీసేసి మంచిపని చేశారు శేఖర్‌ గారూ లేకపోతే మీమీద ఒక గూగుల్‌ గుంపునుండీ దాడి మొదలయ్యేది.
    అయినా ప్రస్తుతానికి మన గుంపుమీద దాడి సంస్కృతిమీద దాడి అంటూ ఒక అమాయకురాలిమీద దాడికోసం మనుషుల్ని సమీకరిస్తున్నాడు

  24. నేను సరిగా రాయలేక పోయాను, మీకు ఇంకొక విధంగా అర్థమైంది. నా ఉద్దేశం ఆయన వేద విద్య మాత్రమే కాకుండా ఇంగ్లిష్ సాహిత్యం, బెర్ట్రాండ్ రస్సెల్ పుస్తకాలు చదివాడని చెప్పాను. గత పాతిక సం|| నుంచి తిరుపతి ని ప్రభుత్వం, వ్యాపార దృక్పథం తో చూడటం మొదలైంది. వెంకటేశ్వర స్వామి కి వచ్చే జనాలను పర్యటక రంగం అభివృద్ది గా చూడాలను కోవటం, దాని చుట్టుపక్కల ఉన్న శ్రీకాళహస్తి, కాణిపాకం మొద|| వాటిని కలిపి చూడటం. రాహు కేతు పూజలకు ప్రచారాన్ని పెంచి డబ్బులు చేసుకోవటం మొదలు పెట్టారు. వీటన్నిటికి కారణం ప్రధానంగా రాజకీయ నాయకుల జ్యోక్యం తిరుపతిలో ఎక్కువైంది. టి.టి.డి. చైర్మన్ పదవి ఈ మధ్య కాలంలో ఒక మంత్రి పదవికున్న డిమాండ్ ఉంది.

    Temple treasure and Stephen Knapp in a book
    http://sayeverything.org/pipermail/sayeverything_sayeverything.org/2011-July/002049.html
    It would seem, for instance, that under a Temple Empowerment Act, about
    43,000 temples in Andhra Pradesh have come under government control and only
    18 per cent of the revenue of these temples have been returned for temple
    purposes, the remaining 82 per cent being used for purposes unstated.

    Apparently even the world famous Tirumala Tirupati Temple has not been
    spared. According to Knapp, the temple collects over Rs 3,100 crores every
    year and the State Government has not denied the charge that as much as 85
    per cent of this is transferred to the State Exchequer, much of which goes
    to causes that are not connected with the Hindu community.

  25. జీయర్ గారు వచ్చి ఉపన్యాసం ఇవ్వాలంటే, ఆ గుడి ఎంత పేరు పొందినది , అక్కడికి ఎంత ఎక్కువగా భక్తులు వచ్చేది లాంటి సమాచారం కన్నా, స్వామి వార్కి దక్షిణ సమర్పించుకోడానికి ఆ గుడికి నిధులు ఎంత ‘ఎక్కువగా’ ఉన్నాయి అన్నది ముఖ్యం. మరి సారు గుడి కి వెళ్తున్నారా, క్లబ్బు కి వెళ్తున్నారా స్పీచి ఇవ్వడానికి ? :)

    ఏదేమైనా ఆయన ఎం మాట్లాడి అయినా సమర్ధించు కోగలరు.

  26. ఔనా మౌళి గారూ?
    చిన జీయర్ గారు నిధుల్ని బట్టి గుడికి వెళ్తుంటారా?
    సకాలంలో కొత్త (నాకు కొత్త) విషయం చెప్పారు.

  27. కాస్త సోదాహరణంగా చెప్తే బాగుంటుంది.
    నాకు తెలిసి పిట్టలవాని పాలెం, బిర్సపేట లాంటి మారుమూల గ్రామాల నుంచి ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. blind schools, tribal schools కూడా remote areasలో ఉన్నవే.

వ్యాఖ్యానించండి