లిబియా ఆయిల్ ను వశం చేసుకున్న ఊపుతో అమెరికా, యూరప్ లు సిరియా లో అల్లర్లు సృష్టిస్తూ దాన్ని కూడా వశం చేసుకోవాలని చూస్తున్నాయి. కాని రష్యా, చైనాలు వాటికి అడ్డుపడుతున్నాయి. సిరియా లో జోక్యం చేసుకోవడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఐక్యరాజ్యసమితి భద్రతా సమితిలో రష్యా, చైనాలు తమ వీటో పవర్ తో ఆ ప్రయత్నాలను వమ్ము చేస్తున్నాయి.
