ఇరవై ఏడేళ్ల క్రితం జరిగిన భోపాల్ విష వాయువు లీక్ దుర్ఘటనకు సంబంధించిన బాధితులకు పూర్తి న్యాయం చేకూరాలని కోరుతూ దుర్ఘటన దినం డిసెంబరు 3 తేదీన బాధితులు చేసిన ఆందోళనపై పోలీసులు విరుచుకుపడ్డారు. బాధితులకు న్యాయమైతే దక్కలేదు గానీ తమకు దక్కని న్యాయం కోసం ఆందోళన చేసే హక్కును కూడా లాక్కోవాలని ప్రయత్నించడం దారుణమంటూ సంఘటనను అనేకమంది ఖండించారు.
1984 డిసెంబరు 3 తేదీన భోపాల్ నగరంలో ఉన్న యూనియన్ కార్భైడ్ పురుగు మందుల ఫ్యాక్టరీ పెద్ద ఎత్తున విష వాయువును విడుదల చేయడంతో ఐదు వేలకు మందికి పైగా చనిపోయారు. ఐదు వేలు చనిపోయారని ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా, ఆ సంఖ్య వాస్తవానికి పదిహేను వేలకు పైగా ఉంటుందని వివిధ సంస్ధలు వెల్లడించాయి. చనిపోయినవారు చనిపోగా బతికి ఉన్నవారు అనేక రోగాలతో తీసుకుంటూ బతుకుతున్నారు. కొత్తగా పుట్టిన పిల్లలు సైతం వివిధ లోపాలతో పుట్టడంతో అనేక జబ్బులతో వారు తీసుకుంటున్నారు. వారందరికీ న్యాయం చెయ్యాలని భోపాల్ గ్యాస్ లీక్ బాధితులు ఇంకా డిమాండ్ చేయవలసిన పరిస్ధితి కొనసాగుతోంది.
ఈ నేపధ్యంలో శనివారం భోపాల్ గ్యాస్ లీక్ బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్య ప్రదేశ్ లో పలు చోట్ల వివిధ సంస్ధలు ఆందోళన చేపట్టాయి. ఆందోళనలో భాగంగా రైల్ రొకో చేయాలని నిర్ణయించారు. భోపాల్ నగరంలో నిరవధిక సమ్మెకు పిలుపులిచ్చారని ‘ది హిందూ’ పత్రిక రిపోర్ట్ చేసింది. ఈ సందర్భంగా పోలీసులు బాధితులపై, ఆందోళనకారులపై లాఠీ ఛార్జీ చేయడంతో ఆందోళన హింసాత్మకంగా మారింది.
భోపాల్ గుండా వెళ్లే రైళ్ళన్నింటినీ ఆందోళనకారులు ఆపుతూ రైల్ రోకో చెపట్టారు. పాత భోపాల్ లోని బర్ఖేదీ ప్రాంతంలో కొద్ది మంది సంఘ వ్యతిరేక శక్తులు పోలీసులపై రాళ్లు రువ్వారనీ దానితో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారనీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే బాధితులు పోలీసులు మహిళలపై లాఠీ ఛార్జీ చేశాకే ఆగ్రహంతో యువకులు రాళ్లు రువ్వారని ఆందోళన సంస్ధలు తెలిపాయి. “మహిళా ఆందోళనకారులు కొంతమంది ఒక దిష్టి బొమ్మను దగ్ధం చేస్తుండగా వారిపైన పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. పురుషులు ఆగ్రహంతో వారిపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో కొంతమందికి గాయాలయ్యాయి. పోలీసుల వాహనాలకు నిప్పంటించారు” అని ‘భోపాల్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్’ సంస్ధ ప్రతినిధి రచనా ధింగ్రా తెలిపిందని ‘ది హిందూ’ పేర్కొంది.
ఆందోళనను కవర్ చేస్తున్న ఈ టివి కి చెందిన వాహనం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కొద్ది మంది జర్నలిస్టులపైన కూడా ఆందోళనకారులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ వాళ్ళు చనిపోయినవారి సంఖ్యను, బాధితుల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారనీ, బాధితులందరికీ న్యాయం చేయాలనీ విషవాయువు పీడితులు డిమాండ్ చేస్తున్నారు. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ని ఆ తర్వాత అమెరికాకే చెందిన మరొక కంపెనీ డౌ కెమికల్స్ కంపెనీ కొనుగోలు చేసింది. భోపాల్ బాధితులకు న్యాయం చెయ్యని డౌ కెమికల్స్ కంపెనీకి లండన్ ప్రభుత్వం రానున్న ఒలింపిక్స్ కి సంబంధించిన కాంట్రాక్టును ఇచ్చిందనీ, ఇది భోపాల్ విషవాయువు బాధితులను పరిహసించడమేననీ అంతర్జాతీయ మానవహక్కుల సంస్ధ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ ఓ ప్రకటనలో ఖండించింది.
కేవలం దిష్టిబొమ్మలను తగలబెట్టినందుకో, రాళ్ళు రువ్వినందుకు పోలిసులు విచక్షణా రహితంగా ప్రజలను కొడితే………. మరి, తమ “జీవితాలనే విషపూరితం” చేసిన కంపెనీకి వత్తాసు పలుకుతున్న రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను ప్రజలు దేనిపెట్టి కొడితే బుద్ధి వస్తుంది? ఎప్పుడో 27 సంవత్సరాల క్రిందట ప్రజలకి తగిలిన గాయాన్ని ఇప్పటికీ తగ్గించలేని ఈ దిక్కుమాలిన రాజకీయ నాయకులెందుకూ, ప్రభుత్వాలెందుకూ…..ఎవరికోసం…?? మన ప్రభుత్వానికే మన ప్రజల మీద గౌరవం లేనప్పుడు, లండన్ ప్రభుత్వానికి ఏముంటుంది???
బాగా చెప్పారు.
govt, probably cong govt released UCC and Dow from liability.
http://www.thehindu.com/news/national/article480946.ece read further at this link.