శ్రీకాంత్ గారూ, మీ బ్లాగ్ లో నన్ను ఉద్దేశిస్తూ మంచి ప్రశ్న వేశారు. (ఆ పోస్టును ఇక్కడ చూడండి)
సిరియాలో తిరుగుబాటు పేరుతో అక్కడి తిరుగుబాటుదారులు చేస్తున్నది కేవలం అమెరికా తదితర పశ్చిమ దేశాల ప్రయోజనాల కోసమే. వారు టర్కీ, ఉత్తర లెబనాన్ లలో ఫ్రాన్సు, అమెరికా, బ్రిటన్ గూఢచారుల వద్ద శిక్షణ పొంది సిరియాలో ప్రవేశించి ప్రజలపై కాల్పులు జరుపుతూ ఆ నేరాల్ని సిరియా అధ్యక్షుడు, సైన్యం పైన మోపుతున్నారు. పశ్చిమ దేశాల పత్రికలు కూడా వారికి పూర్తిగా సహకరిస్తూ సిరియా ప్రభుత్వ సైన్యాన్ని, అధ్యక్షుడు బషర్ ని రాక్షసీకరించడానికి యధా శక్తి ప్రయత్నిస్తున్నాయి.
మావోయిస్టు పార్టీ విషయానికి వస్తే అది చేస్తున్నది సాయుధ అల్లర్లు కాదు. కనీసం ప్రభుత్వాలు కూడా మావోయిస్టులు చేస్తున్నది సాయుధ అల్లర్లని గానీ, విదేశాల మద్దతుతో చేస్తోందని గానీ ఎన్నడూ సీరియస్ గా ఆరోపించలేదు. (వాచాలత్వంతో అడ్డదిడ్డంగా మాట్లాడే నాయకుల వ్యాఖ్యలు ఇక్కడ మినహాయించాలి. మంత్రులు అసెంబ్లీలోనో, పార్లమెంటులోనో, లేదా ఏదైనా అధ్యయన సభలోనో ఒక స్పష్టతతో చేసే వ్యాఖ్యలే ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి) మావోయిస్టులకి సామాజిక, రాజకీయార్ధిక వ్యవస్ధ పైన స్పష్టమైన అవగాహన ఉంది. ఆ అవగాహన మేరకు పార్టీని స్ధాపించి, ఒక సిద్ధాంతం ప్రాతిపదికన సాయుధ పోరాటం చేస్తున్నారు
మావోయిస్టులు చేస్తున్న వ్యక్తిగత నిర్మూలన ఖండనార్హం. నాకు తెలిసినంతవరకూ మౌలిక కమ్యూనిస్టు సిద్ధాంతాలలో గానీ, రష్యా, చైనా విప్లవాలలో గానీ ఈ వ్యక్తిగత నిర్మూలనకు మద్దతు లేదు. పైగా తీవ్రంగా ఖండించారు కూడా.
ఇతరత్రా వారు చెప్పే సిద్ధాంతాలన్నీ కమ్యూనిస్టు సూత్రాలకు అనుగుణమైనవే కాని, చంపడం, పేల్చడం మినహా, మావోయిస్టులు ఇతరత్రా ప్రజలను సమీకరిస్తున్న ఉదాహరణలు తక్కువ. అందుకే కిషన్ జీ చనిపోయినా ఆయనను స్వంతం చేసుకోవడానికి ప్రజలెవరూ ముందుకు రాలేదు. కొద్ది నెలల క్రితం న్యూ డెమొక్రసీ పార్టీకి చెందిన దళ నాయకుడిని ఒకరిని ఇలాగే పోలీసులు కాల్చి చంపారు. ఆ వార్త తెలుసుకుని చుట్టుపక్కల ఊళ్ళలో జనం పెద్ద ఎత్తున వచ్చి పోలీసుల వద్దనుండి శవాన్ని లాక్కొని పోయి తమ వద్ద ఉంచుకున్నారు. పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చినా వారికి ఇవ్వలేదు. న్యూడెమొక్రసీ పార్టీ నాయకులే స్వయంగా వచ్చి ప్రజలకు నచ్చజెప్పి, చట్టపరమైన బాధ్యతలు కొన్ని నిర్వహించడానికి శవాన్ని కొన్ని గంటలు పోలీసులకు ఇవ్వాలని ప్రజలను అనునయించి శవాన్ని పోలీసులౌ అప్పజెప్పడానికి సాయపడ్డారు. ఈ ఉదంతం అంతా అప్పట్లో టి.వీ ఛానెళ్ళు ప్రసారం చేశాయి. ప్రజలు శవాన్ని పోలీసుల వద్దనుండి లాక్కోని తీసుకెళ్ళడం అంతా చూపించారు.
ప్రజల కోసం పని చేస్తున్న మావోయిస్టులు బూటకపు ఎన్‌కౌంటర్లలో గానీ, నిజమైన ఎన్‌కౌంటర్లలో గానీ చనిపోయినపుడు ప్రజలు ఎన్నడూ ఎలా స్పందించిన దాఖలాలు లేవు. కేవలం పౌర హక్కుల సంస్ధల నాయకులు, విరసం నాయకులు, బంధువులు తప్ప ప్రజలు స్పందించిన దాఖలాలు లేవు. కావున మావోయిస్టుల చర్యలు ప్రజామోదంతో చేస్తున్నవి కావని అర్ధం అవుతుంది.
మావోయిస్టుల ‘వ్యక్తిగత నిర్మూలన’ సిద్ధాంతం ఆ పార్టీని ఒంటరిని చేస్తోంది. చివరికి ప్రజలనుండి గూడా దూరం చేస్తోంది. ఈ అంశాన్నిగతంలో చాలామంది చెప్పారు. మావోయిస్టులు కూడా ఈ లోపాన్ని గుర్తించినట్లు అనేక వార్తలు వచ్చిన సరిచేసుకున్న దాఖలాలు మాత్రం లేవు.
ఇక్కడ వ్యక్తిగత నిర్మూలన చేస్తున్నది ఎవరు? 1997లో 297 మంది నక్సలైట్లు ఎన్‌కౌంటర్లలో చనిపోతే అదే ఏడాది కేవలం 54 మంది పోలీసులు చనిపోయారు. వ్యక్తిగత నిర్మూలనని నమ్మేది పాలకవర్గమే కదా.
http://www.dnaindia.com/india/report_bangalore-police-have-proof-isi-funds-maoists_1422918
http://www.deccanherald.com/content/88381/isi-had-instructed-chhota-shakeel.html
ప్రవీణ్, ఎంతమంది అనేది కొద్ది సేపు పక్కన బెడితే మావోయిస్టులు కూడా పోలీసుల్ని చంపుతున్నారు కదా. పోలీసుల మీద దాడి చేయడానికి సిద్ధపడితే, అది సాయుధ పోరాటంగా భావిస్తే ఇక పోలీసుల కూంబింగ్, అరెస్టులు, హింసలు వీటిని ప్రశ్నించే హక్కు మావోయిస్టులకు ఉండదు కదా. ఎందుకంటే సాయుధ పోరాటంలో చంపడం ఉంటుంది, చావడం ఉంటుంది. అందుకు సిద్దపడే ఎవరైనా అందులోకి దూకుతారు. యుద్ధం అన్నది ప్రారంభం అయ్యాక ఇరువైపులా లాభ నష్టాలు ఉంటాయి. నష్టం చేస్తున్నారన్న ఆరోపణలకు తావే ఉండదు.
అలా కాక ప్రజలకోసం మాత్రమే ఉద్యమిస్తున్నాం అని ప్రజా సంఘాలు చెప్పినట్లయితే, అందులో ఉద్యమమే ఉండాలి తప్ప చంపడాలు ఉండ కూడదు. పోలీసులను చట్టాలు పాటించాలి అని అడిగేటప్పుడు ప్రజలు కూడా చట్టాలు పాటిస్తున్నారు అని చెప్పగల స్ధితిలో ఉండాలి. అలాంటప్పుడే పోలీసు హింసను ప్రశ్నించగల అవకాశం ఇవతలి వారికి ఉంటుంది.
రాఘవ్ గారూ, మీరు ఇచ్చిన లింక్ లు చదివాను. ఇటువంటి ఆరోపణలు గతంలోనూ పోలీసులనుండి వచ్చాయి. కాని ప్రభుత్వం మాత్రం ఐ.ఎస్.ఐ నుండి, మాఫియా నుండీ మావోయిస్టులకు నిధులు అందుతున్న ఆరోపణలకు ఎటువంటి రుజువులు లేవని పార్లమెంటులో ప్రకటించింది. ఈ ఆరోపణ కూడా అటువంటిదే.
మావోయిస్టులు నిజంగా ఐ.ఎస్.ఐ, మాఫియా ల నుండి నిధులు తెచ్చుకుంటె అది సమర్ధనీయం కాదు. కాని ఇంతవరకూ వారు అటువంటి పనులకు పూనుకోలేదు. అది జరిగితే ప్రభుత్వానికి మావోయిస్టులకు వ్యతిరేకంగా మంచి ఆయుధం దొరికినట్లే లెఖ్క. ఆ ఆయుధాన్ని ప్రభుత్వాలు అంత తేలిగ్గా వదిలిపెట్టవు.
సల్వాజుడుం లాంటి కిరాయి సైనికులని ఉపయోగించడం పోలీసులు తాము పాటించాల్సిన చట్టాలకి వ్యతిరేకం కాబట్టే కదా సల్వాజుడుం చట్ట వ్యతిరేకం అని కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఇందులో మావోయిస్టుల తప్పు లేదనే కదా దాని అర్థం. ఒక గ్రామంలో ఒక మహిళ చేతబడి చేస్తోంది అనే అనుమానంతో గ్రామస్తులందరూ ఆమెని నగ్నంగా ఊరేగించిన ఘటనలు ఉన్నాయి. ప్రజలకి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతిస్తే అలాంటివే జరుగుతాయి కాబట్టే కోర్ట్ ప్రజలకి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అనుమతి ఇవ్వకూడదు అని చెప్పింది. ఈ విషయం పోలీసులకి తెలియదనుకోవాలా? ISI ఏజెంట్ దొరికితే జైల్లో పెడతారు కానీ బూటకపు ఎంకౌంటర్‌లో చంపరు. ఎందుకంటే ISI ఏజెంట్ల వల్ల కేవలం మత ఘర్షణలు జరుగుతాయి కానీ పాలక వర్గ పార్టీలు అధికారం పోగొట్టుకోవు. అదే విప్లవకారులైతే పాలక వర్గాన్ని పడగొట్టేస్తారు. రష్యాలో అదే జరిగింది కాబట్టి ఇండియాలో అలా జరగకూడదంటే విప్లవకారులని దొరికిన చోటే అరెస్ట్ చేసే అవకాశమున్నా కాల్చి చంపెయ్యాలి. ఇదీ పాలక వర్గంవాళ్ళ పాలిసీ. 1917 ముందు ప్రపంచంలో ఒక సోషలిస్ట్ రాజ్యం ఏర్పడుతుందని ఎవరూ ఊహించలేదు కాబట్టి అప్పట్లో పాలక వర్గాలు పోలీస్ ఫోర్స్‌ని ఇంతగా నమ్ముకోలేదు, ఇప్పుడు ఆ భయం ఎక్కువ ఉంది కాబట్టి బూటకపు ఎంకౌంటర్లు లాంటివి జరుగుతున్నాయి. భయం లేకపోతే సద్దాం హుస్సేన్‌నైనా కాంగరూ కోర్ట్‌లో బూటకపు విచారణతో ఉరితియ్యకుండా విడిచిపెట్టగలరు.
Read this link: http://stalin-mao.net.in/83172091
ప్రస్తుతం మావోయిస్టు పార్టీపై నిషేధం అమలులో వుంది. మీరన్న న్యూడెమోక్రసీ పై నిషేదం లేదు. అది పార్లమెంటరీ పంథాలో వుంది. దాని వలన పాలక వర్గానికెటువంటి నష్టం లేదు. అందువల్లనే ప్రజలు తమకు ఆ కార్యకర్త పట్ల వున్న అభిమానాన్ని చాటుకున్నారు. నిర్బంధం నిషేధం వున్న కూడా ఎంతో మంది ప్రజలు తరలి వచ్చి తమ నాయకులను సందర్శిస్తున్నారు. ఆ చుట్టు పక్కల పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించి ప్రజలను వెళ్ళకుండా అడ్డుకుంటున్నది ప్రభుత్వాలే. శవాన్ని చూసి కూడా భయపడుతుందీ పాలక వర్గం. అందుకే ఎవరికీ కనబడకుండా రహస్యంగా హైదరాబదు నుండి తరలించారు. వారి లైన్ గూర్చి ఇలా బ్లాగులలో కంటే ముఖా ముఖే చర్చించుకోవడం మంచిది. అంతర్జాలమంతా నిఘా అల్లుకొని వుంటోంది.
కొంతవరకు నెట్ లోనే వారి సిద్ధాంత పత్రాలు దొరుకుతున్నాయి వీలైతే చదవండి…మీడియా వార్తలుపైనే ఆధారపడొద్దు. అరుంధతీ రాయ్ రాసిన పుస్తకాలు కూడా మంచి అవగాహనిస్తున్నాయి. అలాగే ఫ్రీ లాన్స్ జర్నలిస్టు రాహుల్ పండిట్ రాసిన హలో బస్తర్ కూడా. http://www.flipkart.com లో దొరుకుతున్నాయి.