అమెరికా పాకిస్ధాన్ ల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడుతున్న ఆఫ్-పాక్ సరిహద్దు -ఫొటోలు


ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాల మధ్య సరిహద్దు, ముఖ్యంగా డ్యురాండ్ లైన్ గా భావించే సరిహద్దు సరిగ్గా గుర్తించలేదు. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లు పరస్పరం అంగీకరించిన సరిహద్దు రేఖ ఇంకా లేకపోవడమే దానికి కారణం. సరిహద్దులో ఉన్న ప్రాంతాలు ఇరు దేశాల్లో ఏ దేశానికి చెందినవన్న దానిపైన ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల సమస్య పరిష్కారానికి నోచుకోక అలానే పడి ఉంది. ఈ ప్రాంతాలు అమెరికాను ముప్పు తిప్పలు పెడుతున్న పష్తూన్ తెగకు చెందిన మిలిటెంట్లకు గట్టి స్ధావరాలుగా ఉండడంతో పాక్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది. మిలిటెంట్లను ఏరి వేస్తున్నామని చెబుతూ అమెరికా బలగాలు చేసే దాడుల్లో అనేకమంది గిరిజనులు ప్రతిరోజూ చనిపోతున్నా అమెరికా పట్టించుకోవడం లేదు. దానితో సరిహద్దు ప్రాంతాల ప్రజలు అమెరికా పట్ల ద్వేషంతో ఉంటారు. ఈ ప్రాంతాలను పాకిస్ధాన్ కేంద్ర ప్రభుత్వం నేరుగా పాలిస్తుంది.

ఈ ఫొటోలను రాయిటర్స్ వార్తా సంస్ధ అందించింది.

వ్యాఖ్యానించండి