ఈజిప్టు నియంత ముబారక్ గద్దె దిగి పది నెలల తర్వాత అక్కడి సైనిక ప్రభుత్వం ఈజిప్టు చట్ట సభలకు ఎన్నికలు ఈరోజు నిర్వహించింది. నిన్నటి వరకూ అక్కడ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించారు. ఉద్యమించిన ప్రజలపై సైనిక ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కొన్ని వందలమందిని కాల్చి చంపింది. కొన్ని వేలమందిని అరెస్టు చేసి జైళ్లలో కుక్కింది. ఉన్న ప్రజాస్వామ్య హక్కులన్ని హరించివేసి ప్రశాంతంగా మొట్టమొదటి ప్రజాస్వామిక ఎన్నికలను నిర్వహించింది.
జనవరి ఉద్యమం డిమాండ్ చేసినట్లుగా ఎమర్జెన్సీ చట్టాన్ని సైనిక ప్రభుత్వం ఇంతవరకూ ఎత్తివేయలేదు. తాత్కాలిక పౌర ప్రభుత్వానికి అధికారం ఇవ్వమంటే సైన్యమే అధికారం చేపట్టింది. నిర్బంధ చట్టాలన్నింటిని అలానే ఉంచి ముబారక్ పాలనను తోసిరాజంది. నిర్బంధం మధ్య జరిగిన ఎన్నికల్లో సైన్యానికీ, తద్వారా అమెరికాకి లోబడి ఉండే ప్రభుత్వమే ఏర్పడుతుందని విశ్లేషకులు ఏకాభిప్రాయంతో ఉన్నారు.
-కార్టూనిస్టు: కార్లోస్ లాతుఫ్, బ్రెజిల్
–