తమ శరీరాలనే కాన్వాస్ లు గా మలుచుకుని ప్రదర్శించే కళ బాడీ ఆర్ట్. ఈ బాడి ఆర్ట్ కి సంబంధించి నవంబరు 20 తేదీన వెనిజులా లోని కారకాస్ నగరంలో ప్రపంచ స్ధాయి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు 18 దేశాలనుండి 50 కి పైగా కళాకారులు పాల్గొన్నారు. బాడీ ఆర్ట్ లో శరీరాలపై పెయింట్లు వేసుకోవడం, పచ్చ బట్లు పొడిపొంచుకోవడం దగ్గర్నుండి కేవలం ఆభరణాలు ధరించడం వరకూ ఉంటుంది. వివిధ ఊహా చిత్రాలనుండీ తమ తమ దేశీయ సంస్కృతిని ప్రతిబింబించే బాడీ ఆర్ట్ ల వరకూ ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఇండియాలో సైతం గాంధీ వేషధారణతో శరీరం నిండా సిల్వర్ రంగు పెయింట్ పూసుకుని కదలకుండా నిలబడి చందాల సేకరణకు పూనుకునే కళాకారులు ఉన్నారు. అది కూడా బాడీ ఆర్ట్ గా చెప్పుకోవాల్సిందే.
ఈ చిత్రాల్లో కళను మాత్రమే చూడగలరని విజ్ఞప్తి. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో గల కళా వైవిధ్యాన్ని సందర్శించడమే ఈ పోస్టు లక్ష్యం.
–
–










