ఈజిప్టులో మళ్ళీ ఉద్యమం, పోలీసులతో ఆందోళనకారుల ఘర్షణలు -ఫొటోలు


ప్రజాస్వామిక ఈజిప్టు కోసం తాము ఉద్యమించినప్పటికీ సైన్యం చొరబడి ఆధికారాన్ని హస్తగతం చేసుకుందని ఈజిప్టు ప్రజలు భావిస్తున్నారు. సైన్యం వెంటనే తప్పుకుని ఎన్నికలు జరిపి పౌర ప్రభుత్వానికి అధికారం అప్పజెప్పాలని వారు కోరుతున్నారు. అధికారాన్ని చేతిలో ఉంచుకున్న సైనిక ప్రభుత్వం ప్రజాస్వామిక సంస్కరణలవైపుగా చర్యలు తీసుకోవడం లేదనీ, తీసుకున్నా అత్యంత నెమ్మదిగా చర్యలు తీసుకుంటున్నదనీ ప్రజలు భావిస్తున్నారు. ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు చల్లారకపోవడంతో ఎన్జీఓ సంస్ధలకు మళ్ళీ ఉద్యమాలకు దిగక తప్పలేదు. క్రమంగా ఎన్జీఓ సంస్ధల చేతుల్లోనుండి ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్ళడానికి తగిన శక్తులు ఈజిప్టులో కొరవడడం లోపంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలను రాయిటర్స్ సంస్ధ అందించగా ‘ది గార్డియన్’ ప్రచురించింది.

వ్యాఖ్యానించండి