చైనా, అమెరికాల వాణిజ్య అసమతూకం -కార్టూన్


పశ్చిమ దేశాలు, చైనా పట్ల గుర్తుగా ఉండే ముఖ్యమైన అంశాల్లో వాణిజ్య మిగులు ఒకటి. ప్రతి నెలా చైనాతో యూరప్ దేశాలకు గానీ, అమెరికాకి గానీ వాణిజ్య మిగులు ఉండవలసిందే. అమెరికాతో చైనాకు గల వాణిజ్య మిగులు గురించి చెప్పనవసరం లేదు. ప్రతి సంవత్సరం కనీసం రెండొందల బిలియన్ డాలర్లవరకూ వాణిజ్య మిగులు చైనాకు ఉంటోంది. ఇది అమెరికాకి అస్సలు నచ్చడం లేదు. చైనా ఉద్దేశ్యపూర్వకంగా తన కరెన్సీ యువాన్ విలువను తక్కువగా ఉంచడం వలన చైనా ఎగుమతులు చౌకగా మారి అంతర్జాతీయ మార్కెట్ లో పెద్ద ఎత్తున డిమాండ్ సంపాదిస్తోందని యూరప్, అమెరికాలు నిందిస్తున్నాయి. ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులతో సహా అదే పనిగా యువాన్ విలువ పెరగడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.

ప్రతి నెలా ఉండే వాణిజ్య మిగులు చైనా పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్య నిల్వలను కూడ బెట్టడానికి ఉపకరిస్తోంది. ఆ నిల్వలను ఉపయోగించుకుంటూ యువాన్ విలువను మార్కెట్ విలువ కంటె తక్కువ ఉండేలా చైనా చూస్తున్నదని ఆరోపిస్తూ చైనా “కరెన్సీ మానిపులేటర్’ అని అనధికారికంగా పిలుస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ కూడా చైనాను ‘కరెన్సీ మానిపులేటర్’ గా ముద్ర వేసి చైనా దిగుమతులపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్న ఒబామా వాయిదా వేయిస్తున్నాడు చైనా ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే అది అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీయగలదని చైనా బెదిరిస్తోంది. దాంతో ఏ చర్యా తీసుకోలేని పరిస్ధితుల్లో యూరప్, అమెరికాలు ఉన్నాయి. అసలు తమ స్వంత సమస్యలకు చైనాలో కారణాలు వెతకడం ఏమిటని చైనా ప్రశ్నిస్తోంది.

China US trade imbalances

వ్యాఖ్యానించండి