కార్పొరేట్ కంపెనీలన్నీ బెయిలౌట్లు మెక్కినప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడానికి సుతరామూ ఇస్టపడడం లేదు. ఆర్ధిక వ్యవస్ధలో ప్రభుత్వ జోక్యాన్ని విమర్శించే కార్పొరేట్లు ఆ ప్రభుత్వం ఇచ్చిన బెయిలౌట్లు తేరగా మెక్కి బ్రేవ్ మని త్రేన్చి తిరిగి ఉద్యోగాల రూపంలో చెల్లించడానికి నిరాకరిస్తున్నాయి. ఫలితంగా ఆర్ధిక సంక్షోభం నుండి అమెరికా సాధించిన రికవరీ ‘జాబ్ లెస్ రికవరీ’ గా చరిత్రలో మొదటిసారి చరిత్ర పుటలకు ఎక్కనుంది.
–
