ముస్లింల దైవ ప్రార్ధనలో క్రమశిక్షణ ఉంటుంది -బక్రీద్ ఫొటోలు


ముస్లిం మతస్ధులు దైవ ప్రార్ధన (నమాజు) చేసేటప్పుడు చాలా క్రమ శిక్షణ కనిపిస్తుంది. మిగత మత ప్రార్ధనలలో ఇది పెద్దగా కనిపించదనుకుంటా. హిందూ పుణ్య క్షేత్రాల వద్ద కోలాహలం కనిపిస్తుంది. తిరుపతి దగ్గర్నుండి ఏ గుడి తీసుకున్నా అంతా కోలాహలం. కానుకలు కూడా కోలాహలమే. ప్రసాదం దగ్గర కూడా. బౌద్ధ మత ప్రార్ధనలు ఎలా ఉంటాయో ఎరుగం. శిక్కుల గురుద్వారాల్లో కూడా కోలాహలం కనిపిస్తుంది. అయితే గురుద్వారాల్లో హిందూ దేవాలయాల్లో కనిపించేటంత కోలాహలం ఉండదు. బహుశా జైన మత ప్రార్ధనలు, బౌద్ధ మత ప్రార్ధనలు ఒకేలా ఉంటాయేమో? క్రిస్టియన్ మత ప్రార్ధనల్లో విదేశాల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ, ఇండియాలో మాత్రం కోలాహలంగానే ఉంటుంది. పెద్ద, పెద్ద క్యాంపులతో వాక్య బోధన చేస్తుంటారు. ముస్లిం ప్రార్ధనల్లో గంటకొట్టినట్లు ఒకేసారి లేవడం, కూర్చోవడం, మోకరిల్లడం… చూడబుద్ధేస్తుంది. ఎందుకంటే అదొక సామూహిక నాట్య ప్రదర్శనను పోలి ఉంటుంది.

14 thoughts on “ముస్లింల దైవ ప్రార్ధనలో క్రమశిక్షణ ఉంటుంది -బక్రీద్ ఫొటోలు

  1. ముస్లిం మతస్ధులు దైవ ప్రార్ధన (నమాజు) చేసేటప్పుడు చాలా క్రమ శిక్షణ కనిపిస్తుంది. మిగత మత ప్రార్ధనలలో ఇది పెద్దగా కనిపించదనుకుంటా.
    హిందువుల ప్రార్థనలో ప్రార్థించడం మాత్రమే ముఖ్యం అది ఎలా ఐనా సరే,(Freestyle) ఎవ్వరికీ అభ్యంతరాలుండవు, మనసులో భగవంతుని స్మరించడమే ప్రధానం. ఒక్క మాటలో చెప్పాలి అంటే, హిందువుల ప్రార్థనలో క్రమశిక్షణ ఉండదు అనేకన్నా క్రమశిక్షణ అసలు అవసరం లేదు అనేది సరైన మాట.

  2. అవును. మీరన్నది అక్షరాలా నిజం. హిందువులకు క్రమశిక్షణ అస్సలు అవసరం లేదు.
    మనుషులంతా ఒక్కటేననీ, కుల, వర్ణ విచక్షణ ఉండకూడదనీ… లాంటి నియమాలు ఏవీ అవసరం లేదు.
    పైగా క్రమశిక్షణ లేనితనానికి గౌరవం ఇచ్చి కూర్చోబెడుతుంది.
    కింది కులాలు ఎన్ని ఎక్కువ ఉంటే పై కులపోడు అంత గొప్పవాడన్నమాట. అంత ఎక్కువమందిని గౌరవం లేకుండా చూడొచ్చన్నమాట.
    ప్రపంచం అంతా డబ్బూ తేడాలతో తీసుకుంటుంటే, ఒక్క భారత దేశమే క్రమశిక్షణ అవసరం లేని హిందూ మతం వల్ల కులాల కుమ్ములాటల్లో కూడా తీసుకుంటోందన్నమాట.
    నాలుగుకాళ్ల జంతువుల్ని గౌరీమాత అనో, గో మాత అనో, కూర్మావతారం అనో నెత్తిన పెట్టుకోవచ్చు గానీ, తోటి మనిషి కింది కులపోడైతే మాత్రం ఛీ, ధూ అని దూరం పెట్టోచ్చన్నమాట.

  3. what a coincedence!!

    ఇవ్వాళా ఒక మిత్రునితో ఇదే విషయమై అర్ధ గ౦ట చర్చ జరిగి౦ది. తన అభిప్రాయం ప్రకారం మతం వు౦డాలి(religion, spirituality )..కులం మాత్రం నాన్-సెన్స్ అని. బావుంది కాని, అ౦దరికీ నచ్చాలి కదా

  4. sir meru ante naaku chala gouravam pratidi ento alochinchi rastaru………….kani itarula matan kuda gouravinchali kada……..nenu hinduvu ga puttinanduku garvapadutunnanu……………….hindu matam lo konni lopalu vunna sare…..

  5. వసంత్ గారు, మీ గౌరవానికి ధన్యవాదాలు.
    నాకైతే ఏ మతం పైనా నమ్మకం లేదు. నేను మతం జోలికి పోకుండా ఆయా మతస్ధుల ప్రార్ధనలు చూడ్డానికి ఎలా కనిపిస్తుందీ అన్నదే రాశాను.
    ఎవర్నీ ఎక్కువగానీ తక్కువగానీ చూస్తూ అలా రాయలేదు. బైటినుండి చూస్తూ, మతంతో సంబంధం లేని వ్యక్తిగా ఈ పోస్టు రాశాను.
    నాకంటూ ఒక మతం ఉన్నట్లయితే, స్వ, పర మతాల సమస్య వస్తుంది. నాకా సమస్య లేదు.
    పుట్టడానికి హిందూ మతంలో పుట్టాను. కింది కులంలో పుట్టినందుకు చిన్నప్పటినుండీ ఇప్పటివరకూ అవమానాలు భరించాను.
    నేను ఎదుర్కొన్న అవమానాల నేపధ్యంలో హిందూ మతాన్ని నేనెలా గౌరవించగలను?
    మత సిద్ధాంతాలు అలా చెప్పలేదు. మధ్యలో చేర్చారు అంటారు. అయితే మధ్యలో చేర్చినవన్నీ ఇప్పటికయినా తొలగించి మంచి మతంగా మార్చగలిగితే గౌరవం ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకుంటుంది?
    మతం ఏది చెప్పినా, చెప్పకపోయినా… ఏది ఆచరిస్తున్నారన్నదే ముఖ్యం.
    హిందూ మత ఆచరణలో ఇన్ని కోట్లమందిని ఆచార వ్యవహారాలకు దూరంగా పెట్టి మీరూ మా మతం వారే అంటే గౌరవం ఎలా వస్తుంది చెప్పండి?
    మనుషులుగా నేను అందర్నీ గౌరవిస్తాను. హిందువుగా ఎవర్నీ గౌరవించలేను. హిందువుల దైవభక్తిని గౌరవిస్తాను. కాని వారి సామాజిక ఆచారాలను గౌరవించలేను.

  6. మిత్రమా మత వివాదాల్లో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ మీ వ్యాసం చదివాక స్పందించడం నా ధర్మం అనుకున్నాను . సరే మీరు వివిధ మతాల ప్రార్థనలు చూసి ఒక మతం వారిలో క్రమశిక్షణకు ముచాతపడ్డారు. ఒక్కో మతం ఆచారాలు, దేవుడిని మొక్కడం ఒక్కో రకంగా ఉంటుంది . పలానా విధానమే సరైనది అని ఎలా చెప్పగలం . మీరు క్రమశిక్షణ లేదు అనుకునే మతాన్ని అవలంభించే దేశం శాంతిని నమ్ముకుంది. మీరు క్రమశిక్షణకు ముచ్చటపడే మతం వారున్న దేశాల్లో యెంత కల్లోలంగా ఉన్నాయో చూశారా ? దానికి తప్పు వారిదే అని నేను చెప్పడం లేదు . మంచి చెడు అన్ని మతాలలో ఉన్నాయి. చెడును తొలగించుకుందాం మంచిని పెంచుకుందాం . చాలా రోజుల క్రితం ఎక్కడో చదివాను . యూరప్ లో ఒక ముస్లిం టాక్సీ డ్రైవర్ తో ఒకతను లాడెన్ వంటి వారంతా మీ మతస్తులే కదా నీకు ఎలా అనిపిస్తుంది అని అడిగారు . దానికి ఆతను కొన్ని లక్షల మందిని చంపినా హిట్లర్ మీ మతస్తుడే కదా మికేమనిపిస్తుంది అని ఎదురు ప్రశ్నించాడట. ఏ మతం లో మంచి ఉన్న అభినందిద్దాం దానికోసం మరో మతాన్ని తక్కువచేసి చూపాల్సిన అవసరం లేదు .

  7. మురళిగారూ, నేను మత వివాదాన్ని ప్రారంభించలేదు. ముందే చెప్పినట్లు నేను ఏ మతవాదినీ కాను. ముస్లిం మతవాదిని అసలే కాను. కనుక ఒక మతం కంటె మరొక మతం గొప్పదని చూపించే పని నేను పెట్టుకోను.

    ప్రార్ధనలు చూడడానికి ఎలా ఉంటాయో అన్న విషయం ఒక్కటే నేను రాసింది. దానికి శ్రీకాంత్ గారు తన అభిప్రాయం రాశారు. ఆయన రాసిన అంశానికి (ఆయనకి కాదు) సమాధానం రాశాను.

    ప్రతిమతంలోనూ లోపాలు ఉన్నట్లే హిందూ మతంలోనూ కొన్ని లోపాలు ఉన్నాయని అంటున్నారా మీరు? దాన్ని కూడా అంగీకరించకుండా పరమతాలను ద్వేషించే వాళ్ళున్నారు. హిందూ మతంలోని లోపాల గురించి మాట్లాడకుండా ముస్లిం మతంలో లోపాలని ప్రధానం చేసి చూపేవారూ ఉన్నారు. అసలు మతంలో లోపాలు ఉన్నాయన్న అంశాన్నే అంగీరించని వారు చాలామంది ఉన్నారు. వారి అభిప్రాయలు వారికి ఉన్నాయి. నా అభిప్రాయాలు నాకూ ఉన్నాయి. నాకున్న అభిప్రాయాలనే నేను రాశాను. అందులో హిందూ మతాన్ని తక్కువ చేసి చూపాలన్న ఆసక్తి నాకు లేదు.

    హిందువుగా గౌరవించను అంటే హిందువలందర్నీ గౌరవించను అని కాదు. మనుషులను మనుషులుగా మాత్రమే నేను చూడగలను తప్ప హిందువుగా, ముస్లింగా, క్రైస్తవుడుగా చూడడం, అలా చూస్తూ గౌరవించడం నేను చేయలేను. ఎందుకంటే నేను మతవాదిని కాను. నేను ‘మనిషి’ వాదిని.
    హిందువుగా, ముస్లింగా, క్రైస్తవుడిగా చూడకుండానే నేను మనిషిని మనిషిగా చూడగలను. అటువంటి మనుషులకు మతం ఒక లక్షణంగా మాత్రమే నేను చూస్తాను. మనుషులతో వ్యవహరించేటప్పుడు నాకు నచ్చని అనేక లక్షణాలను పట్టించుకోనట్లే మత లక్షణాన్ని కూడా నేను పట్టించుకోను. అలాగే నాలో నచ్చని గుణాలు అనేకం ఇతరులు గమనిస్తారు. ఇతరులకి నచ్చని నా గుణాల్లో నేను మార్చుకోవలసినవి కొన్ని ఉండవచ్చు. మార్చుకోనవసరం లేనివీ ఉండవచ్చు. అలాగే వైస్ వెర్సా.

    ఆయా మతాలను నమ్మేవారు నాకు మిత్రులుగా ఉన్నారు. వారికి సందర్భం వచ్చినపుడు మత సంబంధమైన బహుమతులు (పెక్యూలియర్ గా అనిపించినప్పుడు) ఇచ్చే అలవాటు కూడా నాకు ఉంది. నేను తెచ్చే బహుమతిని నేను ‘పీస్ ఆఫ్ ఆర్ట్’ గా చూస్తే, అది అందుకునే నా మిత్రుడు భక్తితో ఆ బహుమతిని స్వీకరిస్తాడు. ఇవన్నీ నా అవగాహనలో ఒక భాగం.

    భారత దేశంలో శాంతి ఉందని మీరంటున్నారు. దేశంలో మూడొంతుల మందికి శాంతి లేదని మీరు గ్రహించడం లేదా? నిత్యం కుల వివక్ష ఎదుర్కొనేవారికి శాంతి ఉన్నట్లేనా? అర్ధాకలితో, పస్తులతో బతుకుతున్నవారికి శాంతి ఉన్నట్లేనా? రోజంతా శ్రమ చేసినా రెండు డాలర్లకి మించి రాని వారికి శాంతి ఉన్నట్లేనా? ఇవన్నీ అన్ని దేశాల్లోనూ ఉన్నాయని మీరు అంటారు. అవును. ఆ అన్ని దేశాల్లో ఉన్న అశాంతినే నేనూ ప్రశ్నిస్తున్నాను.అన్ని దేశాల్లోనూ ప్రజలకు శాంతి లేనట్లే ఇండియాలోనూ లేదనే నేను చెబుతున్నాను. ఇతర దేశాలకు మల్లేనే ఇండియాలో కూడా శాంతి లేదన్నదే నా అవగాహన. అనేక రకాల అశాంతుల్లో మత అశాంతి ఒకటి.

    హిందూ మతంలో దశావతారాలూ హింసే చేశాయి. అలాంటిది హిందూ మతం శాంతిని నమ్ముకుందనడం ఏమిటి?

    ముస్లిం దేశాల్లో -ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్, ఈజిప్టు, లిబియా, ట్యునీషియా, బహ్రెయిన్, యెమెన్, సిరియా- కనిపిస్తున్న అశాంతి అమెరికా సృష్టించిందని మీరు గమనించడం లేదా? అమెరికా స్వప్రయోజనాల కోసం కొన్ని దేశాలను దురాక్రమించి అశాంతి సృష్టిస్తే, మరి కొన్ని దేశాల్లో ఆక్రమించకుండానే అశాంతి సృష్టిస్తోంది. అమెరికా సృష్టించిన అశాంతికి అక్కడి ప్రజలు స్పందిస్తున్నారు తప్ప వారు అశాంతిని కోరుకుని కాదు. ప్రశాంతంగా గడపాలనే అందరూ కోరుకుంటారు. ఆ ప్రశాంతతను అమెరికా భగ్నం చేసింది. తమ ప్రశాంతతను తిరిగి తెచ్చుకోవడానికి వారు పోరాడుతున్నారు. దానికి మీరు అశాంతి అని పేరు పెట్టారు. అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించకుండా ఉంటే ఒకరకమైన శాంతి. కాని ఆరకం శాంతి ప్రజల జీవితాల్ని అల్లకల్లోలం చేస్తుంది. అమెరికా కోరుకునే శాంతికి (ప్రస్తుతం మీరు కోరుతున్న శాంతి అదే) అక్కడి ప్రజలు కోరుకునే శాంతికి ఉన్న తేడాని మీరు గమనించలేరా? ఆ దేశాల్లో లేని శాంతికి బాధ్యత అమెరికాది అని అంగీకరిస్తున్నపుడు ఆ మతం వారిని, లేదా ఆ మతాన్ని సదరు అశాంతికి కారణంగా మీరు చూపలేరు కదా? ఆ ఉదాహరణకూడా మీ వాదనకు సాయంగా రాదు.

    మతాల్లో చెడును తొలగించే కార్యక్రమం ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది. అదెవరు చేస్తున్నారో నాకు తెలియదు. చెడును తొలగించుకుందాం అనడం వేరు. చెడు ఆచారాలను ఆచరించకుండా ఉండడం వేరు.

    నా అభిప్రాయం ప్రకారం, ఆచార, వ్యవహారాలు, వాటి ఆచరణలను బట్టి చూస్తే ఏ మతంలోనూ పేద వర్గాలవారికి శాంతి లేదు. వారికి అన్ని మతాల్లోనూ అశాంతే దొరుకుతోంది. దానిక్కారణం మతాలు శాంతిని తెచ్చే సాధనాలు కాకపోవడమే. పైగా ఏ మతాన్ని చూసినా ఏదో ఒక రూపంలో అశాంతిని ప్రోది చేసేవే!

  8. గమనిక: శౌరిగారు రాసిన వ్యాఖ్యలను తొలగిస్తున్నాను. వెటకారం ధ్వనిస్తూ రాస్తున్నందున అవి ప్రచురించడానికి ‘కామెంట్స్ పాలసీ’ ప్రకారం వీలు లేనందున తొలగిస్తున్నాను. ఆయన మొదటి వ్యాఖ్యకి నేను ఇచ్చిన సమాధానం కూడ తొలగిస్తున్నాను. ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారితో రక్తపోటు పెంచుకోవడం సాధ్యపడుతుందేమో కానీ ఉపయోగకరమైన చర్చ సాధ్యపడదు.
    -విశేఖర్

  9. For your kind information, these two posts themselves are sarcastic posts … below lines are evidence.

    హిందూ పుణ్య క్షేత్రాల వద్ద కోలాహలం కనిపిస్తుంది. తిరుపతి దగ్గర్నుండి ఏ గుడి తీసుకున్నా అంతా కోలాహలం. కానుకలు కూడా కోలాహలమే. ప్రసాదం దగ్గర కూడా.

    అలా తొక్కిసలాటలో చనిపోవడాన్ని గౌరవంగా ముస్లింలు భావిస్తారని పత్రికల ద్వారా తెలుస్తోంది. హిందూ మతంలో ఈ విధంగా ‘మత కార్యక్రమాల్లో చనిపోయినపుడు గౌరవంగా భావించే’ ఆచారం ఉన్నదో లేదో తెలియదు.

    Can you please explain what is your tone here. I have got your motto and no need to visit this site anymore.

    Best regards,
    Shouri

  10. “హిందూ పుణ్య క్షేత్రాల వద్ద కోలాహలం కనిపిస్తుంది. తిరుపతి దగ్గర్నుండి ఏ గుడి తీసుకున్నా అంతా కోలాహలం. కానుకలు కూడా కోలాహలమే. ప్రసాదం దగ్గర కూడా.”

    పుష్కర పండగలు తీసుకున్నా, తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలని తీసుకున్నా అక్కడ హాజరయ్యే జనాన్ని దృష్టిలో పెట్టుకుని ‘భక్తజనం పోటెత్తింది” అనో “భక్తులు పోటెత్తారు” అనో రాస్తాయి పత్రికలు. నేను దానినే ‘కోలాహలం’ అని వర్ణించాను. ఈ వర్ణనలో వెటకారం ధ్వనిస్తుందని నాకైతే తెలియదు. ఇప్పటికీ అందులో వెటకారం నాకైతే కనిపించడం లేదు.

    “అలా తొక్కిసలాటలో చనిపోవడాన్ని గౌరవంగా ముస్లింలు భావిస్తారని పత్రికల ద్వారా తెలుస్తోంది. హిందూ మతంలో ఈ విధంగా ‘మత కార్యక్రమాల్లో చనిపోయినపుడు గౌరవంగా భావించే’ ఆచారం ఉన్నదో లేదో తెలియదు.”

    పై వాక్యం లోనూ వెటకారం ఏముంది? ముస్లింలనూ, హిందువులనూ ఇద్దర్నీ వెటకారం చేశానా ఇక్కడ? లేక ఒక్క హిందువులననేనా? మీ వెటకారాన్ని సమర్ధించుకోవడానికి లెని వెటకారం చూపడానికి ప్రయత్నించడం ఏమిటి? పుష్కర స్నానాల్లో చనిపోయినవారు స్వర్గానికి వెళ్తారని నమ్ముతారని విన్నాను. అది నిజమో కాదో తెలియదు గాని విన్నాను. అదే నమ్మకం ఇక్కడ కూడా ఉందేమో తెలుసుకుందామని అలా అర్దోక్తిగా రాశాను. అది చదివి అటువంటి నమ్మకాలు ఉన్నది లేనిదీ ఎవరైనా చెప్పవచ్చన్న అంచనాతో రాశాను. అందులో వెటకారం ఏ కోశానా లేదు. నా ఉద్దేశ్యంలో వెటకారం లేదని చెప్పడానికి ఇంతకంటె నేనేమీ చేయలేను. అసలు నిజానికి ముస్లింల నుండి ఈ వ్యాఖ్య వస్తుందేమో, వివరణ ఇద్దాం అని నేను సిద్ధపడి ఉన్నా. అనూహ్యంగా హిందూ మతాభిమాని నుండి రావడం ఆశ్చర్యం.

    ఈ సైట్ కి రావడమా లేదా అన్నది పూర్తిగా మీ ఇష్టం, అందులో నేను చెప్పేది ఏమీ లేదు. నేను మిమ్మల్ని అహ్వానించందీ లేదు. పొమ్మన్నదీ లేదు. కామెంట్ పాలసీ ప్రకారం చేయవలసింది చేశాను.

  11. oka matham vaari sampradayam goppadani okaridi takkuvani cheppalemu. Bhagavantudini namme variki anni mathalu daarini chupistayi. devuni peru cheppi vedhava veshlu vese vaaru anni mathallonu vunnaru. oka laden ano, oka hitler ano oka mathanni takkuva cheyaradu. mathamanedi tanaku sambandhinchinadi matrame. itarula vishallo jokyam kosam kadu. anni mathallonu chandasavaadulunnaru. okka mathanni dveshincharadu. manishini premiddam, kaani mathanni kadu.

  12. లారా గారూ, మీరు చెబుతున్నది ఆదర్శం. అది నిజం కావాలని ఆశిద్దాం.
    అత్యధికులు మనిషి కంటే మతాన్ని ప్రేమించేవారు కనుకనే ఇన్ని కుమ్ములాటలు.
    రాజకీయ నాయకులు జొరబడి మతాన్ని మరింత భ్రష్టు పట్టించారు.

వ్యాఖ్యానించండి