తానింకా సోషలిస్టునే అంటున్న గ్రీకు ప్రధాని -కార్టూన్


చెయ్యాల్సిందంతా చేసిన గ్రీకు ప్రధాని జార్జి పపాండ్రూ తానింకా సోషలిస్టునే నని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నాడు. ఇప్పటికి ఐదు విడతలుగా అత్యంత కఠినమైన ప్రజా వ్యతిరేక పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేసిన పపాండ్రూ ఆరో విడత కోతలకు ప్రజల అనుమతి కావాలంటూ బయలుదేరాడు. గ్రీసు కోసం ఇ.యు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందంపైన గ్రీసు ప్రజల అనుమతి కోసం ‘రిఫరెండం’ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. మొదటి ఐదు విడత కోతలకు ప్రజల అనుమతి తీసుకోవాలని పపాండ్రూకి గుర్తు రాలేదు.

కాని రిఫరెండం జరపడానికి ఇ.యు పెత్తందార్లు జర్మనీ, ఫ్రాన్సులు అంగీకరించడం లేదు. దానితో రిఫరెండం కాస్తా రద్దయినట్లే కనిపిస్తోంది. ఆర్ధికమంత్రి వెనిజలోస్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటుకీ, వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకీ పాలక ప్రతిపక్షాల మధ్య ఒప్పందం కుదరనున్నది. పాలక, ప్రతిపక్షాలు రెండూ కలిసి జాతీయ యూనిటీ ప్రభుత్వం ఏర్పరిచి దాని ఆధ్వర్యంలో గ్రీసు ప్రజల్ని ఆరో విడత పన్నులు, కోతలతో బాదడానికి రంగం సిద్ధమవుతోంది.

మొదట గ్రీసు ప్రజల అనూమతి కోరడానికి ‘రిఫరెండం’ ప్రకటించిన జార్జి పపాండ్రూ, జర్మనీ, ఫ్రాన్సు ల బెత్తం దెబ్బలకి జడిసి దాన్ని విరమించుకున్నాడు.

Papandreou, Socialistజర్మనీ, ఫ్రాన్సులు విధించిన శిక్షను జార్జి పపాండ్రూ అమలు చేస్తూ బోర్డుపైన రాస్తున్నాడిలా:

“నేను గ్రీసు ప్రజలను సంప్రదించకూడదు”

“నేను గ్రీసు ప్రజలను సంప్రదించకూడదు”

“నేను గ్రీసు ప్రజలను సంప్రదించకూడదు”

నీతి: ఆచరణే ఎవరయినా సోషలిస్టు అయిందీ కానిదీ నిర్ణయిస్తుంది తప్ప వారి పార్టీ పేర్లూ, కబుర్లూ కాదు

వ్యాఖ్యానించండి