అక్టోబరు 31 తో లిబియాపై నాటో యుద్ధం ముగిసినట్లుగా నాటో కూటమి ప్రకటించింది. యుద్ధం ముగిసింది కాబట్టి నాటో సైన్యాలు, గూఢచారులు లిబియా వదిలి పోతున్నాయనుకుంటే పొరబాటే. లిబియా జలాల్లో మొహరించిన నాటో దేశాల యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు తమ పూర్వ ప్రాంతానికి వెళతాయని భావించినా పొరబాటే. ఎందుకంటె అవి అక్కడే, లిబియాపై దాడులు జరిగనంతకాలం ఎక్కడ ఉన్నాయో అక్కడే కొనసాగబోతున్నాయి. పైగా గూఢచారులు, సైనికులు మరింత స్వేచ్ఛగా బహిరంగంగా లిబియా నేలపైన సుదీర్ఘ కాలం పాటు తిష్టవేయనున్నారు.
లిబియాలో వేసే తిష్ట అధికారికం కాదు. అంటే పైకి చెప్పరు. ఎంతమంది సైన్యాన్ని లిబియాలో మొహరించారో పూర్తిగా వివరాలు చెప్పరు కనుక ఇక ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లలో వలే ఉపసంహరణ ప్రసక్తే ఉండదు. నిజానికి లిబియాపై నాటో విజయవంతంగా ముగించిన దురాక్రమణ మోడల్ పశ్చిమ దేశాల పాలకులకూ, ఆయిల్, నిర్మాణ, ఆయుధ కంపెనీలకూ తెగ నచ్చేసింది. అంతర్జాతీయ దృష్టిని పెద్దగా ఆకర్షించకుండా ఆయా దేశాల ప్రజలను అక్కడి పాలకుల నుండి రక్షించడానికని పచ్చి అబద్ధాలు చెప్పి నమ్మించి (నమ్మకపోయినా ఫర్వాలేదు) దురాక్రమణకు దిగడం ఈ మోడల్ లక్షణం.
మొత్తం 19 నాటో దేశాలు, ముస్లిం మతోన్మాద దేశాలు కలిసి 13,509 మంది వాయు, భూతల, సముద్ర బలగాలను వినియోగించి 310 అత్యాధునిక ఫైటర్ జెట్ విమానాలతో 5,857 సార్లు వైమానిక దాడులతో లిబియా ప్రజలపైనా, ప్రభుత్వ భవనాలపైనా, రోడ్లు వంతెనలపైనా, అధ్యక్ష భవనాలపైనా ఏడు నెలలపాటు బాంబుల వర్షం కురిపించి అరబ్, ఆఫ్రికా ప్రజానీకంపై దారుణ హత్యాకాండను సాగించాయి. ఇతర వివరాలు కింది విధంగా ఉన్నాయి.
–
–

vinaasakaalam vipareetha buddulu.yedo oka roju chesina thappulaku siksha anubhavimpaka thappadu.duraakramanadaarula antham avvakaa thappadu.