“వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం ప్రపంచవ్యాపితంగా 85 దేశాలలోని 2,500 నగరాలకు వ్యాపించినట్లుగా ఉద్యమ సంస్ధల వెబ్ సైట్లు చెబుతున్నాయి. ఈ ఉద్యమం ఇతర ప్రాంతాల్లో కంటె అమెరికా, యూరప్ లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలలో కొన్ని ప్రధాన పట్టణాలలో పదుల సంఖ్యలో మాత్రమే నిరసనకారులను ఆకర్షిస్తున్న ఈ ఉద్యమం ఉత్తర అమెరికా, యూరప్ దేశాలలో మాత్రం వేల సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తోంది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి ఎక్కువగా దెబ్బ తిన్నది అమెరికా, యూరప్ దేశాలేనని గుర్తు చేసుకుంటే, ‘ఆకుపై’ ఉద్యమానికీ ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి ఉన్న సంబంధం అర్ధం కాగలదు.
అమెరికా, యూరప్ లలో ఆర్ధిక సంక్షోభం ఫలితంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు రద్దయ్యాయి. ఇంకా రద్దువుతూనే ఉన్నాయి. అన్ని విభాగాలతో పాటు పోలీసు విభాగంలో కూడా ఉద్యోగాల సంఖ్యను కుదించడానికి అమెరికా, యూరప్ లు నిర్ణయించుకున్నాయి. అయితే ‘వాల్ స్ట్రీట్’ ఉద్యమం పుణ్యామాని ప్రభుత్వాలకు పోలీసుల అవసరం పెరిగింది. ఉద్యమాలను అణచివేయడానికి పోలీసుల అవసరం పెరగడంతో పోలీసు విభాగంలో లే-ఆఫ్ లు విధానం ఎలా అమలవుతుంది?
పోలీస్ 1: ఇది విన్నావా? పోలీసు శాఖలో ఉద్యోగాల రద్దు కేన్సిల్ అయిందట.
పోలీస్ 2: అవును, విన్నాను. నేనీ యువతికి ఇప్పుడే కృతజ్ఞతలు చెబుతున్నాను.
–
