పట్టుకున్నపుడు బతికే ఉన్న గడ్డాఫీ -ఫొటోలు


గడ్డాఫీ డ్రైనేజి పైపులో దాగి ఉన్నాడనీ, చివరి క్షణాల్లో ‘నన్ను కాల్చొద్దంటూ’ అరిచాడనీ, లిబియా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు పెద్ద ఎత్తున వార్తలు రాస్తున్నాయి. నలుగురైదుగురు చేతులు పైకిత్తి నవ్వుతున్న ఫొటోలు ప్రచురించి లిబియా అంతా సంబరాలు జరుపుకుంటున్నారని చెబుతున్నాయి. నాలుగు శవాలు పడిఉన్న డ్రైనేజి పైపులను చూపించి గడ్డాఫీ దాక్కున్నది ఇక్కడేనని చూపిస్తున్నాయి. ఇవన్నీ పచ్చి అబద్ధాలని అవి ప్రారంభంలో ప్రచురించిన వార్తలే చెబుతున్నాయి.

గడ్డాఫీ పట్టుబడ్డాడని మొదట వార్తలు వచ్చినపుడే ఆయన వాహనాల కాన్వాయ్ లో సిర్టే పట్టణం నుండి పారిపోతుండగా నాటో బలగాలు చూశాయని రాయిటర్స్ రాసింది. వాహనాల కాన్వయ్ పై నాటో బలగాలు బాంబులు వేయడంతో గడ్డాఫీ తీవ్రంగా గాయపడ్డాడనీ రెండు కాళ్ళకు గాయాలయ్యాయనీ ఆసుపత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని రాయిటర్స్ రాసింది. మరో గంటకు తలపైన కూడా గాయమయ్యిందిని రాసింది. ఆ వెంటనే ‘తలపై గాయం వలన గడ్డాఫీ చనిపోయాడ’ని ఎన్.టి.సి (నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్) అధికారి అబ్దెల్ మజీద్ ప్రకటించినట్లు కూడా రాసింది.

గడ్డాఫిని పట్టుకున్నపుడు బతికే ఉన్నాడనీ ఊపిరి పీలుస్తున్నాడనీ బిబిసి రాయగా, గాయాలతో ఒంటినిండా రక్తం కారుతూ, రక్తపు ముద్దగా ఉన్న గడ్డాఫీపైన “చుట్టూఉన్న వాళ్ళు చేయి చేసుకున్నారనీ, వారి దెబ్బలను అడ్డుకోవడానికి గడ్డాఫీ ప్రయత్నించాడనీ” రాయిటర్స్ తెలిపింది. అంటే నాటో బాంబు దాడిలో గాయపడిన గడ్డాఫీని పట్టుకున్న తిరుగుబాటు బలగాలు తుపాకితో తలలో కాల్చి చంపారని అర్ధమవుతోంది. పైనుండి ఆదేశాలు లేకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిని ఈ విధంగా కాల్చడానికి ఎవరూ సాహసించరన్నది గమనిస్తే, సో కాల్డ్ తిరుగుబాటు ప్రభుత్వం నుండి ఆదేశాలమేరకే గడ్డాఫిని కాల్చిచంపారని భావించవలసి వస్తున్నది.

సజీవంగా పట్టుకున్నట్లయితే అంతర్జాతీయ విచారణ లాంటీ సుదీర్ఘ ప్రక్రియలో గడ్డాఫీపై విచారణ సాగించవలసి ఉంటుంది. గడ్డాఫీ విచారణలో పశ్చిమ దేశాల అకృత్యాలకు సంబంధించిన వివరాలు చెప్పవచ్చు. అది పశ్చిమ దేశాలకు అనవసర ఇబ్బంది. కాల్చి చంపేస్తే యుద్ధంలో చనిపోయినట్లు చెప్పవచ్చు. ఈ ఆలోచనతోనే గడ్డాఫీని దొరకగానే పైనుండి వచ్చిన ఆదేశాల మరకు చంపేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ క్రింది ఫొటోల్లో సజీవంగా గడ్దాఫీని పట్టుకోవడాన్ని చూడవచ్చు.

7 thoughts on “పట్టుకున్నపుడు బతికే ఉన్న గడ్డాఫీ -ఫొటోలు

  1. కొన్ని వేల లక్షల మంది తిరుగుబాటు చేసారు కదా?
    మరి గడ్డాఫీ అంత మంచివాడైతే ఎందుకు అంత మంది ఎదిరిస్తారు?
    తిరుగుబాటు చేసినవాళ్ళు అందరు డబ్బు కోసం చేసారు అనలేము కద.
    మరి మన తెలంగాణా ఉద్యమంలో కూడ ఎంతో మంది పాల్గొంటున్నారు. వాళ్ళు ఊరికే చెయ్యట్లేదు కద.

  2. ఒక వెయ్యి లక్షలు తిరుగుబాటు చేశారనుకుందాం. అంటే పది కోట్ల మంది తిరుగుబాటు చేశారని మీరు చెబుతున్నారు. కాని లిబియా జనాబా 2011 అంచనా ప్రకారమే 6.6 మిలియన్లు. అంటే 66 లక్షలు. ఇక పది కోట్లమంది తిరుగుబాటు చేసే సమస్యే ఉండదు కదా? గడ్డాఫీపైన చేసిన ప్రచారం అంతా ఇలాగే ఉంటుంది. సద్దాం హుస్సేన్ పైన ప్రచారం చేసిందంతా అబద్ధాలని తర్వాత వాళ్ళే ఒప్పుకున్నారు. అలాగే లిబియా విషయంలోనూ నిజాలు బైటికి వస్తాయి.

  3. అమెరికా మోచేతి నీళ్ళు తాగే కువైట్ అమీర్ ఎంత మందికి మరణ శిక్షలు వేసినా అమెరికా కువైట్‌పై దాడి చెయ్యదు. అమెరికా ఒకప్పుడు సద్దాం హుస్సేన్‌కి కూడా సపోర్ట్ ఇచ్చింది. కమ్యూనిస్ట్ అనే అనుమానంతో తన సొంత తమ్ముణ్ణి చంపిన చరిత్ర సద్దాం హుస్సేన్‌కి ఉంది. అందుకే ఒకప్పుడు అమెరికా సద్దాం హుస్సేన్‌కి మద్దతు ఇచ్చింది. కానీ అదే సద్దాం హుస్సేన్ అమెరికావాళ్ళ తోలు బొమ్మ (sock puppet) పాలనలో ఉన్న కువైట్ దేశంపై దాడి చేసినప్పుడు అమెరికా ఇరాక్‌పై దాడి చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే యుద్ధాలు ఇలాగే ఉంటాయి.

  4. ఇకపోతే సద్దాం సంగతి. సద్దాం అనుకూలురు ఇరాన్లో చాలా మందే ఉన్నారు. వ్యతిరేకించారు కూడా. కానీ లిబియా గొడవలో సామాన్యులు ఎక్కువగా ఎవరూ వ్యతిరేకించినట్టు కనపడలేదు కద.

  5. వెంకట్ గారూ
    ముందు మీరు వేలు, లక్షలు తిరుగుబాటు చేశారు అన్నారు. ఇప్పుడు సామాన్యులు ఎవరూ వ్యతిరేకించలేదు గదా (తిరుగుబాటుని అని అర్ధం చేసుకున్నా) అంటున్నారు. మీరే అన్నట్లు వారు సామాన్యులు. సాయుధులు కానివారు. అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల నుండి వచ్చిన ఆయుధాలతో గూండాయిజం చేసి బెంఘాజీని ఆక్రమించారు తప్ప అక్కడి ప్రజల అనుమతితో కాదు. అక్కడి ప్రజలపైనా తిరుగుబాటుదారులుగా చెబుతున్న సాయుధులు అనేక అకృత్యాలకు పాల్పడ్డారు. వారు ఎదురు తిరగకుండా ఆయుధాలతో అణచిపెట్టారు. అక్కడి నుండి స్వంతగా తిరుగుబాటు నడపాలనుకుని నడపలేకపోయారు. గడ్డాఫీ సైన్యం ముందు వారు నిలవలేక పోయారు. ఆ తర్వాత మిగిలిందంతా అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు చేసిపెట్టాయి. అంటే లిబియా ప్రజల తిరుగుబాటుని ఈ మూడు దేశాలు చేసిపెట్టాయన్నమాట.

    ఇతర అరబ్ దేశాల్లో తిరుగుబాట్లు మనకి పత్రికల్లో కనిపించాయి. ఛానెళ్లు ఊరేగింపుల్ని చూపాయి. పోలీసులు, సైన్యాలు ప్రజలపై జరిపిన కాల్పుల్ని చూపాయి. కాని లిబియాలో ప్రజల తిరుగుబాటుపైన ఇంతవరకూ ఒక్క ఫోటో, ఒక్క వీడియో ఎవరూ చూపలేదు. అక్కడ జరిగింది తిరుగుబాటు కాదనీ కుట్రపూరితమైన దురాక్రమణ అనీ చెప్పడానికి ఇది చాలదా?

వ్యాఖ్యానించండి