సౌదీ అరేబియాకు చెందిన ‘ఫెరాస్ బగ్నా’ దేశ పౌరుడుగా ఓ చిన్న ప్రయత్నం చేశాడు. దేశంలో ఉన్న దరిద్రాన్ని వీడియో ద్వారా చూపించి తద్వారా ధనవంతులనుండి విరాళాలు సేకరించి పేదలకు ఇవ్వాలనుకున్నాడు. అనుకన్నదే తడవుగా ఫెరాస్ సౌదీ రాజధాని రియాధ్ లో పేద ప్రాంతాలకు వెళ్ళి వారి ఇళ్ల లోపలి భాగం కూడా చూపించి, వారి ఆర్ధిక పరిస్ధితి గూర్చి వారి చేతనే చెప్పించి ఆ దృశ్యాలతో ఒక వీడియో రూపొందించాడు. తన వంతు బాధ్యతగా తాను సందర్శించిన పేద ఇళ్ళకు కొంత సాయాన్ని కూడా అందించాడు. అయితే అతని వీడియో ఇంటర్నెట్ లో విపరీతంగా క్లిక్ అయ్యి పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఏర్పడింది. విరాళాలు వచ్చాయో లేదో తెలియదు గాని సౌదీ రాచరిక ప్రభుత్వం అతనిని తీసుకెళ్ళి జైల్లో పెట్టింది. ఆయన విడుదల కోరుతూ బ్రెజిల్ కార్టూనిస్టు ‘కార్లోస్ లాతుఫ్’ గీసిన కార్టూన్ ఇది.
—
