సౌదీ అరేబియా ‘దరిద్రం’పై వీడియో తీసినందుకు అరెస్టు (+వీడియో)


కొద్ది వారాల క్రితమే మహిళలకు ఓటు హక్కు ఇస్తున్నట్లు ప్రకటించి అరబ్ ఆందోళనలనుండి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ సౌదీ అరేబియా రాజు తన నియంతృత్వ పాలనను కొనసాగిస్తూనే ఉన్నాడు. కారు నడిపిన నేరానికి స్త్రీలను అరెస్టు చేసిన కొద్ది రోజులకే ‘సౌదీ అరేబియా’లో కూడా దరిద్రం తాండవిస్తున్నదనీ, అది కూడా రాజధాని నగరంలోనే ఉన్నదని చూపిస్తూ వీడియో తయారు చేసినందుకు ‘ఫెరాస్ బగ్నా’ అనే పౌరుడిని అరెస్టు చేయించాడు. ‘ఫెరాస్ బగ్నా’ తాను తీసిన వీడియో ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడంతో అతనికి విపరీతమైన ఫోలోయింగ్ ఏర్పడింది. బహుశా అదే సౌదీ రాజుగారికి కోపం తెప్పించి ఉండవచ్చు.

వ్యాఖ్యానించండి