ఒబామా దర్శకత్వంలో యాక్షన్ ధ్రిల్లర్: ‘ఇరాన్ కాన్స్పిరసీ’ -కార్టూన్


అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా దర్శకత్వంలో గొప్ప యాక్షన్ ధ్రిల్లర్ విడుదల కానుంది. గతంలో ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి హాలీవుడ్ సినిమాల్లో సోవియట్ రష్యా గూఢచారులు, కంపెనీలు, అధికారులు విలన్లుగా ఉండేవారు. ప్రచ్ఛన్నయుద్ధం అంతం అయ్యాక విలన్లకు కరువు ఏర్పడింది. కాని త్వరలోనే అమెరికా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కృత్రిమ విలన్లను తయారు చేసుకుంది. ‘టెర్రరిజం’ కధలను ధీమ్ గా చేసుకుంటూ ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా, ఇరాన్ దేశాలను ‘రోగ్ స్టేట్స్’ అనీ, ‘యాక్సిస్ ఆఫ్ ఈవిల్’ అనీ కొత్త విలన్లను ప్రపంచానికి పరిచయం చేసింది.

సైడ్ హీరోగా ఇజ్రాయెల్ ను పెట్టుకుని ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా సెంటర్ ధీమ్ లుగా సినిమాలు నిర్మాణం లో ఉండగానే, తాజాగా ఇరాన్ విలన్ గా “ఇరాన్ కాన్స్పిరసీ” అని గొప్ప యాక్షన్ ధ్రిల్లర్ ని ఒబామా సిద్ధం చేస్తున్నాడు. ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా సినిమాలు విడుదల కాకముందే ‘అట్టర్ ఫ్లాప్’ టాక్ వచ్చినా ఒబామా అతి వేగంగా లిబియా సినిమా విడుదల చేసి అమెరికన్ల డబ్బుని తినేశాడు. ‘అమెరికాలో సౌదీ అరేబియా నియమించిన రాయబారిని ఇరాన్ ప్రభుత్వం హత్యచేయడానికి కుట్రపన్నడం’ తాజా సినిమా ప్రధాన ధీమ్.

ఎప్పటిలాగే ఈ సినిమాకు కూడా నిర్మాత ‘అమెరికన్ ప్రజానీకమే.’ నిర్మాతకు యిష్టం లేకుండా దర్శకుల బలవంతంతో నిర్మిస్తున్న సినిమాలు ఇవి.

Iran conspiracy

కార్టూనిస్టు: విక్టర్ నీటో, వెనిజులా

వ్యాఖ్యానించండి