ప్రభుత్వ భూములను డీ నోటిఫై చెయ్యడంలో యెడ్యూరప్ప అక్రమాలకు పాల్పడ్డాడని యెడ్యూరప్ప అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మంత్రిగా పని చేసిన ఎస్.ఎన్.క్రిష్ణయ్య శెట్టి బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు తిరస్కరించింది. యెడ్యూరప్ప గతంలో కోర్టు ఇచ్చిన సమన్ల మేరకు కోర్టుకు హాజరు కావడంలో విఫలమయ్యాడు.
బెంగుళూరులో నివాసం ఉంటున్న ఒక అడ్వొకేట్, సిరాజిన్ భాషా, దాఖలు చేసిన ప్రవేటు ఫిర్యాదును కోర్టు విచారిస్తూ యెడ్యూరప్ప, క్రిష్ణయ్యలపై వారంటు జారీ చేసింది. గెద్దహల హళ్ళి, దేవర చిక్కనహళ్ళి, అరాకెరె, దక్షిణ బెంగుళూరు ప్రాంతాలలోని ప్రభుత్వ భూములని అక్రమ పద్ధతుల్లో డీ నోటిఫై చేశాడని భాషా యెడ్యూరప్పపైన ఆరోపణలు చేశాడు. తనకు సన్నిహితులకు మేలు చేయడానికీ యెడ్యూరప్పతో పాటు ఆయన కుమారులు, అల్లుడు తదితర ఐదుగురితో కలిసి అక్రమాలకు పాల్పడడం ద్వారా రాష్ట్ర ఖాజానాకు 40 కోట్ల నష్టం తెచ్చారని భాషా ఆరోపించాడు.
గతంలో కర్ణాటక హైకోర్టు కూడా యెడ్యూరప్ప బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. కాని ఆయన కుమారులు, అల్లుడులకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది. లోకాయుక్త ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించినపుడు యెడ్యూరప్ప కోర్టులో లేడు. తాను నడుము నొప్పితో బాధపడుతున్నానని కనుక వ్యక్తిగత హాజరునుండి తనను మినహాయించాలనీ కోర్టును కోరాడు. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు సంగతి అటుంచి ఏకంగా అరెస్టు చేయడానికి కోర్టు వారంటు జారీ చేసింది.
అవినీతి, నల్లడబ్బులకు వ్యతిరేకంగా అద్వాని రధయాత్రలో ఉండగానే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అవినీతి భాగోతంపైన కోర్టులు చర్యలు ప్రారంబించడం, బి.జె.పి ఎన్నికల ఆశలపై కొంతమేరకు నీరు జల్లినట్లయ్యింది. ఎన్.డి.ఎ పాలనలో ఉండగా లేని డిఫెన్సు కంపెనీ నుండి అనేకమంది బి.జె.పి నాయకులు లంచం తీసుకుంటూ తెహెల్కా వార్తా సంస్ధ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో దొరిగిపోయారు. వారిపైన ఏ చర్యా ఇంతవరకూ తీసుకోలేదు. అప్పట్లో బి.జె.పి జాతీయ అధ్యక్షుడుగా ఉన్న బంగారు లక్ష్మణ్ పైనే ఆరోపణలు వచ్చినా చర్యలు లేవు. ఇపుదు అదే బి.జె.పి నాయకుడు అవినీతికి వ్యతిరేకంగా అంటూ రధయాత్రం చెయ్యడం ప్రజలను అడ్డంగా మొసగించడమే.

పాపం అద్వాని! భారతదేశ రాజకీయాల్లో అవినీతిపరులు కాంగ్రెస్ మరియూ ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువగా కనపడతారు. సిద్ధాంత పార్టీలుగా భావిస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ, బిజేపి లలో ఈ బాపతు తక్కువ. మరీ ముఖ్యంగా ఆర్.ఎస్.ఎస్. నుండి వచ్చిన ఎడ్యూరప్ప అవినీతి ఆరోపణల్లో కూరుకు పోవటం ఆశ్చర్యకరం. యెడ్యూరప్ప దెబ్బ అద్వానీకి బాగానే తగిలేట్టుంది. అవినీతి విషయంలో కాంగ్రెస్, బిజేపి దొందూ దొందే అనే అభిప్రాయం జనాల్లో కలిగితే బిజెపి కి నష్టం. కాంగ్రెస్ కి లాభం. ఎందుకంటే ఈ విషయంలో ఎట్లాగూ కాంగ్రెస్ పాతాళంలో ఉంది. ఇంత కన్నా కాంగ్రెస్ కి చెడేది లేదు.
బి.జె.పి అధికారంలో ఉన్నదే ఐదారు సంవత్సరాలు. అందువలన ఆ పార్టీకి అవినీతికి పాల్పడే అవకాశం చాలా తక్కువగా వచ్చింది. ఆర్.ఎస్.ఎస్, బి.జె.పి లకు అవినీతికి పాల్పడకూడదన్న నియమాలు ఉంటాయని నేననుకోను. కాకుంటె అధికారం కొసం కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తుంది, అంతే. తెహల్కా ఉదంతం వారి రంగు కూడా బైటపెట్టింది కదా.