బోసిపోయిన రైలు పట్టాలు ‘తెలంగాణ’ను డిమాండ్ చేస్తున్నాయి -రైల్ రోకో ఫొటోలు


తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన మూడు రోజుల రైల్ రోకో పిలుపు మేరకు మొదటిరోజు శనివారం నాడు రైల్ రోకో విజయవంతంగా జరిగింది. శుక్రవారం రోజే తెలంగాణ జిల్లాలన్నింటా మూడు వందల మంది వరకూ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం మరో 2300 వరకూ అరెస్టు చేశామని ఐ.జి.అనూరాధ తెలిపింది. ముందస్తు అరెస్టులు ఇంకా కొనసాగుతాయని తెలిపింది.

పట్టాలపై కూర్చున్నవారిపైన రైల్వే యాక్టు కింద అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతున్నామనీ, పట్టాలమీదికి రానివారిపై మామూలు కేసులు పెట్టామనీ ఆమె తెలిపింది. పూర్తిగా రైళ్లను నడపడానికి పెద్ద ఎత్తున బలగాలు కావాలనీ, కనీసంగా ప్రయాణ సౌకర్యం కల్పించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నామనీ ఆమె తెలిపింది. రైల్ రోకో విషయం తెలియక స్టేషన్ కు వస్తున్నవారికి భద్రతతో తాము నడుపుతున్న రైళ్ళు ఉపయోగపడుతున్నాయని ఆమె తెలిపింది.

ఈ ఫోటోలను ‘ది హిందూ’ పత్రిక ప్రచురించింది.

One thought on “బోసిపోయిన రైలు పట్టాలు ‘తెలంగాణ’ను డిమాండ్ చేస్తున్నాయి -రైల్ రోకో ఫొటోలు

  1. దమనకాండతో ఉద్యమాన్ని అణిచివేయచ్చని ఎవరయినా అనుకుంటే పొరపాటే అవుతుంది. ఆరు నూరయినా తెలంగాణా రాష్ట్రం అవతరించక మానదు. తెలంగాణాను ఆపడం ఎవరి తరం కాదు.

వ్యాఖ్యానించండి