బోస్టన్ ను ఆక్రమించండి -ఫొటో + వీడియో


“ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమం అమెరికాలో అక్టోబరు 3 నాటికి 50 నగరాలకు పైగా వ్యాపించింది. బోస్టన్ నగరవాసులు “ఆకుపై బోస్టన్” ఉద్యమం కింద సమీకృతులవుతున్నారు. సెప్టెంబరు 30 తేదీన వెయ్యిమందికి పైగా ప్రజానీకం బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందు ప్రదర్శన నిర్వహించి ఇళ్ళ రుణాలను ఫోర్ క్లోజ్ చేయడంపై మారిటోరియం విధించాలని డిమాండ్ చేసారు. ఆ తర్వాత డీవే స్క్వేర్ కు ఊరేగింపు నిర్వహించారు. అక్కడ “ఆకుపై బోస్టన్” ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు.

ఈ ఉద్యమంలో 7 నుండి 77 ఏళ్ల వరకూ వయస్కులు పాల్గొన్నారు. పురుషులు స్త్రీలు, మధ్య తరగతి వాళ్ళు ఇళ్ళు లేనివాళ్ళు, యుద్ధ వ్యతిరేకులు వృద్ధ మెరైన్లు, ఆఫ్రికన్ అమెరికన్లు వలస వచ్చినవాళ్ళు, అరబ్బులు యూదులు, ఆసియన్‌లు లాటినోలు, నిరుద్యోగులు అతిపని భారాన్ని మోస్తున్నవాళ్లు, కార్మికులు విద్యాధికులు వివిధ తరగతులవాళ్ళు ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు.

Occupy Boston

వ్యాఖ్యానించండి