‘బోస్టన్ ఆక్రమిద్దాం’ ఉద్యమ అతి పెద్ద ర్యాలి -వీడియో


సెప్టెంబరు 30 తేదీన అమెరికాలోని బోస్టన్ నగరంలో వివిధ ప్రాంతాల వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారణభూతులైన వాల్‌స్ట్రీట్ కంపెనీలకు పెద్ద మొత్తంలో బెయిలౌట్లు పంచిపెట్టిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ బోస్టన్ శాఖ ముందు అందోళనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. హైస్కూల్ విద్యార్ధులనుండి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకూ పాల్గొన్న ఈ ర్యాలికి పోలీసులు కాపలా కాశారు. వికలాంగులు సైతం పాల్గొన్న ఈ ఊరేగింపు తర్వాత బోస్టన్ నగరం నుండి అనేకమంది ఇతర నగరాలకు వెళ్ళి ఆందోళనలు నిర్వహించడం విశేషం.

వ్యాఖ్యానించండి