అరబ్ ప్రజల ప్రజాస్వామిక విప్లవ ఆకాంక్షలను ఆసరా చేసుకుని అమెరికా వేలుపెట్టిన దేశాల్లో లిబియా మొదటిది కాగా సిరియా రెండవది. వ్యూహాత్మకంగా సిరియా ఉన్న ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ లు ఎప్పటినుండో కన్నేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ ల బద్ధ శత్రువు ఇరాన్‌కు మిత్ర దేశంగా, పాలస్తీనాలో గాజాలో ప్రభుత్వం నడుపుతున్న హమాస్ సంస్ధకు మద్దతుదారుగా ఉన్న సిరియాలో తమ అనుకూల ప్రభుత్వం నిలపాలని అవి వేయని ఎత్తుగడా, పన్నని పన్నాగాలు లేవు.
ప్రతిపక్ష ఉద్యమాల పేరుతో సాయుధులైన ముఠాలకు అమెరికా మద్దతు ఇస్తూ అల్లర్లను రెచ్చగొడుతున్నది. యెమెన్, బహ్రెయిన్ లలో నియంతృత్వ పాలకులు పెద్ద ఎత్తున ప్రజలపై హింసకు పాల్పడుతున్నప్పటికీ పట్టించుకోని అమెరికా సిరియాలో సాయుధ ముఠాల దాడులను సైతం ప్రభుత్వం భరించాలని అమెరికా కోరుతోంది. ప్రతిపక్షాల ఆందోళలనకు స్పందించి అనేక సంస్కరణల చర్యలను సిరియా అధ్యక్షుడు ప్రకటించినప్పటికీ ప్రతిపక్షాలు వాటికి అంగీకరించకుండా అమెరికా అడ్డుపడుతోంది.
కార్టూనిస్టు: హమీద్ కరౌట్, సిరియా, తిష్రీన్ పత్రిక
—
