ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుడు, అఫ్జల్ గురు విడుదల కోసం? (అప్‌డేట్స్)
ఢిల్లీ హైకోర్టు వద్ద నాలుగు, ఐదవ గేట్ల మధ్య శక్తివంతమైన బాంబు పేలిన దుర్ఘటనలో మరణించినవారి సంఖ్య 11 కి పెరిగిందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఉదయం గం.10:14ని.లకు పేలిన ఈ బాంబు పేలుడు ఘటన ఢిల్లీలో నాలుగు నెలల్లో రెండవది. మే25 తేదీన, ఇదే హైకోర్టు ప్రాంగణంలో పాలిధీన్ కవర్ లో పెట్టిన తక్కువ తీవ్రతతో కూడిన బాంబు పేలింది. ఆ పేలుడులో ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదు. ఓ కారు స్వల్పంగా దెబ్బతినడం తప్ప…