అతి భారీ కూరగాయలు -ఫొటోలు

సెప్టెంబరు 16 తేదీన ఉత్తర ఇంగ్లండులోని హారొగేట్ పట్టణంలో “హారోగేట్ ఆటమన్ ఫ్లవర్ షో జరిగింది. ఇది ఈ సంవత్సరం వందవ ప్రదర్శన జరుపుకుంటోంది. ఈ సారి ప్రదర్శనలో అతి భారీ కూరగాయల ప్రదర్శన విభాగాన్ని ఏర్పాటు చేయడంతో సాగుదారులు పోటీలు పడి ప్రదర్శనలో పాల్గొన్నారు. సాగుదారుడు డెరెక్ న్యూమన్ తన భారీ కేబేజి తో ప్రదర్శనకు వస్తున్నాడు. పీట్ గ్లేజ్ బ్రూక్, 8.15 కిలో గ్రాముల ఉల్లిపాయతో ఆశ్చర్యపరిచాడు

కాలుష్య ఫ్యాక్టరీపై చైనా గ్రామీణుల పోరాటం

తూర్పు చైనాలో వందలమంది గ్రామీణులు సోలర్ ప్యానెల్ ఫ్యాక్టరీ కాలుష్యం వెదజల్లుతుండడంతో ఫ్యాక్టరీని అక్కడినుండి తరలించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. ఝెజియాంగ్ రాష్ట్రంలోని హైనింగ్ పట్టణంలో ఉన్న ఝెజియాంగ్ జింకో సోలార్ కంపెనీ ఎదుట ఐదొందల వరకూ గ్రామీణులు గురువారం గుమిగూడి ఆందోళన ప్రారంబించారు. ఆందోళనకారుల్లో కొందరు ఫ్యాక్టరీలోకి దూసుకెళ్ళి అక్కడ నిలిపి ఉన్న కంపెనీ కార్లను మూకుమ్ముడి బలంతో తిరగవేయడం, కార్యాలయంలో వస్తువులను ధ్వంసం చేయడం ప్రారంభించారని అధికారులు తెలిపారు. కంపెనీకి సమీపంలో ఉన్న హాంగ్-గ్జియావో…

పునరద్భవిస్తున్న … … -(3)

(ఈ భాగాన్ని ఆగష్టు 16 న ప్రచురించినప్పటికీ ఆ లింక్ పని చేయనందున మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. -విశేఖర్) పెట్టుబడిని కట్టడి చేసేదిపెట్టుబడే పెట్టుబడిసంచయానికి సంబంధించిన చైనా నమూనా కొన్ని నిర్ధిష్ట అంశాలపైన ఆధారపడి ఉంది.అతి పెద్ద కార్మిక శక్తిని నిర్ధాక్షిణ్యంగా దోపిడి చేయడం; సహజ వనరులనుపెద్ద ఎత్తున కొల్లగొట్టి తద్వారా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించడం; కీలకమైన పెట్టుబడిదారీ దేశాల మార్కెట్లకు విస్తృతంగా ఎగుమతులు చేయడంపైఆధారపడిన ఆర్ధిక వృద్ధి నమూనా కలిగి ఉండడం… ఇవి ఆ…

పునరుద్భవిస్తున్న కార్మికవర్గం – చైనా విప్లవం భవిష్యత్తు -(2)

(ఈ భాగాన్ని ఆగష్టు 12న పోస్ట్ చేసినప్పటికీ ఆ లింక్ పని చేయనందున మళ్లీ పోస్ట్ చేస్తున్నాను. -విశేఖర్) ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్ధలలో ఉపాధి పొందుతున్నవారిలో అనేకమంది “పాత కార్మికుల” పిల్లలు; లేదా పాత కార్మికులతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్నవారు; లేదా పాత కార్మికుల నివాసాలకు పక్కనో దగ్గర్లోనో నివసిస్తున్నవారు. ఆ విధంగా ప్రస్తుతం ప్రభుత్వరంగ పరిశ్రమలలో పని చేస్తున్నవారు పాత కార్మికులు జరిపిన ఉద్యమాలతోనూ, వారి రాజకీయ అనుభవాల తోనూ ప్రభావితమై ఉన్నారు.…

సొరంగం చివర వెలుగును చూస్తున్న యూరో -కార్టూన్

అమెరికా ఆధిపత్యానికి దీటుగా ఎదగాలన్న ఆకాంక్షతో యూరప్ దేశాలు యూరోపియన్ యూనియన్ (ఇ.యు) ఏర్పాటు చేసుకున్నాయి. డాలర్ ఆధిపత్యాన్ని నిలువరించి పైచేయి సాధించాలన్న కోరికతో ఉమ్మడి కరెన్సీ ‘యూరో’ అవి ఏర్పాటు చేసుకున్నాయి. ఇ.యులో 25 దేశాలను ఆకర్షించగలిగినా, యూరోజోన్ లోకి 17 దేశాలను ఆకర్షితులయ్యాయి. యూరో జోన్ వలన చాలా వరకు దేశీయ ద్రవ్య, ఆర్ధిక, పన్నుల చట్టాలను రద్దు చేసుకోవడంతో జర్మనీ, ఫ్రాన్సు లాంటి పెద్ద దేశాలే వీటినుండి లబ్ది పొందగలుగుతున్నాయి. కాని బలహీన…

శతాబ్దాల మర్రిమాను నిలువునా కూలినట్లు! -ఫొటో

గుండెలు అవిసేలా రోదిస్తున్న ఈ పెద్దాయనకి స్వాంతన ఎవరు ఇవ్వగలరు? శతాబ్దాల పాటు ఊరంతటికీ నీడనిచ్చిన మర్రిమాను నిలువునా కూలినట్లున్న ఈ దృశ్యం చూపరులను కంట తడిపెట్టేలా ఉంది. ఏం జరిగిందో తెలియని పాప అమాకపు చూపులు మరింతగా హృదయాలను పిండేస్తున్నాయి. తాతో, తండ్రో, మామయ్యో ఇంకెవరో గాని ఈయనని ఓదార్చడానికి కాసింత అవకాశం దొరికితే బాగుడ్ను. వెల్లూరు జిల్లాలోని అరక్కోణం వద్ద కిల్కండిగై వద్ద ఆగి ఉన్న పాసెంజర్ రైలును 90 కి.మీ వేగంతో వస్తున్న…

భాష, సోషలిజం, ప్రజాస్వామ్యం – పరస్పర సంబంధాలు -2

కనపడేవీ, కనపడనివీ అన్నీ గ్రహించాలి వ్యవస్ధల మార్పులు మనిషి కంటికి కనపడే పరిధిలోనివి కావు. వ్యవసాయంలో ఒక పంట కాలం కొద్ది నెలలు ఉంటుంది. దుక్కు దున్నడం, నాట్లు వేయడం, పంటకు రావడం, కోత కోసి పంట అమ్ముడుబోయి డబ్బులు చేతికి రావడం వరకూ మన కళ్లెదుటే జరిగే పరిణామం. కనుక మనిషి విత్తుదశనుండి పంట చేతికి వచ్చేవరకు జరిగే పరిణామాలను గుర్తించగలుగుతాడు. అలాగే మనిషి పుట్టుక, పెరుదల, చదువు సంధ్యలు, పెళ్ళి, పునరుత్పత్తి, సంతానం సాకడం,…

కాశ్మీరులో 2,156 గుర్తు తెలియని సమాధులు, డి.ఎన్.ఎ సేకరణకు నిర్ణయం

గుర్తు తెలియని సమాధుల్లో పాతి పెట్టిన 2,156 శవాలను గుర్తించాలని జమ్మూ కాశ్మీరు “రాష్ట్ర మానవ హక్కుల సంఘం” సిఫారసు చేసింది. మానవ హక్కుల సంఘానికి చెందిన పోలీసు విభాగం ఈ సమాధులను గత నెలలో గుర్తించడం సంచలనం కలిగించింది. కాశ్మీరులో భారత భద్రతా బలగాలు దేశ రక్షణ పేరుతోనో, తీవ్రవాదం పేరుతోనో కాశ్మీరు యువకులను అనేక వేలమందిని మాయం చేశాయని చాలా కాలం నుండి కాశ్మీరు ప్రజలు ఆరోపిస్తున్నారు. 2001 జనాభా లెక్కల సేకరణ అనంతరం…

దక్షిణ చైనా సముద్రంలో ఇండియా ప్రాజెక్టు రాజకీయంగా రెచ్చగొట్టడమే -చైనా

చైనా ప్రభుత్వ ప్రతినిధి నుండి ఇండియాకు హెచ్చరిక అందిన మరుసటి రోజే మరొకసారి పరోక్షంగా హెచ్చరిక జారీ అయింది. ఈ సారి చైనా ప్రభుత్వం నడిపే “గ్లోబల్ టైమ్స్” పత్రిక, దక్షిణ చైనా సముద్రంలో ఇండియా కంపెనీలు ప్రాజెక్టులు చేపట్టడం అంటే చైనాను రాజకీయంగా రెచ్చగొట్టడమేనని పేర్కొన్నది. భారత కంపెనీ ఒ.ఎన్.జి.సి, దక్షిణ చైనా సముద్రంలో చమురు, సహజవాయువుల అన్వేషణ ప్రాజెక్టును చేపట్టకుండా సాధ్యమైన “అన్ని సాధనాలనూ’ వినియోగించాలని చైనా ప్రభుత్వాన్ని గ్లోబల్ టైమ్స్ పత్రిక కోరింది.…

ఇదీ ఇండియా -యాహూ ఫొటోలు పార్ట్ 2

యాహూ వార్తల వెబ్ సైట్ దేశంలోని ఫోటో గ్రాఫర్ల నుండి ‘ఇదీ ఇండియా’ అంశంపై ఫోటోలను ఆహ్వానించింది. వాటిలో కొన్ని ఎన్నుకుని ప్రచురించింది. బ్లాక్ అండ్ వైట్ ధీమ్ లో ఉన్న ఆ ఫోటోలే ఇక్కడ కూడా. — —

దక్షిణ చైనా సముద్రంలో ఇండియా చైనాల ఢీ

దక్షిణ చైనా సముద్రంలో భారత్ చైనాల మధ్య వైరం రగులుకుంటోంది. వియత్నాం దేశం ఆహ్వానం మేరకు దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్ వెలికి తీతకు ఒ.ఎన్.జి.సి ప్రయత్నాలు చేయడాని వ్యతిరేకంగా చైనా ప్రభుత్వం ఇండియాను హెచ్చరించింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్, సహజ వాయువుల వెతుకులాటకు ఇండియా కంపెనీలు దిగడాన్ని తాము వ్యతిరేకిస్తామని చైనా గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. భారత విదేశాంగ మంత్రి వియత్నాం సందర్శించనున్న నేపధ్యంలో దక్షిణ చైనా సముద్రంలో వియత్నాంతో…

భాష, సోషలిజం, ప్రజాస్వామ్యం – పరస్పర సంబంధాలు -1

సోషలిజం, ప్రజాస్వామ్యంల మధ్య సంబంధాల గురించి నేను గతంలో రాసిన కొన్ని అంశాలపై కొంతమంది బ్లాగర్లు వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పటికే పలుమార్లు, పలుచోట్ల వారి సంస్కార రాహిత్యాన్ని బైట పెట్టుకున్నారు గనక వారి వ్యంగ్యాన్ని పక్కనబెడుతున్నా. వారి విమర్శనాంశాన్ని మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటూ దానికి మరికొంత వివరణ ఇవ్వడానికి ఈ టపాని ఉద్దేశించాను. ఈ అంశంపైన ఎక్కువమంది అయోమయానికి గురయ్యే అవకాశం ఉన్నందున ఈ ప్రయత్నం చేస్తున్నాను. కమ్యూనిస్టు పదజాలం ఏ యిజానికీ సొంతం…

గ్రీసు రుణ సంక్షోభం -కార్టూన్

గ్రీస్ ప్రధాని జార్జి పపాండ్రూ: ఈ ఒక్కటే కత్తిరిస్తే అంతా అయిపోయినట్లే  కార్టూనిస్టు: అమోరిమ్, బ్రెజిల్ —————                   —————–                          ————–                       —————— గ్రీసు రుణ సంక్షోభం గత సంవత్సరం ప్రారంభంలో తలెత్తడంతో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు దానికి 110 బిలియన్ యూరోల బెయిలౌట్ మంజూరు చేసాయి. బెయిలౌట్ ఇస్తూ విషమ షరతులు విధించాయి. షరతుల ఫలితంగా గ్రీసు ప్రధాని గత సంవత్సర కాలంగా అనేక విడతలుగా పొదుపు చర్యలు అమలు చేశాడు. కార్మికులు, ఉద్యోగుల వేతనాలు, ఫెన్షన్లు,…

మీపై దాడులకు మేమెలా బాధ్యులం? అమెరికాకి పాక్ సూటి ప్రశ్న

అమెరికా హెచ్చరికను పాకిస్ధాన్ తిప్పికొట్టింది. హెచ్చరికను స్వీకరించడానికి పాక్ సైనికాధికారులు నిరాకరించారు. మంగళవారం నుండి బుధవారం వరకూ కాబుల్ పట్టణ నడిబొడ్డున అమెరికా ఎంబసీపై తాలిబాన్ మిలిటెంట్లు చేసిన రాకెట్ దాడితో అమెరికా నేతృత్వంలోని నాటో అధికారులు తత్తరపాటుకి గురయ్యారు. ఆఫ్ఘన్ దురాక్రమణ తర్వాత ఇంతవరకూ మిలిటెంట్లు ఎన్నడూ కాబూల్ పై అంతసేపు దాడి చేయలేదని రాయిటర్స్ సంస్ధ పేర్కొంది. పాకిస్ధాన్ భూభాగంలో స్ధావరాలు ఏర్పరుచుకున్న హక్కాని మిలిటెంట్ల గ్రూపు ఈ దాడికి కారణమని అనుమానిస్తున్న అమెరికా…