మంత్రుల మధ్య “నోట్”ల రూపంలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రధానమంత్రి కార్యాలయానికి వివిధ మంత్రులు పంపిన “నోట్”లు ఇప్పుడు 2జి కుంభకోణంలో కొత్త పాత్రధారులను వెలికి తెస్తున్నాయి. ఆర్.టి.ఐ చట్టాన్ని ఉపయోగిస్తూ ఆర్.టి.ఐ కార్యకర్తలు ఈ నోట్ లను వెల్లడి చేయడంతో అప్పటి ఆర్ధిక మంత్రి పి.చిదంబరం, ప్రధాని మన్మోహన్ లు కూడా తెలిసీ 2జి కుంభకోణాన్ని అడ్డుకోలేదని వెల్లడయ్యింది.
ఎ.రాజా, దయానిధి మారన్ లు అడ్డంగా అవినీతికి పాల్పడుతుంటే, అడ్డుకుని దేశ సంపదను కాపాడవలసింది పోయి, మౌనంగా ఉండి ప్రోత్సహించారు. పి.చిదంబరం రెండాకులు ఎక్కువే చదివినట్లు ప్రణబ్ నోట్ ద్వారా ఆర్ధం అవుతోంది.
కార్టూనిస్టు: సురేంద్ర, ది హిందూ
—
