అరవై ఏళ్ళనుండి ఇజ్రాయెల్ రాజ్య జాత్యహంకార ప్రభుత్వం కింద నలుగుతున్న పాలస్తీనా ప్రజలు విముక్తి పొందకుండా అమెరికా, యూరప్ లు కాపలా కాస్తూ వచ్చాయి. జాత్యహంకార పదఘట్టనల కింద నలుగుతున్న పాలస్తీనా ప్రజల తరపున ఇజ్రాయెల్, అమెరికాలతో కుమ్మకయిన వెస్ట్ బ్యాంక్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ పాలస్తీనా దేశం ఏర్పాటును ఏక పక్షంగా సమితి సమావేశాల్లో ప్రకటిస్తానని కొన్ని నెలలుగా చెబుతూ వచ్చాడు. సేవకుడు ఎంత సేవ చేసినా యజమానులకు తృప్తి దొరకదు. అబ్బాస్ ఎన్నిమార్లు ఇజ్రాయెల్ కొమ్ము కాసినా ఆయన కోరుకున్న బానిస రాజ్యానికి కూడా ఇజ్రాయెల్, అమెరికాలు అంగీకరించలేదు.
తనకూ పౌరుషం ఉందని చూపుకోవడానికా అన్నట్లు అబ్బాస్ సమితిలో పాలస్తీనా దేశ ప్రకటన చేస్తే మద్దతివ్వడానికి మెజారిటీ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ భయంతోనే అమెరికా హడావుడిగా పాలస్తీనా దేశ ప్రకటనకు ఆమోదం దొరికినట్లయితే తాను ఆ నిర్ణయాన్ని వీటో చేస్తానని ప్రకటించింది. మధ్య ప్రాచ్యం లేదా పశ్చిమాసియాలో తన ప్రయోజనాలను ఇజ్రాయెల్ కాపాడుతున్నందుకు కృతజ్ఞతగా అమెరికా వీటో అస్త్రం బైటికి తీస్తోంది.
కార్టూనిస్టు: విక్టర్ నీటో, వెనిజులా
—
