అమెరికా ఆధిపత్యానికి దీటుగా ఎదగాలన్న ఆకాంక్షతో యూరప్ దేశాలు యూరోపియన్ యూనియన్ (ఇ.యు) ఏర్పాటు చేసుకున్నాయి. డాలర్ ఆధిపత్యాన్ని నిలువరించి పైచేయి సాధించాలన్న కోరికతో ఉమ్మడి కరెన్సీ ‘యూరో’ అవి ఏర్పాటు చేసుకున్నాయి. ఇ.యులో 25 దేశాలను ఆకర్షించగలిగినా, యూరోజోన్ లోకి 17 దేశాలను ఆకర్షితులయ్యాయి. యూరో జోన్ వలన చాలా వరకు దేశీయ ద్రవ్య, ఆర్ధిక, పన్నుల చట్టాలను రద్దు చేసుకోవడంతో జర్మనీ, ఫ్రాన్సు లాంటి పెద్ద దేశాలే వీటినుండి లబ్ది పొందగలుగుతున్నాయి. కాని బలహీన దేశాలు మరింత సంక్షోభంలో కూరుకు పోయాయి.
గ్రీసు సంక్షోభం సమసి పోవడానికి, గ్రీసుకు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు 110 బిలియన్ యూరోల బెయిలౌట్ మంజూరు చేసినా అది గ్రీసు అప్పుల భారాన్ని పెంచి ప్రజల ఆర్ధిక జవసత్వాలను మరింత క్షీణింప జేసింది తప్ప ఏ మేలూ జరగలేదు. ఫలితంగా గ్రీసు తన అప్పు పైన దివాళా తీసే పరిస్ధితి నెలకొంది. ఆలోగానే గ్రీసు యూరోజోన్ నుండి బైటికి రావొచ్చన్న ఊహాగానాలు కూదా మొదలైనాయి. అదే జరిగితే అది అంతిమంగా యూరోజోన్ అంతానికి దారితీయవచ్చు.
అదిగో వెలుగు! అదే సొరంగం చివర. ఇక మనం బయట పడ్డట్టే.
–
కార్టూనిస్టు: ఎనెకో లాస్ హెరాస్, కారకాస్, స్పెయిన్
—
