గ్రీస్ ప్రధాని జార్జి పపాండ్రూ: ఈ ఒక్కటే కత్తిరిస్తే అంతా అయిపోయినట్లే
కార్టూనిస్టు: అమోరిమ్, బ్రెజిల్
————— —————– ————– ——————
గ్రీసు రుణ సంక్షోభం గత సంవత్సరం ప్రారంభంలో తలెత్తడంతో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు దానికి 110 బిలియన్ యూరోల బెయిలౌట్ మంజూరు చేసాయి. బెయిలౌట్ ఇస్తూ విషమ షరతులు విధించాయి. షరతుల ఫలితంగా గ్రీసు ప్రధాని గత సంవత్సర కాలంగా అనేక విడతలుగా పొదుపు చర్యలు అమలు చేశాడు. కార్మికులు, ఉద్యోగుల వేతనాలు, ఫెన్షన్లు, వృద్ధాప్య పింఛన్లు, వృద్ధుల ఆరోగ్య భీమా, వివిధ సంక్షేమ సదుపాయాలు అన్నింటిలో కోత పెట్టాడు. అంత చేసినా బడ్జెట్ లోటు లక్ష్యం సాధించలేదని ఈ సంవత్సరం ప్రారంభంలో మళ్లీ మార్కెట్ల పేరు చెప్పి మరిన్ని పొదుపు చర్యలను ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసు నెత్తిన రుద్దాయి. పొదుపు చర్యలను ప్రజలపైన అమలు చేస్తున్నారే తప్ప సంక్షొభానికి కారణమైన బ్యాంకులు, ఇన్సూరెన్సు సంస్ధలు, ఇతర కంపెనీలపైన ఒక్క పైసా విధించడం లేదు.
గత సంవత్సరంతోనే గోళ్లూడిపోయిన ప్రజల నెత్తిన ఇటీవలే ప్రధాని పపాండ్రూ మరొక విడత పొదుపు చర్యలను ప్రకటించాడు. ప్రజలింకా ఏమాత్రం భరించలేని స్ధితిలో ఉన్నప్పటికీ ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల ఒత్తిడితో గ్రీసు పాలకవర్గాలు తమ ప్రజల పట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఇచ్చిన బెయిలౌట్ సొమ్ము మళ్లీ అంతిమంగా ఆ బెయిలౌట్ ఇస్తున్న జర్మనీ, ఫ్రాన్సులలోని ద్రవ్య కంపెనీలకే తరలివెళ్ళడం ఇందులో కొసమెరుపు.
