
వికీలీక్స్ ద్వారా వెల్లడయిన కేబుల్ విషయాలను మంగళవారం దేశంలోని పత్రికలన్నీ వార్తలు ప్రచురించడంతో వాటికి మాయావతి స్పందిస్తూ జులియన్ పై దాడి చేసింది. కేబుల్ రాసింది అమెరికా రాయబారి, ఉద్దేశింది అమెరికా ప్రభుత్వాన్ని కాగా కేబుల్స్ ను వెల్లడించిన తనని టార్గెట్ చేయడం ఏమిటని జులియన్ తన స్పందనలో ప్రశ్నించాడు. జులియన్ పిచ్చోడనీ, అతని దేశంవారు ఆయనని పిచ్చాసుపత్రిలో చేర్చాలనీ, ఖాళీ లేకుణ్నట్లయితే ఆగ్రా పిచ్చాసుపత్రిలో చేరుస్తామని మాయావతి మంగళవారం విలేఖరులతో చెప్పింది. దానికి జులియన్ అస్సాంజ్ లండన్ నుండి ప్రతిస్పందించాడు.
ఒక పత్రికా ప్రకటనలో అస్సాంజ్ తన స్పందనను తెలిపాడు. “మాయావతి వివేకపూరిత ఆలోచనా పద్ధతిని మోసం చేసింది. ప్రశ్నం ఏమిటంటే ఆమె దళితులను కూడా ఇలానే మోసం చేస్తున్నదా? లీక్ అయిన డాక్యుమెంట్లు అమెరికా రాయబారులు రాసినవేననడంలో ఎట్టి సందేహమూ లేదు. అమెరికా రాయబార కార్యాలయం నుండి వచ్చిన అధికారిక డాక్యుమెంట్లవి. ఇవి అధికారికమని ప్రపంచవ్యాపితంగా రుజువయ్యాయి. డాక్యుమెంట్లను లీక్ చేస్తున్నందుకు అమెరికా ప్రభుత్వమే మా కార్యకర్తలను వెంటాడి వేధించడాని బట్టి కూడా ఆ విషయం అర్ధం అవుతోంది” అని జులియన్ ప్రకటనలో పేర్కొన్నాడు.
“అమెరికా రాయబారులు తమ ప్రభుత్వంతో తాము జరిపిన ప్రవేటు సంభాషణలలో ఆరోపణలు చేశారు. ఈ సంభాషణలలో ఉన అంశాలపట్ల ముఖ్యమంత్రి మాయావతికి అభ్యంతరం ఉన్నట్లయితే, ఆమె హిల్లరీ క్లింటన్ తో తలపడవలసి ఉంది. మాయావతి తన తప్పును గుర్తించి క్షమాపణలు చెప్పాలి” అని జులియన్ పేర్కొన్నాడు. “అలా చేయడంలో ఆమె విఫలమయితే, ఇంగ్లండ్‌కు తన ప్రవేట్ జెట్ ను లండన్ లో ఉంటున్న నావద్దకు పంపవచ్చు. గత 272 రోజులుగా నేనిక్కడ నా ఇష్టానికి విరుద్ధంగా ఇంటిలో నిర్భధించారు. నాకు మానసిక శరణాలయంలో ఆశ్రయం కల్పించదలుచుకుంటే నేను దానిని ఆహ్వానిస్తున్నాను. నేను ఇష్టపడే ఇండియాలో శరణు దొరకడం నాకింకా సంతోషం కలిస్తుంది. దానికి ప్రతిఫలంగా లండన్ నుండి అత్యంత గొప్ప చెప్పుల జతను మాయావతికి సమర్పించుకుంటాను” అని జులియన్ తెలిపాడు.
ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి జులియన్ని టార్గెట్ చేయడానికీ, హిల్లరీని టార్గెట్ చేయడానికీ తేడా తెలియదని భావించలేము. తేడా గ్రహించినందునే హిల్లరీని కాకుండా జులియన్ ని టార్గెట్ చేసి ఉండవచ్చు. భారత దేశ పాలకులు వారు దళితులైనా, అగ్ర కులాల వారైనా అమెరికా తదితర పశ్చిమ రాజ్యాల ప్రయోజనాలను నెరవేర్చడం తప్ప సొంత ప్రజలకు సేవ చేయాలని భావించడం లేదని ఇప్పటికే చాలా మంది రుజువు చేశారు. బహుజనుల కోసం ఏర్పడిన పార్టీగా అవతరంచిన బి.ఎస్.పి, మాయావతి హయాంలో అంతిమంగా సర్వజనుల పార్టీగా రూపు మార్చుకుంది. ఇక దళితులకు ప్రాతినిధ్యం వహించే పరిస్ధితి బి.ఎస్.పి కోల్పోయిందని చెప్పవచ్చు.

“ప్రశ్న ఏమిటంటే ఆమె దళితులను కూడా ఇలానే మోసం చేస్తున్నదా?”ఈ ఒక్క మాట చాలు, సిగ్గు ఉన్నవాడు చచ్చిపోవడానికి.
ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షురాలి విమర్శను కూడా పరిశీలించి దానికి తగ్గ సమాధానం చెప్పాడం అభినంచదగ్గ విషయం.
“ప్రశ్న ఏమిటంటే ఆమె దళితులను కూడా ఇలానే మోసం చేస్తున్నదా?” భేషుగ్గా.. చేస్తోంది. చేస్తూపోతుంది కూడా.
సినీ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా రాజకీయ రంగంలో ఉన్న మహిళలకు కూడా ఈ చెప్పుల పట్ల, చీరల పట్ల ఈ వెర్రి వ్యామోహం ఏమిటో? జయలలిత, మాయావతి వీరిద్దరూ అగ్రకుల, దళిత కులాల్లోనే పుట్టి ఉండవచ్చు. కానీ, సంపద పట్ల, నగల పట్ల, చీరలపట్ల, చివరకు చెప్పుల పట్ల కూడా ఈ ఉన్మాద ప్రదర్శనలో కులం కనిపించడంలేదు… చలం గారు 70 సంవత్సరాల క్రితం నవీన స్త్రీకి ఆత్మలేకపోవడమే విషాదం అని చెప్పారు. ఆయన ఆనాడు ఏ కోణంలోంచి ఈ వ్యాఖ్య చేసినప్పటికీ అది ఈనాటికీ వాస్తవంగానే ఉంటోంది. బూర్జువాలకు జెండర్ తేడా ఉంటే కదా.
బూర్జువా దోపిడీకి జెండర్ తేడా ఉండదు కదా అంటే ఇంకా అర్థవంతంగా ఉంటుంది.