లిబియా ఆయిల్ వనరుల్ని పంచుకోవడానికి పశ్చిమ రాజ్యాల ఆయిల్ కంపెనీలు ఇప్పుడు లిబియాలో చర్చల్లో మునిగితేలుతున్నాయి. తిరుగుబాటు ప్రారంభమైందని ప్రపంచానికి పూర్తిగా తెలియక ముందే తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించిన ఫ్రాన్సుకు పెద్ద భాగం లభించింది. 34 శాతం ఆయిల్, గ్యాస్ వనరుల్ని ఫ్రెంచి కంపెనీ టోటల్ కి అప్పగిస్తున్నట్లుగా లిబియా నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ ప్రకటించింది. ఇంకా అమెరికా (ఎక్సాన్ మొబిల్), ఇటలీ (ఇ.ఎన్.ఐ), రష్యా (గాజ్‌ప్రోమ్), బ్రిటన్ (బిపి), హాలండ్ (రాయల్ డచ్ షెల్), స్పెయిన్ (రెస్పోల్) కంపెనీలు తమ జాకీల్ని సిద్ధం చేయడానికి తయారవుతున్నాయి. యుద్ధంలో ఆయిల్ రిఫైనరీలు, బావులు ధ్వంసం కాలేదని తెలియడంతో ఆయిల్ కంపెనీలు సంతోషపడుతున్నాయి. ఆయిల్ కంపెనీలు పంచుకుంటున్న లిబియా పై కార్టూన్:
కార్టూనిస్టు: స్కాట్, నెదర్లాండ్స్
–
