ఎట్టకేలకు స్వాతంత్ర్యం పొందిన లిబియా? -కార్టూన్


ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా దేశాల నాయకత్వంలో నాటో వాయు సేనలు లిబియా గగన తలంపై వీరవిహారం చేస్తూ లిబియా పౌరులను బాంబింగ్‌తో రక్షిస్తూ ముందు నడవగా ఇన్నాళ్లూ అమెరికాలో శి(ర)క్షణ పొందిన లిబియా స్వతంత్ర పిపాసులు లిబియా ప్రజల స్వేచ్ఛా వాయువుల కోసం తమ జీవితాల్ని ధారపోసి గడ్డాఫీ ప్రభుత్వంపై తిరుగుబాటును పరిపూర్తి కావించారు. అమెరికా, ఇటలీ, ఫ్రాన్సు, బ్రిటన్ ఆయిల్ కంపెనీలు నూతనంగా సంపాదించిన స్వేచ్ఛతో నూనె పొలాల్లోకి దుమికి ఆయిలోత్సాహంతో ఆనంద నృత్యం చేస్తున్నాయి. ఆయిల్‌ని బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పిన ట్రాన్సిషనల్ నేషనల్ కౌన్సిల్ పెద్దలు తమ జేబుల్ని నింపే కమీషన్ల లెక్కలు వేసుకుంటున్నారు. అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, ఇటలీ ల కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వని గడ్డాఫీని పడదోసి తొత్తు ప్రభుత్వాన్ని నిలబెట్టి తమకు కావలసిన స్వేచ్ఛను లాక్కున్నాయి. యుద్ధంలో గెలుపోటములతో సంబంధం లేని లిబియా సామాన్య ప్రజ ధ్వంసమయిన ఇళ్ళు వాకిళ్ళ శిధిలాలను ఏరుకుని కూర్చుకుంటున్నారు ఎలా ఉంటుందో తెలియని భవిష్యత్తును తలుచుకుంటూ.

Liya free at last

లిబియా స్వేచ్ఛా దేశమహో!

 

వ్యాఖ్యానించండి