ధియేటర్ పేలుడు కేసులో హిందూ సంస్ధ సబ్యులకు 10 సం.ల జైలు శిక్ష


హిందూత్వ సంస్ధ ‘సనాతన్ సంస్ధ’ తో సంబంధాలున్నాయని భావిస్తున్న ఇద్దరు వ్యక్తులకు సినిమా ధియేటర్ లో బాంబులు పెట్టి పేల్చారన్న నేరానికి కోర్టు పది సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించింది. 2008లో జరిగిన మూడు ధియేటర్ల పేలుడు సంఘటనలలో రెండింటిలో నిందుతులు పాలు పంచుకున్నట్లుగా రుజువయ్యింది. పేలుళ్ళలో ఏడుగురు గాయపడ్డారు. నిందితులకు నేర చరిత్ర లేకపోవడం, మధ్య తరగతికి చెందినవారు కావడంతో తక్కువ శిక్షతొ సరిపెడుతున్నట్లు కోర్టు తెలిపింది.

మహారాష్ట్ర ప్రభుత్వ యాంటి టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులు ఈ కేసును పరిశొధించారు. ఆ సంస్ధ ప్రకారం, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన రమేష్ హనుమంత్ గడ్కారి (53), సనాతన్ సంస్ధ కి చెందిన సేవక్ లతో పరిచయం ఏర్పడ్డాక సంస్ధకు ఉన్న పాన్వేల్ ఆశ్రమంలో పూర్తికాలం సభ్యుడయ్యాడు. సహ నిందితుడు విక్రం వినయ్ భావే (29) కు బాంబు తయారీలొ శిక్షణ ఇచ్చాడు. అతని నిధుల్ని ఆపరేషన్ లో వాడుకున్నాడు. భావే ఆశ్రమంలో ఒక చిన్న దాడి కేసులో నిందితుడు. అతని ఇంటినుండి పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మొదట కొత్త ముంబై లోని పాన్వేల్ లో సినిమా ధియేటర్ లో బాంబు పెట్టారు. అప్పుడక్కడ ‘జోధా అక్బర్’ సినిమా ప్రదర్శితమవుతోంది. రెండో సారి వశి ఆడిటోరియంలో తక్కుత తీవ్రత గల పేలుడు పధార్ధాలను వశపరుచుకున్నారు. మూడవసారి, ఠాణే ఆడిటోరియంలో పేలుడు సంభవించింది. రెండు ఆడిటోరియంలలోనూ సంఘటన జరిగినపుడు ‘ఆమ్‌హీ పాంచ్‌పుటే’ నాటకం ప్రదర్శితమవుతోంది. సినిమాలోనూ, నాటకంలోనూ హిందూ దేవతలను చెడుగా చిత్రీకరించారని నిందితులు భావించారని పోలీసులు తెలిపారు. పాన్వేల్ ఘటనలో నిందుతులు దోషులుగా తేలలేదు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సాలియాన్ కఠిన శిక్ష విధించాలని కోరింది. “కొంతమంది అసంతృప్త వ్యక్తులు నిరర్ధక సెంటిమెంట్లతో మతం పేరుతో గానీ, దేవుడి పేరుతోగానీ ప్రజా జీవితంలో అలజడులు సృష్టిస్తున్నారు. ఇది తరచుగా జరుగుతోంది. మనం వీరి దయతో బతకవలసి వస్తోంది. వీరు అమాయకులను చంపుతూ, గాయపరుస్తున్నారు. వారి సిద్ధాంతం ఉన్మాదాలు తీవ్ర స్ధాయిలో ఉంటున్నాయి. నా ప్రకారం వీరు టెర్రరిస్టులే. ఇటువంటి వారిని నిరుత్సాహపరిచే విధంగా కోర్టు శిక్ష విధించాలి” అని రోహిణి వాధించింది. అయితే కోర్టు నిందితులను టెర్రరిస్టులుగా గుర్తించడానికి నిరాకరించింది.

డిఫెన్సు లాయర్ క్షమాభిక్షకు అప్పీలు చేసినప్పటికీ దానిని కోర్టు తిరస్కరించింది. ఉదారంగా వ్యవహరించాలని కోరుతూ డిఫెన్స్ లాయర్ సంజీవ్  ఇద్దరు వ్యక్తులూ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినవారనీ, నేర చరిత్ర లేదనీ, మానవతావాద దృక్పధంతో తక్కువ శిక్షతొ సరిపెట్టాలని కోరాడు. తద్వారా నిందితులు మారడానికి అవకాశం ఇవ్వాలనీ కోరాడు. వారి కుటుంబాలు ఇప్పటికే నరకయాతన అనుభవించాయనీ తెలిపాడు. గడ్కారీకి సంవత్సరం వయసుగల కుమార్తె ఉండగా, విక్రం కి ముగ్గురు పెళ్ళికావలసిన సోదరిలు ఉన్నారని తెలిపాడు.

వ్యాఖ్యానించండి