నాటో బాంబుదాడులు తోడు రాగా లిబియా తిరుగుబాటుదారులు రాజధాని ట్రిపోలిలో ప్రవేశించారు. ట్రిపోలీ ప్రజలు ఆనందోత్సాహాలతో వారికి స్వాగతాలు పలికారని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు బాకాలుదాయి. తిరుగుబాటుదారుల నాయకత్వ కమిటీ ‘ట్రాన్సిషనల్ నేషనల్ కౌన్సిల్’ గడ్డాఫీ ఇద్దరు కొడుకులనూ అరెస్టు చేశామని ప్రకటించింది. వారాల ప్రకటించిన గంటలలోపే గడ్డాఫీ కుమారుడు, ఎలైట్ ఫోర్స్ నాయకుడు సైఫ్ ఇస్లాం తిరిగి ట్రిపోలిలోనే ప్రత్యక్షమయ్యాడు, మద్దతుదారులకు విక్టరీ సిగ్నల్ చూపుతూ. ఇదేలా సాధ్యం? అరెస్టయినవాడు నవ్వుతూ, చేతులూపుతూ ఎలా ప్రత్యక్షమైనట్లు? ట్రిపోలీ నిజంగానే ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాలు మేపిన తిరుగుబాటుదారుల వశం అయ్యిందా?
—
