‘శంఖంలో పోస్తే కాని తీర్ధం కాద’ని సామెత! అది తెలుసుకున్నాడు కనకనే దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రతి పధకానికి ముందు రాజీవ్ అనో, ఇందిరా అనో తగిలించాడు. సోనియా, రాహుల్ లవరకూ అది సాగేదేమో, ఇంతలో ఆయన పరమపదించారు. ఆయన పుత్రుడికి నడమంత్రపు సిరితో కన్నూ మిన్నూ కానక భజన మానుకున్నాడు. ఫలితం చూస్తూనే ఉన్నాం.
అవినీతి భరతం పట్టడానికి జన్ లోక్ పాల్ బిల్లుని తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టాడు, అన్నా హజారే. అది నచ్చని కాంగ్రెస్ మంత్రివర్యులు ఇచిన హామీల్ని డస్ట్‌బిన్ లోకి తోసి తమ లోక్‌పాల్ బిల్లునే లోక్ సభలో ప్రవేశపెట్టారు. ప్రధాని, అన్నాకి రాసిన లేఖలో పేర్కొన్నట్లు పౌర సమాజ సభ్యులు పదే పదే జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో పెట్టమని శతపోరినా మంత్రివర్యుల చెవికి ఆనడం లేదు. అందుకే అన్నా హజారే తరుణోపాయం ఆలోచించాలి. ఆయన కొంచెం తెలివిని ఉపయోగిస్తే…!