అన్నాకి గురువైనందుకు మహాత్మాగాంధి సైతం జైల్లోకే -కార్టూన్


కేంద్ర ప్రభుత్వం అన్నా హజారే అంటేనే ఉలిక్కిపడుతోంది. దీక్ష మొదలు కాక ముందే అన్నా బృందాన్ని అరెస్టు చేసి చేతులు కాల్చుకుంది. నాలిక్కరుచుకుని విడుదల చేయబోయి అక్కడా దెబ్బతిన్నది. మరోపక్క అన్నా హజారే తన అరెస్టునే ఆందోలనకు అనువుగా మార్చుకోగలిగాడు. అన్నా బృందం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ఈ కార్టూన్‌ని భారతీయ కార్టూనిస్టు మంజుల్ గీసింది.

Gandhi too jailed

గాంధీ విగ్రహాన్ని జైలుకి తరలిస్తున్న పోలీసులు

“అన్నా హజారేకి ఆయనే గురువని ప్రభుత్వానికి తెలిసిందట మరి!”

వ్యాఖ్యానించండి