లండన్ పోలీసుల దృష్టిలో ఫేస్ బుక్, ట్విట్టర్ లు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ళు. బ్రిటన్‌లో ప్రజాస్వామ్యం ఉంది అని ప్రపంచం భావిస్తోంది కనుక ఆగారు కానీ ఈ పాటికి ఈ ఇద్దరు నేరగాళ్ళని లండన్ పోలీసులు పబ్లిక్ లో కనపడకుండా చేసేవారే. జోర్డాన్ బ్లాక్‌షా (20 సం.లు), సట్‌క్లిఫ్ కీనన్ (22 సం.లు) అనే ఇద్దరు యువకులకి లండన్ మెజిస్ట్రేట్ కోర్టు నాలుగు సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సందేశాలు పోస్ట్ చేయడం ద్వారా లండన్ అల్లర్లను రెచ్చగొట్టారని వారిపై మోపిన అభియోగం.
వీళ్ళిద్దరూ స్వయంగా ఏ అల్లరిలోనూ పాల్గొనలేదు. షాపుల్లో లూటీ చేయడానికి స్ధానిక మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ వద్దకి రమ్మని బ్లాక్‌షా తనకు తెలిసినవారందర్నీ రమ్మని కోరాడని కేసు బనాయించారు. పోలీసులు ఫేస్ బుక్ తిరగేస్తుంటే బ్లాక్‌షా నెలకొల్పిన “స్మాష్ డౌన్ ఇన్ నార్త్‌విచ్ టౌన్” అనే ఈవెంట్ కనపడింది. బ్లాక్‌షాని పోలీసులు మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ లో పట్టుకున్నారు. కనుక దాని చుట్టూ ఓ కధ అల్లి జైలు శిక్ష వేయించారు. కీనన్ ‘ది వారింగ్‌టన్ రైట్స్’ అని ఓ పేజి తెరిచి 24 గంటల్లోనే క్లోజ్ చేసేశాడు. కాని ఉద్దేశ్యపూర్వకంగా వీళ్ళిద్దరూ అల్లర్లను ప్రోత్సహించారని సీరియస్ క్రైమ్ కింద నాలుగేళ్ళ జైలువాసం వడ్డించారు. ఇలా చాలామంది జైలు పాలయ్యారు.
మెజిస్ట్రేట్, అల్లర్ల నిందుతులకు ఎలా శిక్షించాలో తనకు ఆదేశాలు ఉన్నాయని చెప్పింది. మితవాద ప్రభుత్వం నుండి ఆదేశాల మేరకే జడ్జిలు రాజకీయ తీర్పులిచ్చినట్లు దీనితో స్పస్టమయ్యింది. లండన్ పోలీసులు ఒక దశలో ఫేస్ బుక్, ట్విట్టర్ లను “స్విచ్ ఆఫ్” చేయాలని భావించినట్లుగా ‘ది గార్డియన్’ పత్రిక తెలిపింది. అందుకే ఇప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్ లు లండన్‌లో “మోస్ట్ వాంటెడ్”
–
కార్టూనిస్టు: విక్ మెన్, వెనిజులా
—

అలాంటి సున్నిత వాతావరణంలో అలాంటి పేజిలు మొదలు పెట్టటం అంత శ్రేయస్కరం, అభినించదాగ్గ పవి కాదు కదా! ముందు ముందు ఇలాంటి అల్లర్లలో సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ముఖ్య భూమిక పోషించే వీలుంది. కనుక ఇప్పుడు వీరికి విధించిన శిక్ష ముందు ముందు ఒక హెచ్చరిక మాదిరిగా పని చేస్తుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారుగా!
ముందు ముందు హెచ్చరికగా పనికొస్తుందని ఓ వందమందిని అన్యాయంగా, చట్ట విరుద్ధంగా జైల్లో పెట్టడం అన్యాయం కాదా? నేను చెప్పిన ఇద్దరికీ అల్లర్లలో ప్రత్యక్ష భాగస్వామ్యం లేదు. చుట్టూ ఉన్న పరిస్ధితికి అనుగుణంగా పేరడీగానో, సరదా గానో ఇలాంటి పనులు చేయడం కద్దు. అలాంటివారిని హెచ్చరికతో వదిలి పెట్టాలి వాస్తవంగా. ఏకంగా నాలుగేళ్ళు జైల్లో పెడితే వారి తల్లిదండ్రులు, వారి కేరీర్ ఇవన్నీ అవిరేనా? లండన్ మెజిస్ట్రేట్ కోర్టుల్లో కన్విక్షన్ రేటు కేవలం రెండు శాతం మాత్రమే. అటువంటిది, అమాయకులకు కేవలం కొన్ని రోజుల్లోనే కామెరూన్ ఆదేశాలతో నాలుగేళ్ళు (కొంతమండికి పదేళ్ళు కూడా వేశారు) జైలు శిక్ష విధించడం అంత తేలిగ్గా ఎలా తీసుకోగలం? మనుషుల జీవితాల మీద ప్రయోగం ఎలా చేయగలరు?