అన్నా కేంద్రంగా దేశమంతా విస్తరించిన అవినీతి వ్యతిరేక సమరం -ఫొటోలు


నిరవధిక నిరాహార దీక్ష చేయకుండా ప్రభుత్వం అన్నా హజారే అరెస్టు చేయించడంతో అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశమంతా పాకింది. అరెస్టు చేయడం వల్లనే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఇంత స్పందన వచ్చిందని కొందరు సూచిస్తున్నారు. ఆ సూచన నిజం కాకపోవచ్చు. అరెస్టు కాకపోయినప్పటికీ అన్నా హజారే నిరాహార దీక్ష ప్రారంభించిన తర్వాత కూడా ఇదే విధమైన స్పందన వచ్చి ఉండేది. కాకపోతే అన్నా అరెస్టు వలన ప్రజల్లో భావోద్వేగాలు అదనంగా వచ్చి చేరాయి. ఈ భావోద్వేగాలు అన్నాకు వస్తున్న మద్దతు మరింతకాలం కొనసాగడానికి దోహదం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాపితంగా వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఉద్యమించిన ఈ ఫొటోలను, ది హిందూ, రాయిటర్స్ సంస్ధలు అందించాయి.

2 thoughts on “అన్నా కేంద్రంగా దేశమంతా విస్తరించిన అవినీతి వ్యతిరేక సమరం -ఫొటోలు

  1. నమస్కారం. మీ శీర్షిక లో “అవినీతి సమరం” కు బదులు “అవినీతి పై సమరం” లేదా “అవినీతి వ్యతిరేక సమరం” అని ఉండాలనుకుంటాను. లేకపోతే అది వ్యతిరేకార్ధం ఇస్తుంది. ఇది కేవలం సూచన మాత్రమే.

  2. ఆంగ్లంలో ముఖ్యమైన పదాల్ని ప్రిపొజిషన్స్ లేకుండా వరుసగా పేర్చి హెడ్డింగ్ పెట్టేస్తారు. అక్కడ అర్ధమైపోతుంది. ఆ పద్ధతినే తెలుగులో వాడాలని ప్రయత్నం చేశా. మీ స్పందనను బట్టి అదేమంత బాగోలేదని అర్ధం అవుతోంది. మారుస్తున్నాను. కృతజ్ఞతలు.

వ్యాఖ్యానించండి