యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా రుణ సంక్షోభంలో ఉన్న సంగతి విదితమే. యూరోపియన్ రుణ సంక్షోభం ఫలితంగా గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలు దివాలా అంచుకు చేరాయి.స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్సులు సంక్షోభం బాటలో ఉన్నాయి. బ్రిటన్, జర్మనీల పరిస్ధితి కూడా ఏమంత ఘనంగా లేదు. ఇటీవల యూరప్ పర్యటించిన చైనా ప్రధాని, రుణ సంక్షోభం నుండి బైటికి రావడానికి సహాయం చేయడానికి చైనా రెడీ అని హామీ ఇచ్చాడు. అమెరికా అప్పులో దాదాపు రెండు ట్రిలియన్ల వరకు చైనా నిధులే ఉన్నాయి. దీనితో అమెరికా, యూరప్ ల రుణ సంక్షోభం ఒక విధంగా చైనా పైన కూడా ఆధారపడి ఉందని చెప్పవచ్చు.
సంక్షోభం వలన చైనా తన నిధులను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. అలా వెనక్కి తీసుకోకపోవడం అంటే అమెరికా, యూరప్ లకు సహాయం చేస్తున్నట్లే అర్ధం. హాలీవుడ్ ఫైటింగ్ సినిమాల్లో విలన్ ఫైటర్ అతి భయంకర రూపంలో ఉంటాడు. అప్పటివరకూ తనకు ఎదురు నిలిచిన వారందర్నీ మట్టి కరిపించి విజయ నాదం చేస్తుంటాడు. ఇంకెవరైనా ఉన్నారా? అని రిఫరీ అడుగుతుంటాడు. ప్రేక్షకుల నుండి సమాధానం ఉండదు. ఎవరూ లేరని నిశ్చయించుకుని రిఫరీ “విజేత ఎవరంటే……” అంటూ విలన్ ఫైటర్ చేయిని ఎత్తుతుండగా రంగ ప్రవేశం చేస్తాడు మన హీరో “నేనున్నా….” అంటూ.
కొండలా పేరుకున్న అప్పు విలన్ ఫైటర్ అయితే, అమెరికా, యూరప్ లు ఓడించబడ్డ ఫైటర్లు కాగా, హీరోగా ఎంట్రీ ఇచ్చే ఫైటరే ‘చైనా’.
–
రిఫరీ: విజేత ఎవరంటే……..
–
కార్టూనిస్టు: కాల్, ది ఎకనమిస్టు, లండన్
—
