2008 లో అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల కాలానికి ఒక్కసారి వెళితే… ఒబామా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనాలు పట్టారు. అర్ధం లేని రెండు దురాక్రమణ యుద్ధాలతో అమెరికాపై రుణ భారం పెంచుతూ పోయిన జార్జి బుష్ పాలన పట్ల అమెరికన్లు విసిగిపోయి ఉన్నారు. తనను గెలిపిస్తే ఆఫ్ఘన్, ఇరాక్ లనుండి సైన్యాన్ని వెనక్కి రప్పిస్తానని నమ్మ బలికాడు. ముస్లిం ప్రపంచంతో సంబంధాలు మెరుగుపరుచుకుంటానన్నాడు. ఇరాన్, రష్యా లతో కొత్త రకం సంబంధాలు ఉంటాయన్నాడు. పాలస్తీనా సమస్యని పరిష్కరిస్తానన్నాడు.
ఇప్పుడు బారక్ ఒబామా, సరిగ్గా అప్పటి విధానాలకి వ్యతిరేక దిశలో నిలబడి ఉన్నాడు. ఆఫ్ఘన్ లో సైనికులు ముప్ఫైవేలమందిని అదనంగా పెంచాడు. పాలస్తీనా చర్చలు రెండు నెలలు సాగి మూలనపడ్డాయి. ముస్లిం ప్రపంచంతో సంబంధాలు మెరుగు తర్వాత ఉన్నవి కూడా చెడినాయి. ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల నిర్మాణం కొనసాగుతోంది. యుద్ధాల నష్టం పెరిగింది. కొత్తగా లిబియా యుద్ధం మొదలైంది.
–
కార్టూనిస్టు: గాడో, డెయిలీ నేషన్, నైరోబి, కీన్యా
–
