తీహార్ జైలుకి తరలించబడ్డ పౌర సమాజ కార్యకర్తలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఐ.బి.ఎన్ ఛానెల్ ప్రకటించింది. విడుదలయ్యాక కిరణ్ బేడీతో చేసిన ఇంటర్వూ ఆడియోని కూడా ఐ.బి.ఎన్ ప్రసారం చేసింది. ఏం జరిగిందీ తనకు తెలియదనీ మమ్మల్ని మాత్రం విడుదల చేశారనీ కిరణ్ బేడీ తెలిపింది. కిరణ్ బేడీతో పాటు సీనియర్ లాయర్ శాంతి భూషణ్ కూడా విడుదలయ్యారు. ఇంకా ఇతర పౌర సమాజ కార్యకర్తలయిన అరవింద్ కేజ్రీవాల్, సిసోడియాలు విడుదలైందీ లేనిదీ
అన్నా హజారేను కూడా మరి కొద్ది సేపట్లో విడుదల చేయవచ్చని 8 గంటల సమయంలో వార్తా ఛానెళ్ళు ప్రకటిస్తున్నాయి విడుదల ఉత్తర్వులను అధికారులు జైలుకి పంపినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వమే పూనుకుని విడుదల చేయడం, అరెస్టుపై వచ్చిన ప్రజాస్పందన ప్రభావమే కావచ్చని భావిస్తున్నారు. ఇతర వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.